ఇటలీ దేశీవాళీ క్రికెట్ జట్టు స్టార్ క్రికెట్ సీసీ ప్రయాణిస్తున్న బస్సుపై కొంతమంది దుండగలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో ఆటగాళ్ల క్రికెట్ కిట్‌లు, జెర్సీలు, షూలు, ఇతర క్రికెట్ ఉపకరణాలను దుండగలు అపహరించినట్లు తెలుస్తోంది. ఈసీఎస్ ఇటలీ సూపర్ సిరీస్‌లో భాగంగా మంగళవారం రోమా సీసీ జట్టుతో స్టార్ క్రికెట్ సీసీ తలపడాల్సింది. హోటల్ నుంచి రోమ్‌లోని రోమా స్పినాసెటో క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకునే క్రమంలో ఈ దాడి జరిగనట్లు సమాచారం.
దీంతో ఇరు జట్లు మధ్య జరగాల్సిన మ్యాచ్ రీ షెడ్యూల్ చేయబడింది. ఇక ఈ విషయాన్ని యూరోపియన్ క్రికెట్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. "క్రికెట్ స్టార్స్ సీసీ బస్సుపై కొంతమంది అగంతుకులు దాడి చేసి కిట్‌లు, జర్సీలు దోపిడీ చేశారు. మంగళవారం క్రికెట్ స్టార్స్ సీసీ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లను రీషెఢ్యూల్ చేశాం" అని యూరోపియన్ క్రికెట్ ట్విటర్‌లో పేర్కొంది.
చదవండి: Ravi Shastri: వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..!
🚨Breaking News🚨Cricket Stars CC have had their team bus broken in to, kit, clothes and shoes all stolen. Their two matches this morning will be rescheduled. For now, they need new kit, and @EuropeanCricket is helping today to make that happen!
— European Cricket (@EuropeanCricket) July 26, 2022
Comments
Please login to add a commentAdd a comment