bus robbery
-
క్రికెటర్ల బస్సుపై దుండగులు దాడి.. కిట్లు, జెర్సీలు దోపిడీ..!
ఇటలీ దేశీవాళీ క్రికెట్ జట్టు స్టార్ క్రికెట్ సీసీ ప్రయాణిస్తున్న బస్సుపై కొంతమంది దుండగలు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో ఆటగాళ్ల క్రికెట్ కిట్లు, జెర్సీలు, షూలు, ఇతర క్రికెట్ ఉపకరణాలను దుండగలు అపహరించినట్లు తెలుస్తోంది. ఈసీఎస్ ఇటలీ సూపర్ సిరీస్‌లో భాగంగా మంగళవారం రోమా సీసీ జట్టుతో స్టార్ క్రికెట్ సీసీ తలపడాల్సింది. హోటల్ నుంచి రోమ్‌లోని రోమా స్పినాసెటో క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకునే క్రమంలో ఈ దాడి జరిగనట్లు సమాచారం. దీంతో ఇరు జట్లు మధ్య జరగాల్సిన మ్యాచ్ రీ షెడ్యూల్ చేయబడింది. ఇక ఈ విషయాన్ని యూరోపియన్ క్రికెట్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. "క్రికెట్ స్టార్స్ సీసీ బస్సుపై కొంతమంది అగంతుకులు దాడి చేసి కిట్లు, జర్సీలు దోపిడీ చేశారు. మంగళవారం క్రికెట్ స్టార్స్ సీసీ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లను రీషెఢ్యూల్ చేశాం" అని యూరోపియన్ క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: Ravi Shastri: వన్డే క్రికెట్ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..! 🚨Breaking News🚨Cricket Stars CC have had their team bus broken in to, kit, clothes and shoes all stolen. Their two matches this morning will be rescheduled. For now, they need new kit, and @EuropeanCricket is helping today to make that happen! — European Cricket (@EuropeanCricket) July 26, 2022 -
ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లింది.. ఆటోడ్రైవర్లు
సాక్షి, హైదరాబాద్: గౌలిగూడ బస్టాండ్ నుంచి కుషాయిగూడకు చెందిన ఆర్టీసీ బస్సును ఎత్తుకుపోయింది అన్నదమ్ములైన ఆటోడ్రైవర్లుగా తేలింది. గతంలో పలు చోరీలు చేసిన ఈ ద్వయం తన సమీప బంధువు ఇచ్చిన ‘సలహా’తో ఈ బస్సు దొంగతనం చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించామని, 8మందిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శనివారం తెలిపారు. చోరీకి సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి తమకు ఫిర్యాదు ఆలస్యంగా అందిందని చెప్పారు. తూర్పు మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఎం.రమేశ్‌తో కలసి తన కార్యాలయంలో మీడియాకు ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. తీరు మార్చుకోమంటే పంథా మార్చుకుని... నగరంలోని చిలకలగూడకు చెందిన అన్నదమ్ములు సయ్యద్ అబేద్, సయ్యద్ జహీద్ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్లు. ఇలా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందక చోరీల బాటపట్టారు. అబేద్ ఒంటరిగా 2015 నుంచి 2018 వరకు గోపాలపురం, పంజగుట్ట, నల్లకుంట, ఎల్బీనగర్, మీర్‌చౌక్, మలక్‌పేటల్లో 9 చోరీలు చేశాడు. గత ఏడాది జహీద్ కూడా ఇతడికి తోడయ్యాడు. దీంతో ఇద్దరూ కలసి మలక్‌పేట, ఎల్బీనగర్, హయత్‌నగర్, మారేడ్‌పల్లి, మీర్పేట్, ఉప్పల్‌లో 7 నేరాలు చేశారు. ఇలా పదేపదే నేరాలు చేస్తూ జైలుకు వెళ్తున్న వీరిపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉండే సమీప బంధువు మహ్మద్ నవీద్ స్క్రాప్ వ్యాపారం చేస్తుంటారని, అక్కడకు వెళ్లి ఆయనతో కలసి పని చేసుకుని బతకాలని సూచించింది. దీంతో వారం క్రితం వీరు నాందేడ్ వెళ్లి అతడిని కలిశారు. వాస్తవానికి ఓ మరమ్మతుల దుకాణంలో చేరాలని భావించారు. నవీద్ ఓ సందర్భంలో ఏవైనా పాత భారీ వాహనాలు ఉంటే తీసుకురావాలని, తాను ఖరీదు చేస్తానని వీరికి చెప్పాడు. దీనికి ఇద్దరూ అంగీకరించి రూ.లక్షకు ఒప్పందం చేసుకుని రూ.60 వేలు అడ్వాన్స్ తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి లారీ లేదా బస్సు చోరీ చేయాలని భావించారు. నవీద్‌కు నాందేడ్‌లో నేరచరిత్ర ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. భారీ వాహనాలు నడపడంలో అబేద్ దిట్ట... దుబాయ్‌లో ఉండి వచ్చిన అబేద్ భారీ వాహనాలను వేగంగా నడపడంలో దిట్ట. బుధవారం నగరానికి చేరుకున్న వీరు భారీ వాహనం చోరీకి అనువైన ప్రాంతం కోసం వెతికారు. వీరు ఆటోడ్రైవర్లుగా గౌలిగూడ బస్టాండ్ పరిసరాల్లో ఎక్కువగా సంచరించారు. రాత్రివేళ అక్కడ బస్సులు ఆపి ఉంచడాన్ని వీరు గమనించారు. దీంతో నేరుగా అక్కడకు వెళ్లిన వీరు కుషాయిగూడ డిపోకు చెందిన 3డీ రూట్ బస్సును సెల్ఫ్‌స్టార్ట్‌తో స్టార్ట్ చేశారు. బస్సును ఎంట్రీ గేటు నుంచి రాత్రి 12 గంటలకు తీసుకుని బయటకు వచ్చారు. అక్కడ నుంచి తూప్రాన్, నిర్మల్, బోకరోల మీదుగా నాందేడ్ వెళ్లారు. బస్సు 2009 మోడల్‌ది కావడం, 480 కి.మీ. ఆపకుండా వేగంగా నడపడంతో నాందేడ్‌కు 35 కి.మీ. దూరంలో యాక్సిల్ రాడ్ విరిగిపోయింది. దీంతో ఓ క్రేన్ మాట్లాడుకుని నాందేడ్‌కు 10 కి.మీ. దూరంలోని తాత్కాలిక షెడ్‌కు చేరుకున్నారు. గ్యాస్ కట్టర్‌తో తుక్కుగా... బస్సు చోరీకి సంబంధించి ఆర్టీసీ అధికారుల నుంచి పోలీసులకు ఫిర్యాదు ఆలస్యంగా అందింది. గురువారం ఉద యం 5.30 గంటలకు డ్రైవర్ జె.వెంకటేశం బస్సు చోరీ అయినట్లు గుర్తించారు. విష యం పోలీసులకు చేరే వరకు ఉదయం 10 గంటలైంది. అప్పటికే అబేద్, జహీ బస్సును తాత్కాలిక షెడ్‌కు తరలించేశారు. అక్కడ నవీద్, అతడి భాగస్వామి ఫారూఖ్ వద్ద పని చేసే గ్యాస్ కటింగ్ వర్కర్లు మహ్మద్ జుబేర్, మహ్మద్ ఒమర్, సయ్యద్ సల్మాన్, మహ్మద్ షఫీఖ్, మహ్మద్ కలీం సిద్ధంగా ఉన్నారు. గ్యాస్ కట్టర్లతో ఇంజన్, చాసిస్ మినహా మొత్తం తుక్కుగా మార్చేశారు. అఫ్జల్‌గంజ్ ఏసీపీ దేవేందర్ నేతృత్వంలోని బృందం సీసీ కెమెరాల ఫీడ్‌తో పాటు వివిధ మార్గాల్లో అన్వేషిస్తూ బస్సును తుక్కుగా మారుస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న ఫారూఖ్ మినహా 8 మందిని పట్టుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకోవడం మరికాస్త ఆలస్యమైనా బస్సు పూర్తిగా అదృశ్యమైపోయేదే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబేద్‌పై గతంలో మలక్‌పేట పోలీసులు పీడీ యాక్ట్ సైతం ప్రయోగించారు. ఈ బస్సు చోరీ నేపథ్యంలో గౌలిగూడ బస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ లోపాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చక్కదిద్దడం కోసం సుల్తాన్‌బజార్ శాంతిభద్రతల విభాగం ఏసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, సీఎస్‌డబ్ల్యూ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం వారితో కూడిన బృందం శనివారం ఆ ప్రాంతంలో సెక్యూరిటి ఆడిట్ నిర్వహించింది. దీనిపై త్వరలో ఓ నివేదిక రూపొందించనుంది. -
ఆర్టీసీకి సవాల్‌గా మారిన బస్సుల భద్రత
సాక్షి, సిటీబ్యూరో: గౌలిగూడ బస్సు చోరీ ఉదంతంతో ఆర్టీసీ అప్రమత్తమైంది. మరోసారి ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు భద్రతా చర్యలకు ఉపక్రమించింది. నైట్ అవుట్ బస్సులపైన ఎప్పటికప్పుడు సమీప పోలీస్స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో పాటు, స్టీరింగ్ లాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. మరోవైపు రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు బస్సుచోరీకి గల కారణాలు, సంస్థాగతమైన లోపాలు, తదితర అంశాలను పరిశీలించి సమగ్ర నివేదికను అందజేసేందుకు శుక్రవారం చీఫ్ మేనేజర్ కృష్ణకాంత్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీధర్, ఉప్పల్ డిపో మేనేజర్ వెంకట్‌రెడ్డిలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బస్సు ఎందుకు చోరీకి గురైందీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదిక అందజేయనుంది. దాని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ తెలిపారు. నైట్ అవుట్ బస్సులన్నీ డిపో బయటే.. గ్రేటర్లోప్రతి రోజు 3,550 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. తెల్లవారు జామున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెండు షిఫ్టుల్లో తిరిగే బస్సులన్నీ డిపోలకు చేరుకుంటున్నాయి. డిపోల నిర్వహణ కోసం ఆర్టీసీ సొంత భద్రతను కలిగి ఉంది. కానీ మూడో షిఫ్టులో రాత్రి ఆలస్యంగా విధుల్లో చేరే సుమారు 700 నుంచి 1000 బస్సులను మాత్రం రాత్రి 12 గంటల తరువాత ఆఖరు బస్టాప్ వద్ద నిలిపివేస్తారు. ఆబస్సులు తిరిగి ఉదయం విధులు ముగించుకొని డిపోలకు చేరతాయి. కుషాయిగూడ నుంచి ఆఫ్జల్ గంజ్ వరకు రాకపోకలు సాగించే బస్సును ఇదే పద్ధతిలో డ్రైవర్ గౌలిగూడ వద్ద నిలిపి అక్కడే ఉన్న ఆర్టీసీ విశ్రాంతి భవనంలో నిద్రపోయాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు బస్సును అపహరించుకు వెళ్లారు. గతంలో కూడా ఇక్కడ నిలిపి ఉంచిన తాండూర్ డిపోకు చెందిన ఒక బస్సును అపహరించుకెళ్లి జూపార్కు వద్ద వదిలేసి వెళ్లారు. అంతకుముందు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగి ఉన్న బస్సును తీసుకెళ్లి నార్కట్‌పల్లి వద్ద వదిలారు. కానీ తాజాగా బస్సును అపహరించి నాందేడ్‌కు తీసుకెళ్లడంతో పాటు దాని విడి భాగాలన్నింటినీ తొలగించి సొమ్ము చేసుకోవడం వెనుక నిందితులు పెద్ద నెట్ వర్క్‌నే కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్టీసీకి రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. బస్సు నంబర్ చూపుతున్న సిబ్బంది కమిటీ ఏం చేస్తుందంటే.. గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంది. నైట్ అవుట్ బస్సులను నిలిపి ఉంచే పార్కింగ్ స్థలాలు, బస్టాప్‌లు, ఇతరత్రా ప్రదేశాలను పరిశీలించి అక్కడ బస్సుల భద్రతకు ఎలాంటి వాతావరణం ఉందనే అంశాన్ని నిర్ధారిస్తుంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో, పోలీస్ పెట్రోలింగ్‌కు దూరంగా ఉండే ప్రదేశాల్లో బస్సులను నిలపకుండా జాగ్రత్తలు పాటిస్తారు. అలాగే నైట్ అవుట్ బస్సులపైన మూడు కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు, కమిషనర్లతోనూ సంప్రదింపులు జరుపుతారు. ఇదే సమయంలో గౌలిగూడ బస్సు చోరీ కారణాలను కూడా నిగ్గు తేలుస్తారు. ఈ కమిటీ అందజేసే నివేదిక ఆధారంగా బస్సుల భద్రతపై ఆర్టీసీ దృష్టి సారించనుంది. -
ప్రయాణికుల ముసుగులో బస్సు దోపిడీలు
నేరేడ్మెట్: ప్రయాణికుల్లా బస్సు ఎక్కుతారు. టికెట్ తీసుకుంటారు. తోటి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న అనవతరం లూటీకి పాల్పడి ఎవరికీ అనుమానం రాకుండా తరువాతి స్టేజీలో దిగిపోతారు. ప్రయాణికుల ముసుగులో ప్రైవేట్ లగ్జరీ బస్సులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం, అమ్రోహ జిల్లా, చుచిలా కలాన్ గ్రామానికి జావేద్ చౌదరి బ్యాగుల వ్యాపారం చేసేవాడు. అతను అదే ప్రాంతానికి చెందిన కూలర్ మెకానిక్ మహ్మద్ జునైద్, జావేద్ చౌదరి బావ షాబాన్ఖాన్తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ముగ్గురు కలిసి గత మూడేళ్లుగా బస్సుల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ లగ్జరీ బస్సుల్లో టికెట్లు బుక్‌చేసుకొని ప్రయాణం చేసేవారు.. బస్సుల్లో తోటి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న అనంతరం ఇద్దరు నిందితులు ప్రయాణికుల లగేజీని కిందకు దించుతుండగా, మూడో నిందితుడు బస్సులో ఎవరైనా గమనిస్తున్నారా.. అని పరిశీలించేవాడు. అనంతరం ఇద్దరూ సీట్లో కూర్చొని బ్యాగ్‌లు, బ్రీప్కేస్లపై బ్లాంకెట్ కప్పి చిన్న టార్చిలైట్ వెలుతురులో వాటిని తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను చోరీ చేసేవారు. అనంతరం బ్యాగ్‌లు, బ్రీప్కేస్లను యధాస్థానంలో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా తరువాతి స్టేజీలో దిగిపోయేవారు.గత ఫిబ్రవరి 6న నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని దీనదయాళనగర్కు చెందిన వెంకటరమణ, తన భార్య భాస్కర లక్ష్మితో కలిసి రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సులో వచ్చాడు. ఎల్బీ నగర్లో బస్సు దిగి ఇంటికి చేరుకున్న వారు తమ బ్యాగ్‌లను పరిశీలించగా అందులో ఉన్న 15.8 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి ఫిబ్రవరి 7న నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి ఎస్ఓటీ, నేరేడ్మెట్ పోలీసుల విచారణలో విశ్వసనీయ సమాచారం మేరకు సికింద్రబాద్‌లో జావేద్చౌదరి అతని సహాయకుడు మహ్మద్ జునైద్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. కొన్నేళ్లుగా ఈ తరహా లూటీలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారని ఏసీపీ తెలిపారు. వారి నుంచి 9తులాల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు, మాస్టర్ కీని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఎక్కడెక్కడ దోపిడీలు చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మస్వామి, ఎస్ఓటీ సీఐ శివకుమార్, డీఐ రాజేందర్‌గౌడ్, ఎస్ఐ అవినాష్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. ఘట్కేసరి మండలం ఏదులాబాద్‌లో ఆగి ఉన్న బస్సును దుండగులు అపహరించుకుని పోయారు. దీంతో బస్సు డ్రైవర్ పోలీసులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటిలాగే సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు గత రాత్రి ఏదులాబాద్ చేరుకుంది. నైట్ హాల్ట్ కావడంతో డ్రైవర్ బస్సు నిలిపి... నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారే లేచిన డ్రైవర్‌కు బస్సు కనిపించలేదు. దాంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఉన్నతాధికారుల సూచన మేరకు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన బస్సు కుషాయిగూడకు చెందినదని పోలీసులు తెలిపారు. -
రాష్ట్రానికి చేరుకున్న బస్సు దోపిడీ బాధితులు
సాక్షి నెట్వర్క్: షిర్డీ వెళ్లివస్తూ మహారాష్ట్రలో దోపిడీకి గురైన బస్సు ప్రయాణికులు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నారు. ఆర్టీసీ విజిలెన్స్ డెరైక్టర్ వెంకట్రాములు ఆధ్వర్యంలోని బృందం ప్రత్యేక బస్సులో ప్రయాణికులను జహీరాబాద్‌కు తీసుకొచ్చారు. హోటల్లో భోజనం పెట్టించాక వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశామని జాంఖేడ్ ఠాణా హెడ్‌కానిస్టేబుల్ గాడిల్కర్ తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడిన గాడిల్కర్ కేసు వివరాలు తెలిపారు. ‘‘36 మంది ప్రయాణికులతో హైదరాబాద్-2 డిపోకు చెందిన బస్సు శనివారం సాయంత్రం షిర్డీ నుంచి బయలుదేరింది. రాత్రి 10.15 గంటల ప్రాంతంలో అహ్మద్‌నగర్ జిల్లాలోని జాంఖేడ్-కర్డీ రోడ్లో ఆనంద్‌వాడీ శివార్లకు చేరుకుంది. రోడ్డుపై కొన్ని ద్విచక్ర వాహనాలు అడ్డంగా ఉండటంతో డ్రైవర్ గోవర్థన్ బస్సును ఆపారు. వెంటనే 8 నుంచి 10 మంది దుండగులు బస్సులోకి చొరబడ్డారు. నాటు తుపాకులు, కత్తులను చూపించి ప్రయాణికులకు బెదిరించారు. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు, సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలతో పాటు నగదునూ అపహరించారు. ఈ ఘటనలో రూ.2,65,900 సొత్తు దోపిడీకి గురైంది’’ అని గాడిల్కర్ వివరించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మహ్మద్ మఖ్రుం ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.