రాష్ట్రానికి చేరుకున్న బస్సు దోపిడీ బాధితులు | Bus robber victims reach to state | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి చేరుకున్న బస్సు దోపిడీ బాధితులు

Published Mon, Nov 18 2013 3:50 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Bus robber victims reach to state

 సాక్షి నెట్‌వర్క్: షిర్డీ వెళ్లివస్తూ మహారాష్ట్రలో దోపిడీకి గురైన బస్సు ప్రయాణికులు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నారు. ఆర్టీసీ విజిలెన్స్ డెరైక్టర్ వెంకట్‌రాములు ఆధ్వర్యంలోని బృందం ప్రత్యేక బస్సులో ప్రయాణికులను జహీరాబాద్‌కు తీసుకొచ్చారు. హోటల్లో భోజనం పెట్టించాక వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశామని జాంఖేడ్ ఠాణా హెడ్‌కానిస్టేబుల్ గాడిల్కర్ తెలిపారు.  ఆదివారం ‘సాక్షి’తో ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడిన గాడిల్కర్ కేసు వివరాలు తెలిపారు. ‘‘36 మంది ప్రయాణికులతో హైదరాబాద్-2 డిపోకు చెందిన బస్సు శనివారం సాయంత్రం షిర్డీ నుంచి బయలుదేరింది.
 
 రాత్రి 10.15 గంటల ప్రాంతంలో అహ్మద్‌నగర్ జిల్లాలోని జాంఖేడ్-కర్డీ రోడ్‌లో ఆనంద్‌వాడీ శివార్లకు చేరుకుంది. రోడ్డుపై కొన్ని ద్విచక్ర వాహనాలు అడ్డంగా ఉండటంతో డ్రైవర్ గోవర్థన్ బస్సును ఆపారు. వెంటనే 8 నుంచి 10 మంది దుండగులు బస్సులోకి చొరబడ్డారు. నాటు తుపాకులు, కత్తులను చూపించి ప్రయాణికులకు బెదిరించారు. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలతో పాటు నగదునూ అపహరించారు. ఈ ఘటనలో రూ.2,65,900 సొత్తు దోపిడీకి గురైంది’’ అని గాడిల్కర్ వివరించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మహ్మద్ మఖ్రుం ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement