cricketer arrested
-
Mrinank Singh: మాజీ క్రికెటర్ అరెస్ట్.. కారణం ఇదే..
ఢిల్లీ: హర్యానా మాజీ క్రికెటర్ మృణాక్ సింగ్(25)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను స్టార్ క్రికెటర్, ఐపీఎస్ అధికారిని అంటూ లగ్జరీ హెటల్స్‌లో ఉండి.. బిల్లులను ఎగ్గొట్టిన కేసులో మృణాక్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, మృణాక్ సింగ్ హర్యానాలో అండర్-19 స్థాయిలో జట్టుకు ప్రాతినిధ్యం వహించగా, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీమ్‌లో కొనసాగాడు. అయితే, మృణాక్ సింగ్ 2022 జూలైలో ఢిల్లీలో ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ కృష్ణాలో బస చేశాడు. ఈ క్రమంలో హోటల్ బిల్లు రూ.5లక్షలపైగా చేరింది. తీరా హోటల్ ఖాళీ చేస్తూ బిల్లు చెల్లించలేదు. ఈ సందర్బంగా తాను ఓ ప్రముఖ స్పోర్ట్స్ సంస్థకు అంబాసిడర్‌గా ఉన్నానని వారితో గొడవకు దిగారు. సదరు సంస్థనే తన బిల్లులను చెల్లిస్తుందని చెప్పుకొచ్చాడు. అనంతరం, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే, ఇప్పటికే వరకు రూ.5,53,362లకు గానూ.. మృణాక్ కేవలం రూ.2 లక్షలను చెల్లించాడు. దీంతో, పలుమార్లు హోటల్ యాజమాన్యం మృణాక్ను సంప్రదించినప్పటికీ అతడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలో విసిగిపోయిన హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. అనంతరం, మృణాక్కు నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసులకు మృణాక్ స్పందించకపోవడంతో అతడి ఇంటికి వెళ్లి తన తండ్రికి జరిగిన విషయాలను వెల్లడించారు. ఈ సందర్బంగా మృణాల్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అతను దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించినట్లయితే అతన్ని అరెస్టు చేయడానికి లుక్ అవుట్ సర్క్యులర్‌ను కూడా జారీ చేశారు. కాగా, డిసెంబర్ 25వ తేదీన మృణాక్ హాంకాంగ్ వెళ్లే ప్రయత్నం చేయగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. Former cricketer Mrinank Singh was arrested for allegedly duping Rishabh Pant of ₹1.6 crore and cheating luxury hotels by posing as an IPS officer. . .#RishabhPant #Conman #MrinankSingh pic.twitter.com/eYuCFG2XIe — JioNews (@JioNews) December 28, 2023 ఇదిలా ఉండగా.. మృణాక్ సింగ్ గతంలో కూడా పలువురిని మోసం చేశాడు. అతడి బాధితుల్లో క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. లగ్జరీ వస్తువుల కొనుగోలు విషయంతో రూ.1.63కోట్లకు పంత్‌ను సింగ్ మోసం చేశాడు. దీంతో, పంత్ లీగల్ ప్రొసీడ్ కావాల్సి వచ్చింది. ఇక, రూ.6 లక్షలకు బిజినెస్ మ్యాన్‌ను మోసం చేసినందుకు ముంబై ఆర్టూర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఒక సినిమా డైరెక్టర్‌ను మోసగించినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ కేసుపై ఏడాదికి పైగా విచారణ జరగగా గత వారం కోర్టులో హాజరుపరచాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అతన్ని అరెస్టు చేసిన జుహు పోలీసులు, అతని దగ్గర నుంచి రూ.6 లక్షల నగదు రికవరీ చేశారు. మరోవైపు.. మృణాక్ సింగ్ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బస చేయడం, మోడల్స్‌తో పార్టీలు చేసుకోవడం, వారితో ఫొటోలు దిగడం, తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి విదేశాలకు వెళ్లడం వంటి విలాసవంతమైన జీవనశైలిని గడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా మృణాల్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. -
ఆసీస్‌లో లంక క్రికెటర్ గుణతిలక అరెస్ట్
సిడ్నీ: టి20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక కటకటాల పాలయ్యాడు. ఈ నెల 2న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో సిడ్నీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల గుణతిలకపై అత్యాచారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు సిడ్నీ పోలీసులు వెల్లడించారు. దీంతో సూపర్–12లో నిష్క్రమించిన శ్రీలంక జట్టు గుణతిలక లేకుండానే ఆదివారం స్వదేశానికి పయనమైంది. ఆన్లైన్ డేటింగ్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన లంక క్రికెటర్ ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో ఒక్క నమీబియాతో ఆడిన గుణతిలక గాయం కారణంగా ఇతర మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్లో 8 టెస్టులు, 47 వన్డేలు, 46 టి20లు ఆడిన గుణతిలక వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రపడ్డాడు. 2017లో అనుచిత ప్రవర్తన, ట్రెయినింగ్ సెషన్‌కు చెప్పాపెట్టకుండా గైర్హాజరు కావడంతో 6 వన్డేల సస్పెన్షన్ వేటు వేశారు. 2018లో కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించడంతో ఆరు నెలలు నిషేధం విధించారు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో బయో బబుల్ బయటకు రావడంతో ఏడాది పాటు సస్పెండ్ చేసి చివరకు ఆరు నెలలకు తగ్గించారు. -
మిశ్రా అరెస్ట్, విడుదల
* మూడు గంటల విచారణ * వివరాలు తెలుసుకుంటున్నాం: బీసీసీఐ సాక్షి, బెంగళూరు: తన స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్‌పై దాడి చేశాడన్న కారణంతో భారత క్రికెటర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు గంటల విచారణ అనంతరం ‘స్టేషన్ బెయిల్’పై విడుదల చేశారు. ‘మిశ్రా వాదనను విన్నాం. సంఘటనకు సంబంధించి అతని నుంచి కొన్ని విషయాలను సేకరించాం. విచారణ పూర్తి చేసి త్వరలోనే చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేస్తాం. తర్వాత కోర్టు సమన్లు జారీ చేసి కేసును విచారిస్తుంది’ అని సిటీ సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. అనుమతి లేకుండా క్రికెటర్ల గదిలోకి రాకూడదనే నిబంధన ఉన్న నేపథ్యంలో తాను వందనా జైన్‌ను మందలించానే తప్ప ఆమెపై దాడికి పాల్పడలేదని విచారణలో మిశ్రా పేర్కొన్నట్లు సమాచారం. విచారణ అనంతరం మంగళవారం మధ్యాహ్నం మిశ్రా అరెస్ట్‌ను చూపారు. అనంతరం మిశ్రా, వందనాల స్నేహితుడైన రాఘవన్ బెయిల్ ష్యూరిటీ ఇవ్వడంతో విడుదల చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 325, 354 (ఎ) ప్రకారం పోలీసులు మిశ్రాపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే ఆరు నుంచి ఏడేళ్లు శిక్ష పడే అవకాశముందని పాటిల్ తెలిపారు. సెప్టెంబర్ 25న శిక్షణ కోసం బెంగళూరుకు వచ్చిన తనను కలిసేందుకు హోటల్ రూమ్‌కు వచ్చిన వందనపై మిశ్రా దాడి చేశాడని సమాచారం. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడికి పాల్పడినట్లు సెప్టెంబర్ 27న అశోక్ నగర్ పోలీసు స్టేషన్లో వందన ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన పోలీసులు ఈనెల 20న విచారణకు హాజరుకావాలని క్రికెటర్‌కు నోటీసులు జారీ చేశారు. మరోవైపు క్రికెటర్‌పై పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ‘కేసు విషయం బీసీసీఐ దృష్టికి వచ్చింది. అన్ని అంశాలను తెలుసుకుంటున్నాం. విషయాలు పూర్తిగా తెలిశాకే దాని గురించి మాట్లాడుతాం. పోలీసులు వాళ్ల పని చేస్తున్నారు. నేరంతో క్రికెటర్‌కు సంబంధం ఉందో లేదో మేం తెలుసుకుంటున్నాం. కచ్చితమైన విషయాలు తెలిసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం’ అని శుక్లా వ్యాఖ్యానించారు.