cricketers wifes
-
ఇంతకీ ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటకు యూఏఈలో ఏర్పాట్లు జరుగుతుండగా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)పై సమాలోచనలు చేస్తోంది. ఆటగాళ్ల రక్షణ కోసం ఏర్పాటు చేయబోయే జీవ భద్రత వలయంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన బోర్డును అసలు కంటే కొసరు సమస్యే కాస్త తికమక పెడుతున్నట్లుంది. ఆటగాళ్ల సతీమణులు, ప్రియురాళ్లను బుడగలోకి తీసుకురావాలా లేదంటే ఇప్పుడున్న కరోనా ప్రొటోకాల్ పరిస్థితుల్లో అనుమతి నిరాకరించాలా అన్న అంశంపై బోర్డు తర్జనభర్జన పడుతోంది. దీనిపై ఫ్రాంచైజీల నుంచి భిన్నవాదనలు వచ్చినట్లు తెలిసింది. కొన్ని ఫ్రాంచైజీలేమో అసలే బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా గప్‌చుప్‌గా (ప్రేక్షకుల్లేకుండా) జరిగే ఈవెంట్ కాబట్టి... ఆటగాళ్లతో కనీసం కుటుంబసభ్యుల్ని అనుమతించాలని సూచిస్తున్నాయి. ఇతర ఫ్రాంచైజీలేమో వారిని బుడగలోకి తెస్తే... రెండు, మూడేళ్లున్న పిల్లల సంరక్షణ ఎలా? షాపింగ్‌కని, వేరే చోటుకని బుడగదాటితే ఎదురయ్యే పరిణామాలేంటని వారిస్తున్నాయి. దీనిపై త్వరలోనే బోర్డు నిర్ణయం తీసుకొని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ఎనిమిది ఫ్రాంచైజీలకు జారీచేయనుంది. -
బీసీసీఐలో భగ్గుమన్న విభేదాలు
న్యూఢిల్లీ : క్రికెటర్లతో పాటు సతీమణి, ప్రియసఖిల ప్రయాణ విషయంలో బీసీసీఐలో విభేదాలు భగ్గుమన్నాయి. సతీమణి, ప్రియసఖిల ప్రయాణలపై నిర్ణయాన్ని వెల్లడించాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన్ కోచ్ రవిశాస్త్రిలను సుప్రీం నియమిత పరిపాలకుల కమిటీ(సీఓఏ) కోరడాన్ని బీసీసీఐ అధికారులు, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎమ్ లోధా తప్పుబట్టారు. ప్రపంచకప్ సందర్భంగా నిబంధనలను అతిక్రమిస్తూ తన భార్యను వెంట ఉంచుకున్నాడని ఓ సీనియర్ క్రికెటర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సతీమణుల ప్రయాణ షెడ్యూల్‌పై బీసీసీఐ అధికారుల మధ్య విభేదాలు చెలరేగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆటగాళ్ల మధ్య గొడవలని వచ్చిన కథనాలను పట్టించుకోనప్పుడు.. ఓ సీనియర్ ఆటగాడిపై వచ్చిన ఆరోపణలను ఇంత వేగంగా సమీక్షించాల్సిన అవసరం ఏముందని ఓ బీసీసీఐ అధికారి ప్రశ్నించారు. ఇక సతీమణుల ప్రయాణ షెడ్యూల్‌పై వింతైన నివేదికలు రావడం బీసీసీఐ అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఆటగాళ్లతో సతీమణులను అనుమంతించే సమయం ఆటగాళ్లను బట్టి ఉంటుందని, ఈ నేపథ్యంలో మళ్లీ కెప్టెన్, కోచ్‌లకే ఆ అధికారాన్ని కల్పించడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సతీమణుల ప్రయాణ విషయంలో ఇలా భేదాభిప్రాయాలు రావడం భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారని బీసీసీఐ అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: ‘తోడు–నీడ’కు సై... -
సన్ రైజర్స్ ఆటగాళ్లకు భార్యల సర్ప్రైజ్ గిఫ్ట్
హైదరాబాద్: ఐపీఎల్ 2016 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంచనాలకు మించి రాణించింది. సీజన్ ఆరంభం నుంచి విజయాల పరంపర కొనసాగిస్తూ సన్‌రైజర్స్ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. మైదానంలో తెగకష్టపడుతున్న ఆటగాళ్లకు వారి భార్యలు ఇటీవల సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. సన్ రైజర్స్ ఆటగాళ్లు బస చేసిన టీమ్ హోటల్లో వారి భార్యలు వంట చేయడంలో తమ నైపుణ్యం ప్రదర్శించారు. శిఖర్ ధవన్, నమన్ ఓజా, అక్షత్ రెడ్డి, విపుల్ శర్మ భార్యలు రంగంలోకి దిగి ప్రత్యేక వంటకాలు చేశారు. ధవన్ భార్య ఆలూ పరోఠాలు, అక్షత్ భార్య బగార రైస్, విపుల్ భార్య రాజ్మా కూర చేశారు. గత శుక్రవారం రాయ్ పూర్ లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడినా హోటల్ తమ భార్యల చేతివంట తిని హైదరాబాద్ ఆటగాళ్లు సర్ప్రైజ్ అయ్యారు.