సన్ రైజర్స్ ఆటగాళ్లకు భార్యల సర్ప్రైజ్ గిఫ్ట్ | Shikhar Dhawan's Wife Prepared A Special Meal For Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

సన్ రైజర్స్ ఆటగాళ్లకు భార్యల సర్ప్రైజ్ గిఫ్ట్

Published Mon, May 23 2016 4:53 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

సన్ రైజర్స్ ఆటగాళ్లకు భార్యల సర్ప్రైజ్ గిఫ్ట్

సన్ రైజర్స్ ఆటగాళ్లకు భార్యల సర్ప్రైజ్ గిఫ్ట్

హైదరాబాద్: ఐపీఎల్ 2016 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అంచనాలకు మించి రాణించింది. సీజన్ ఆరంభం నుంచి విజయాల పరంపర కొనసాగిస్తూ సన్రైజర్స్ ప్లే ఆఫ్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. మైదానంలో తెగకష్టపడుతున్న ఆటగాళ్లకు వారి భార్యలు ఇటీవల సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

సన్ రైజర్స్ ఆటగాళ్లు బస చేసిన టీమ్ హోటల్లో వారి భార్యలు వంట చేయడంలో తమ నైపుణ్యం ప్రదర్శించారు. శిఖర్ ధవన్, నమన్ ఓజా, అక్షత్ రెడ్డి, విపుల్ శర్మ భార్యలు రంగంలోకి దిగి ప్రత్యేక వంటకాలు చేశారు. ధవన్ భార్య ఆలూ పరోఠాలు, అక్షత్ భార్య బగార రైస్, విపుల్ భార్య రాజ్మా కూర చేశారు. గత శుక్రవారం రాయ్ పూర్ లో ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో ఓడినా హోటల్ తమ భార్యల చేతివంట తిని హైదరాబాద్ ఆటగాళ్లు సర్ప్రైజ్ అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement