criticism on narendra modi
-
సంక్షోభం వస్తే ఆయన సైలెంట్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఇందుకు వేదికైంది. ‘ కూతురు లాంటి మణిపూర్ తీవ్ర విద్వేషాగ్నిలో చిక్కుకున్నపుడు తండ్రి స్థానంలో ఉన్న ప్రధాని మోదీ.. ఆమెన కాపాడాల్సిదిపోయి, పట్టించుకోకుండా మరో వైపు తిరిగి నిల్చున్నారు. మోదీ మౌనంగా ఎందుకున్నారని దేశం యావత్తు ప్రశ్నిస్తోంది. ఆయన ఇలా మౌనముద్రలో ఉండటం ఇదే తొలిసారి కాదు. గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో దేశంలో ఎక్కడ సంక్షోభం ఎదురుపడ్డా ఆయన ఇలాగే సైలెంట్ అయిపోయారు’ అని కేజ్రీవాల్ విమర్శించారు. ‘ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిల్చిన మహిళా మల్లయోధులు బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ యాదవ్‌పై లైంగిక ఆరోపణలు చేసినపుడూ మోదీ మౌనవ్రతం చేశారు. ఇదే మహిళా రెజ్లర్లు పతకాలు గెల్చినపుడు వారితో ఫొటోలు దిగేందుకు మొదట ముందుకొచ్చింది మోదీనే. ‘మీరు నా బిడ్డలు’ అని భరోసా ఇచ్చారు. కానీ తీరా వాళ్లు ధర్నాలు చేస్తుంటే మోదీ మౌనముద్రలోకి జారుకున్నారు. కనీసం ప్రధాని హోదాలో ‘నేనున్నాను. ఎంక్వైరీ చేయించి సంబంధిత వ్యక్తుల్ని శిక్షిస్తానని హామీ ఇవ్వలేకపోయారు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కోసం మహిళలు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక మణిపూర్ అంశంలోనూ ఇంతే ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
అవినీతికి ప్రతీక అదానీ.. రాహుల్ విమర్శల వర్షం
కోలారు: అదానీపై చూపిస్తున్న ప్రేమను ప్రధాని మోదీ పేద ప్రజలపై ఇసుమంతైనా చూపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆదివారం కర్ణాటకలోని కోలారు పట్టణంలో నిర్వహించిన జై భారత్ సభలో ప్రధాని మోదీపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. గతంలో కోలారులోనే మోదీపై ఆరోపణలు చేసిన కేసులో రాహుల్‌కు జైలుశిక్ష పడి లోక్‌సభ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. ఆదివారం ఇక్కడ జరిగిన మొదటి ఎన్నికల సభలో ఆయన ప్రసంగిస్తూ బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసి, జైలుపాలు చేసినా ప్రభుత్వాన్ని చూసి భయపడేది లేదని స్పష్టం చేశారు. అదానీ అవినీతికి మారుపేరని పేర్కొన్నారు. ‘అదానీ విమానంలో ప్రధాని మోదీ అత్యంత రిలాక్స్ మూడ్‌లో ఎందుకు కూర్చుంటారు? అదానీ కంపెనీలో చైనా డైరెక్టర్ ఎందుకు ఉన్నారు?’అని రాహుల్ ప్రశ్నించారు. మోదీ, అదానీ సంబంధాలపై ప్రశ్నించినప్పుడల్లా బీసీ వర్గాన్ని అవమానించానంటూ తనవైపు వేలెత్తి చూపుతున్నారని విమర్శించారు. -
Sankalp Satyagraha: మోదీ పిరికిపంద
న్యూఢిల్లీ: ‘‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధాని రాజీవ్‌గాంధీ కుమారుడు రాహుల్. దేశ ఐక్యత కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాంటి వ్యక్తి దేశాన్ని ఎందుకు అవమానిస్తారు?’’ అని ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘‘బీజేపీ నేతలు రాహుల్‌ను మీరు జాఫర్ అంటూ ఎగతాళి చేశారు. జాతి వ్యతిరేక శక్తి అని నిందించారు. మా తల్లిని అవమానించారు. నెహ్రూ ఇంటిపేరు ఎందుకు పెట్టుకోలేదంటూ మమ్మల్ని ఎద్దేవా చేశారు. మా కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని ఆక్షేపించారు. అయినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? జైలు శిక్షలు విధించలేదు?’’ అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన రాహుల్‌ను ‘పప్పు’ అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన పప్పు కాదని బీజేపీ నాయకులకు తెలిసిపోయింది. అందుకే పార్లమెంటు నుంచి బయటికి పంపించారు’’ అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలు చేపట్టింది. ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర అగ్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘‘మోదీ ఉత్త పిరికిపంద. అధికారం వెనుక దాక్కుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పించడం తథ్యమన్నారు. అరాచక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మా కుటుంబం ధారపోసిన రక్తం దేశ ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. ఇకపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘మోదీ’లను విమర్శిస్తే నొప్పెందుకు: ఖర్గే ‘‘ఒక వ్యక్తిని కాపాడడానికి మొత్తం ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. అసలు అదానీ ఎవరు? ప్రభుత్వం ఆయనకు ఎందుకు అండగా ఉంటోందో చెప్పాలి’’ అని ప్రియాంక నిలదీశారు. ‘‘ప్రజల హక్కుల కోసం రాహుల్ పోరాడుతున్నారు. జోడో యాత్రలో ఆయన వెంట లక్షల మంది నడిచారు’’ అన్నారు. అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీలను విమర్శిస్తే బీజేపీ ప్రభుత్వానికి నొప్పి ఎందుకని ఖర్గే ప్రశ్నించారు. సత్యాగ్రహం పేరిట కాంగ్రెస్ దీక్ష చేయడం సిగ్గుచేటని బీజేపీ దుయ్యబట్టింది. దానికి ఆ అధికారమే లేదని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ‘అనర్హత వేటు పడిన ఎంపీ’ ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేసిన రాహుల్ లోక్‌సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేశారు. బయోడేటాను ‘అనర్హత వేటుపడిన ఎంపీ’గా మార్చారు. తన అధికారిక వయనాడ్ ట్విట్టర్ ఖాతాలోనూ ‘డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ’ అని రాశారు. -
వారణాసిని పట్టించుకోరు
అయోధ్య: ప్రధానిపై పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంక గాంధీ మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. దేశ విదేశాలు నిర్విరామంగా తిరుగుతున్న మోదీ సొంత నియోజకవర్గం వారణాసిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. దీంతో వారణాసిలో ఆమె బరిలోకి దిగుతారని వినిపిస్తున్న ఊహాగాలను మరింత బలం చేకూరినట్లయింది. శుక్రవారం అయోధ్యలో ఓ వీధిలో ప్రజలతో ముచ్చటిస్తూ ప్రియాంక.. బీజేపీ ప్రభుత్వం ధనికులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, రైతులు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. ఇటీవల వారణాసిలో పర్యటించిన సందర్భంగా అక్కడ జరిగిన అభివృద్ధి గురించి అడిగితే విమానాశ్రయం నుంచి పట్టణానికి నిర్మించిన రోడ్డు గురించి చెప్పారని అన్నారు. గత యూపీయే ప్రభుత్వం మంజూరు చేసిన 150 కి.మీలో కేవలం 15 కి.మీ రోడ్డు వేశారని, విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగే ఆ దారి నిండా గుంతలున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో మోదీ తన నియోజకవర్గంలోని గ్రామంలో ఒక్కసారి కూడా పర్యటించలేదని గుర్తుచేశారు. యూపీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
రాహుల్ రథసారథ్యం
న్యూఢిల్లీ: దాదాపు 132 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కొత్త రథసారథిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టారు. తల్లి సోనియా గాంధీ నుంచి శనివారం ఆయన ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించారు. తల్లితో పాటు సోదరి ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్, ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో.. కాంగ్రెస్ కార్యకర్తల సంబరాల మధ్య ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. రాహుల్‌కు కాంగ్రెస్ ఎన్నికల సంఘం అధ్యక్షుడు రామచంద్రన్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాహుల్ రాజకీయ ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కొనే వ్యూహాల్ని, పార్టీ అధ్యక్షుడిగా తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీపై విరుచుకుపడుతూ.. బీజేపీ విద్వేషాన్ని, హింసను ప్రేరేపిస్తోందని... దేశాన్ని మోదీ మధ్యయుగాల నాటికి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ప్రజలందరితో సమానంగా బీజేపీని గౌరవిస్తామని.. ఆ పార్టీ నేతల్లా ద్వేష భావం ప్రదర్శించబోమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలంతా తన కుటుంబమని.. బాధిత వర్గాల తరఫున పోరాడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. ప్రసంగానికి ముందు తల్లి ఆశీర్వాదం తీసుకున్న రాహుల్ గాంధీ ఆమె నుదిటిపై ముద్దుపెట్టారు. వారిది హింస.. మనది ప్రేమ ‘ఈ రోజు బీజేపీ నేతలు దేశమంతా హింస, విద్వేషాల్ని రగులుస్తున్నారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తల బలగం, నేతలు మాత్రమే నిలువరించగలరు. వారు విడగొడుతున్నారు. మనం ఏకం చేస్తున్నాం. వారు అగ్గి రాజేస్తుంటే.. మనం ఆర్పేస్తున్నాం. ఇదే వారికి మనకు మధ్య ఉన్న తేడా’ అని బీజేపీని రాహుల్ తప్పుపట్టారు. ఒకసారి విద్వేషాన్ని రగిలిస్తే.. దానిని ఆర్పడం చాలా కష్టమని.. ఈ విషయాన్ని బీజేపీ నేతలు అర్థం చేసుకునేందుకే తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ‘బీజేపీ నేతలు కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను కోరుతున్నారు. మనల్ని లేకుండా చేయాలని ఆశిస్తున్నారు’ అని అన్నారు. కాంగ్రెస్ ప్రతి ఒక్కరి కోసం పోరాడుతుందని.. ఒంటరిగా పోరాడలేని వారికి అండగా ఉంటుందని, ప్రజల ప్రజాస్వామిక స్వప్నాలు, వారి ఆశలు చెదిరిపోయేందుకు ఎప్పటికీ అనుమతించదని రాహుల్ అన్నారు. ‘వారు గొంతు నొక్కుతున్నారు. మేం బాధిత ప్రజల గొంతు వినిపించేందుకు ప్రయత్నిస్తున్నాం. వారు అపఖ్యాతి పాలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. మేం గౌరవించడంతో పాటు దీటుగా ఎదుర్కొంటున్నాం’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత మెప్పు కోసం మోదీ పాకులాట మోదీపై రాహుల్ విరుచుకుపడుతూ..ప్రధాని దేశ ప్రజల్ని మధ్య యుగాల నాటికి తీసుకెళ్తున్నారని దుయ్యబట్టారు. ‘తాము నమ్మిన విలువలు, తినే తిండి కోసం ఆ కాలంలో కొందరి దుశ్చర్యలకు ప్రజలు బలయ్యారు. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. విద్వేషంతో కూడిన హింస ప్రపంచంలో మనల్ని సిగ్గు పడేలా చేస్తోంది’ అని పేర్కొన్నారు. నిపుణులు, అనుభవజ్ఞులు, తెలివైన వారు ఉన్నా.. వారిని పక్కనపెట్టి తాను గొప్పవాడినని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజల మధ్య చర్చల సాధనం.. మతం, జాతి, వయసు ఇలా ఎలాంటి తారతమ్యం లేకుండా దేశ ప్రజల మధ్య చర్చలకు సాధనంగా కాంగ్రెస్ పార్టీ సాయపడాలని రాహుల్ అభిలషించారు. ‘వయో, ప్రాంతీయ భేదాలు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలంతా నా కుటుంబమే.. మీరంతా నా వారే’ అని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. దేశం లోని అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీని.. ‘అతి పురాతన, యువ’ పార్టీగా మార్చాలని దేశ యువతను కోరారు. ‘విద్వేష రాజకీయాలపై పోరాడి వాటిని ఓడిద్దాం’ అని పిలుపునిచ్చారు. రాయ్‌బరేలీ నుంచి అమ్మనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీచేస్తారన్న ఊహాగానాలకు ప్రియాంకా గాంధీ తెరదించారు. రాయ్ బరేలీ నుంచి మరోసారి తన తల్లి సోనియా గాంధీనే పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ ప్రమాణస్వీకారానికి హాజరైన ఆమె మీడియా ప్రశ్నకు జవాబుగా ఈ విషయాన్ని తెలిపారు. విమర్శలే ధైర్యవంతుడ్ని చేశాయి: సోనియా తన తనయుడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తూ.. ధైర్యం, సహనం, అంకితభావంతో పార్టీని రాహుల్ నడిపించగలరనే నమ్మకం తనకు ఉందని సోనియా పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి రాహుల్ దారుణమైన వ్యక్తిగత దాడులు ఎదుర్కొన్నాడని, అవే అతన్ని మరింత ధైర్యవంతుడ్ని చేశాయని చెప్పారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ను అభినందిస్తూ.. ‘కొత్త, యువ నాయకత్వంలో.. మన పార్టీలో నూతనోత్సాహం వస్తుందని, అవసరమైన మార్పులు జరుగుతాయని నమ్మకం ఉంది’ అని అన్నారు. కాంగ్రెస్ ముందుగా తన ఇంటిని చక్కదిద్దుకుని ఆ తర్వాతే మతతత్వ శక్తుల్ని అడ్డుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడాలన్నారు. ‘ప్రాథమిక విలువలు, వాక్ స్వాతంత్య్రం, విభిన్న సంస్కృతిపై దాడుల్ని చూస్తున్నాం. భయోత్పాత వాతావరణం సృష్టించారు. వీటి మధ్య తనను తాను పరిశీలించుకుని.. ఆత్మవిమర్శతో కాంగ్రెస్ ముందుకు వెళ్లాలి. నమ్మిన విలువలపై మనం నిలబడకపోతే.. సామాన్య ప్రజల తరఫున ఈ పోరును కొనసాగించలేం’ అని అన్నారు. దేశం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటోందని... అయితే కాంగ్రెస్ పార్టీ వాటికి భయపడదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటోందని సోనియా పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది. అయినా కార్యకర్తల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా తన గతాన్ని గుర్తు చేస్తూ.. ఉద్విగ్నతకు లోనయ్యారు. భర్త రాజీవ్, తల్లిలాంటి ఇందిరల మరణం తర్వాత ఎలా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.. కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తల మద్దతుతో కేంద్రంలోను, అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన విషయాల్ని ఆమె గుర్తు చేశారు. ముంబైలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబరాలు -
'అక్కడ ట్రంప్ లాగే ఇక్కడ మోదీ, కేసీఆర్'
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మతాన్ని రెచ్చగొడుతున్నారని, మొత్తం రాజకీయ వాతావరణాన్నే కలుషితం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. అమెరికాలో ట్రంప్‌లాగే ఇక్కడ మన దేశంలో మోదీ, కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ నాయకుల మాటలు చాలా ప్రభావం చూపుతాయని.. ట్రంప్ మాటల వల్ల అమెరికాలో మన వాళ్లు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అక్కడ గన్ కల్చర్ బాగా పెచ్చు మీరుతోందని, దానిపై ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడి శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని డిమాండ్ చేశారు. ఇక కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి కవచం అన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు సరికాదని, సెక్యులరిజం హంతకముఠాకు అధ్యక్షుడు వెంకయ్యనాయుడని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని నారాయణ హెచ్చరించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పిచ్చోడిలా మాట్లాడుతున్నారని, ఆయనకు సురవరం సుధాకర్ రెడ్డే కలలోకి వస్తున్నట్లున్నారని అన్నారు. తిరుమల వేంకటేశ్వరునికి రూ. 5 కోట్లతో నగలు చేయించానంటున్న కేసీఆర్.. అదేదో తన అబ్బ సొత్తులాగ తీసుకెళ్లారని సీపీఐ నారాయణ విమర్శించారు. ఆయన అబ్బ సొత్తు ఉంటే దేవుడికి నగలు చేయించుకోవచ్చు, ఆయన కుటుంబ సభ్యులంతా వెళ్లి గుండు కొట్టించుకోవచ్చని అన్నారు. సొంతంగా మీసాలు లేని కేసీఆర్.. మరో దేవుడికి మీసాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ద్రోహులతో కేసీఆర్ దోస్తానా చేస్తున్నాడని.. కేబినెట్లో తెలంగాణ వ్యతిరేకులతో కూర్చుని నిర్ణయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కమ్యూనిస్టులు మంచివాళ్లని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం శత్రువుల్లా చూస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందనడం సరికాదని, ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను ఊరవతలికి తరలిస్తే.. తాము వెళ్లడం కాదు, ఆయనను కూడా ఊరు బయటికి తీసుకెళ్తామని హెచ్చరించారు.