Critique
-
‘కట్ట’లు తెగిన అసహనం.. పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయం
ఘనత వహించిన చంద్రబాబు మరోమారు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారు.. ప్రమాదఘంటికలు మోగిస్తున్న రాయలచెరువు కట్టపై హంగామా చేశారు.. లీకేజీలను అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న అధికారుల విధులకు అడ్డంకులు సృష్టించారు.. ముమ్మరంగా సాగుతున్న మరమ్మతు పనులకు ఆటంకం కలిగించారు.. బలహీనమైన కట్టపైనే ప్రచార రథం ఎక్కి సుదీర్ఘంగా ప్రసంగంతో స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సైతం తెగించారు. సాక్షి, తిరుపతి/తుడా: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు బుధవారం పర్యటించారు. ముందుగా రేణిగుంటకు చేరుకున్న బాబుకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాపానాయుడుపేటకు చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం గుడిమల్లం మార్గంలో స్వర్ణముఖి నదిపై కూలిపోయిన వంతెనను పరిశీలించారు. అనంతరం తిరుచానూరు చేరుకుని పాడిపేట వద్ద స్వర్ణముఖి ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనను సందర్శించారు. తర్వాత తొండవాడ మీదుగా రాయలచెరువు వద్దకు వెళ్లి కట్టను పరిశీలించారు. లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన చర్యలపై ఇంజినీర్లను ఆరా తీశారు. పరామర్శలు శూన్యం.. విమర్శలకే ప్రాధాన్యం వరద ప్రాంతాల్లో చంద్రబాబు చేపట్టిన పర్యటన తూతూ మంత్రంగా సాగింది. బాధితులను పరామర్శించడం వదిలేసి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడమే అజెండాగా మారింది. ఎక్కడా పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను చూడలేదు. ధ్వంసమైన ఇళ్లను పరిశీలించలేదు. బాధితులను ఓదార్చి వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నమూ చేయలేదు. కేవలం ఆత్మస్తుతి పరనింద అన్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శించడం, అసెంబ్లీలో తన సతీమణిని అవమానించారంటూ సానుభూతి కోసం పాకులాడడమే లక్ష్యంగా బాబు యాత్ర సాగింది. తమ్ముళ్ల అత్యుత్సాహం అధినేత పర్యటనలో తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. జనంలో స్పందన లేకపోవడంతో బాబు ముందు పరువు పోతుందని తామే హంగామా సృష్టించారు. అది పరామర్శ యాత్ర అనే విషయం మరిచిపోయి బాణసంచా పేలుస్తూ, జైబాబు అంటూ నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. ఇది చూసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయి మేము అవస్థలు పడుతుంటే ఓదార్చడం పోయి సంబరాలు జరుపుకుంటారా అని మండిపడుతున్నారు. మారని ధోరణి తిరుపతిలోని మహిళా వర్సిటీ, వైకుంఠపురం కూడళ్లలో చంద్రబాబు పాత ధోరణిలోనే ప్రసంగాలు సాగించారు. ముంపు ప్రాంతాలకు వెళ్లకుండా తమ పార్టీ నేతల ఇళ్లకు మాత్రమే వెళ్లి పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐదు నిముషాలు గడిపితే తన ప్రసంగాలకు మాత్రం గంటలకొద్దీ సమయం వెచ్చించారు. రాయలచెరువుపై కట్టపై మీటింగ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రాయలచెరువును అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కట్టను పటిష్టం చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చెరువు వద్దకు చేరుకున్న బాబు కట్టపైనే మీటింగ్ పెట్టారు. ప్రచార రథమెక్కి ప్రభుత్వంపై మళ్లీ విమర్శలు లంకించుకున్నారు. కట్ట పరిస్థితి బాగాలేదని అధికారులు వారించేందుకు యత్నించినా పెడచెవిన పెట్టారు. లీకేజీలను అరికట్టే పనులకు ఆటకం కలిగించారు. దీంతో కట్ట మరింతగా దెబ్బతింటుందేమో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె జనాలతో ‘షో’ చంద్రబాబు రోడ్‌షోకు జనాలు కరువయ్యారు. దీంతో టీడీపీ నేతలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఎక్కడికక్కడ బాబు సభలకు అందుబాటులోని వాహనాలతో అద్దె జనాలను తరలించారు. కొన్నిచోట్ల టీడీపీ కార్యకర్తలనే బాధితులుగా కూర్చోబెట్టి పరామర్శ యాత్రను మమ అనిపించారు. ఈక్రమంలో ప్రతి సభలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డినే లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేశారు. -
ఇది నీ బలం అని బన్నీ అన్నాడు!
‘‘నా బెస్ట్ క్రిటిక్ బన్నీ (అల్లు అర్జున్)నే. ‘కొత్త జంట’ చూశాక ‘రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే పాత్రలు సెలెక్ట్ చేసుకో. నువ్ కానిది చూపించా లంటే నటుడిగా కొంచం మెచ్యూర్టీ కావాలి. ఇంట్లో చాలా సరదాగా ఉంటావ్. ముందు అలాంటి క్యారెక్టర్లు చేస్తే, ఆ తర్వాత ఏ పాత్ర చేసినా బాగుంటుందన్నాడు. ఈ సినిమా చూసి ‘ఇది నీ బలం’ అన్నాడు’’ అని అల్లు శిరీష్ చె.ప్పారు. పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా అల్లు అరవింద్ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ శుక్రవారం విడుదల కానుంది. అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు... అందమైన ప్రేమకథతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. బాగా డబ్బున్న అబ్బాయి ఓ సాధారణ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ ప్రేమకు అడ్డంకి ఎవరు? ఏమైంది? అనే సింపుల్ కథతో సినిమా ఉంటుంది. ట్రీట్మెంట్, స్క్రీన్‌ప్లే ఫ్రెష్‌గా ఉంటాయి. అమ్మాయి ప్రేమ కోసం సినిమా అంతా తాపత్రయ పడే పాత్ర నాది. అలాగని డల్‌గా ఉండడు. షూటింగ్ మొదలైన ఓ వారం రోజుల వరకూ దర్శకుడు పరశురామ్ స్టైల్ అర్థం కాలేదు. లావణ్యకూ అంతే. ‘ఏం చేసినా ఇలా కాదండీ’ అనేవారు. నటనలో సహజత్వం కోరుకుంటున్నారని ఇతర ఆర్టిస్టులతో సన్నివేశాలు తీస్తున్నప్పుడు అర్థమైంది. ఆ తర్వాత చకచకా చేసుకుంటూ వెళ్లాం. బాగా నటిస్తే, షాట్ ఓకే అనకుండా.. ‘దొరికేసింది. సూపర్బ్’ అనేవారు. ఓ టీచర్లా చాలా విషయాలు నేర్పించారు. లావణ్య చాలా జోవియల్. సెట్స్‌లో జోకులేస్తూ నవ్విస్తుంది. ఒక్కోసారి సీన్లో నేనెలా నటిస్తున్నానో ముందు చెప్పేవాణ్ణి కాదు. సర్ప్రైజ్ ఇచ్చేవాణ్ణి. తను స్పాంటేనియస్‌గా భలే నటించేది. ఆ సీన్స్ బ్యూటిఫుల్‌గా వచ్చాయి. స్టోరీ, మ్యూజిక్ సిట్టింగ్స్ వంటి క్రియేటివ్ జాబ్స్ ఓకే. ప్రొడక్షన్ బోరింగ్. ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అంతకు ముందు ప్రొడక్షన్ చేశాను. ఇప్పుడా పనులు చూసు కునే టైమ్ లేదు. పెళ్లికి అప్పుడే తొందరేముంది. ‘ఎవరైనా అడిగితే (సంబంధాలు వస్తే) ఏం చెప్పమంటావ్?’ అని నాన్నగారు అడిగారు. నాలుగేళ్ల తర్వాత చేసుకుంటానని చెప్పా. గాళ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు. స్వీట్ అండ్ సింపుల్ గాళ్స్ నచ్చుతారు.