Crop loans waived
-
తప్పుల తడకగా రుణమాఫీ జాబితాలు
పశివేదల (కొవ్వూరు/కొవ్వూరు రూరల్) :పంట రుణాలు మాఫీ చేస్తున్నట్టు పదేపదే పేర్కొంటూ ప్రభుత్వం విడుదల చేసిన రెండు జాబితాలూ తప్పుల తడకగా ఉండటంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొవ్వూ రు మండలం పశివేదలలో బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సోమవారం ముట్టడించిన రైతులు ధర్నా చేశారు. జాబితాల్లో చాలామంది రైతులకు చోటు దొరక్కపోగా.. అర్హులుగా పేర్కొంటూ కొద్దిమంది పేర్లతో ఇచ్చిన జాబితాల్లోనూ తప్పులు దొర్లాయి. తమ పేర్లు గల్లంతు కావడంతో రైతులు బ్యాంకును ముట్ట డించి అధికారుల వైఖరిపై మండిపడ్డారు. పంట రుణం తీసుకుంటే ఇతర అవసరాల కోసం తీసుకున్నట్టు నమోదు కావడం, అన్ని వివరాలు సమర్పించినప్పటికీ తప్పులు నమోదు కావడంతో మరికొందరికి రుణమాఫీ వర్తించలేదు. పశివేదలలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ అధికారులు 2,200 మంది రైతులకు పంట రుణాలి చ్చింది. వీరిలో 340 మంది ఆస్తులు తనఖా పెట్టి రుణాలు తీసుకోగా, మిగి లిన వారు బంగారు ఆభరణాలను కుదువబెట్టి పంట రుణాలు తెచ్చుకున్నారు. ఆస్తులు కుదువబెట్టి రుణాలు తీసుకున్న వారిలో సుమారు 85 శాతం మంది పేర్లు జాబితాలో రాకపోవడంతో వారంతా బ్యాంకుకు చేరుకున్నారు. కొందరు రైతులు తమ రుణం వివరాలను వెబ్సైట్లో చూసుకోగా, తప్పిదాలు జరిగినట్టు బయటపడ్డాయి. ఆలపాటి సుధీర్ అనే రైతు తన ఎకరంన్నర పొలంపై రూ.40 వేల పంట రుణం తీసుకున్నారు. జాబి తాలో ఆయన పేరు రాలేదు. ఇదే గ్రామానికి చెందిన ఆలపాటి రామకృష్ణారావు అనే రైతు రూ.లక్ష పంట రుణం తీసుకున్నారు. రెండు జాబి తాలు విడుదల చేసినప్పటికీ వాటిలో ఆయన మాత్రం లేదు. అదేరైతు గత ఏడాది డిసెంబర్లో బంగారు అభరణాలు తనఖా పెట్టి రూ.50 వేలు పంట రుణం తీసుకున్నారు. రుణమాఫీ వర్తించకపోవడంతో అతడు వాపోతున్నాడు. ఇలా వేములూరు, తోగుమ్మి, నందమూరు, గౌరీపల్లి, చాగల్లు, నెల టూరు, నందిగంపాడు, మల్లవరం, ఊనగట్ల తదితర గ్రామాలకు చెందిన రైతుల ఇక్కడి బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. కొందరు రైతులకు సంబంధించి రుణం తీసుకున్న తేదీ లను కాకుండా, సంబంధిత రైతులు అకౌంట్ ప్రారంభించిన తేదీలను వేశా రు. ఇలా చాలామంది రైతుల వివరాలను బ్యాంకు అధికారులు తప్పుగా నమోదు చేయడంతో వీరికి రుణమాఫీ వర్తించడం లేదు. రైతులంతా బ్యాంకు వద్దకు చేరుకుని ధర్నా చేశారు. బ్యాంకు అధికారులను నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రూరల్ ఎస్సై ఎం.జయబాబు రంగప్రవేశం చేశారు. ఆన్లైన్లో నమోదైన తప్పులపై రైతులు తహసిల్దార్‌కు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు సూచించారు. అక్కడి నుంచి తమకు ఫిర్యాదు అందగానే రెండు రోజుల్లో జాబితాలో తప్పులను సరిచేయిస్తామని బ్రాంచ్ మేనేజర్ దిలీప్ కనూన్గో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
రుణమాఫీ కోసం రణం
బేల : పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బేల మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం కాంగ్రెస్, బీజేపీ నాయకులు, రైతులు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రుణ మాఫీ వెంటనే చేసేలా ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించాలని నాయకు లు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. దీంతో పాటు స్థానిక ఇందిరా చౌరస్తా వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి, ధర్నా చేపట్టారు. అయితే బుధవారం వారసంత కావడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో ధర్నా విరమించి, వెనుదిరిగారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కి వచ్చి, 2 నెలలకు పైగా గడుస్తోందని, ఇప్పటిదాకా సమీక్షలు, సమావేశాలతో కాలయాపన తప్ప చేసేందే మీ లేదని దుయ్యబట్టారు. రుణ మాఫీపై ముఖ్యమం త్రి వెంటనే స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచులు వాంఖడే రూప్‌రావు, మెస్రం దౌలత్, బీజెపీ మండల అధ్యక్షుడు బోనిగిరివార్ గణేశ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గెడాం మాధవ్, మైనార్టీ అధ్యక్షుడు ఫైజుల్లాఖాన్, బేల సహకార సంఘం మాజీ అధ్యక్షుడు సుధాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోపత్ శంకర్, నాయకులు మల్లారెడ్డి, రమేశ్, గుండవార్ సంజయ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.