తప్పుల తడకగా రుణమాఫీ జాబితాలు | Mistakes Crop Loans waiver lists | Sakshi
Sakshi News home page

తప్పుల తడకగా రుణమాఫీ జాబితాలు

Published Tue, Dec 16 2014 1:37 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

తప్పుల తడకగా రుణమాఫీ జాబితాలు - Sakshi

తప్పుల తడకగా రుణమాఫీ జాబితాలు

 పశివేదల (కొవ్వూరు/కొవ్వూరు రూరల్) :పంట రుణాలు మాఫీ చేస్తున్నట్టు పదేపదే పేర్కొంటూ ప్రభుత్వం విడుదల చేసిన రెండు జాబితాలూ తప్పుల తడకగా ఉండటంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొవ్వూ రు మండలం పశివేదలలో బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సోమవారం ముట్టడించిన రైతులు ధర్నా చేశారు. జాబితాల్లో చాలామంది రైతులకు చోటు దొరక్కపోగా.. అర్హులుగా పేర్కొంటూ కొద్దిమంది పేర్లతో ఇచ్చిన జాబితాల్లోనూ తప్పులు దొర్లాయి. తమ పేర్లు గల్లంతు కావడంతో రైతులు బ్యాంకును ముట్ట డించి అధికారుల వైఖరిపై మండిపడ్డారు. పంట రుణం తీసుకుంటే  ఇతర అవసరాల కోసం తీసుకున్నట్టు నమోదు కావడం, అన్ని వివరాలు సమర్పించినప్పటికీ తప్పులు నమోదు కావడంతో  మరికొందరికి రుణమాఫీ వర్తించలేదు. పశివేదలలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ అధికారులు 2,200 మంది రైతులకు పంట రుణాలి చ్చింది. వీరిలో 340 మంది ఆస్తులు తనఖా పెట్టి రుణాలు తీసుకోగా, మిగి లిన వారు బంగారు ఆభరణాలను కుదువబెట్టి పంట రుణాలు తెచ్చుకున్నారు.
 
  ఆస్తులు కుదువబెట్టి రుణాలు తీసుకున్న వారిలో సుమారు 85 శాతం మంది పేర్లు జాబితాలో రాకపోవడంతో వారంతా బ్యాంకుకు చేరుకున్నారు. కొందరు రైతులు తమ రుణం వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకోగా, తప్పిదాలు జరిగినట్టు బయటపడ్డాయి. ఆలపాటి సుధీర్ అనే రైతు తన ఎకరంన్నర పొలంపై రూ.40 వేల పంట రుణం తీసుకున్నారు. జాబి తాలో ఆయన పేరు రాలేదు. ఇదే గ్రామానికి చెందిన ఆలపాటి రామకృష్ణారావు అనే రైతు రూ.లక్ష పంట రుణం తీసుకున్నారు. రెండు జాబి తాలు విడుదల చేసినప్పటికీ వాటిలో ఆయన మాత్రం లేదు. అదేరైతు గత ఏడాది డిసెంబర్‌లో బంగారు అభరణాలు తనఖా పెట్టి రూ.50 వేలు పంట రుణం తీసుకున్నారు. రుణమాఫీ వర్తించకపోవడంతో అతడు వాపోతున్నాడు.
 
  ఇలా వేములూరు, తోగుమ్మి, నందమూరు, గౌరీపల్లి, చాగల్లు, నెల టూరు, నందిగంపాడు, మల్లవరం, ఊనగట్ల తదితర గ్రామాలకు చెందిన రైతుల ఇక్కడి బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. కొందరు రైతులకు సంబంధించి రుణం తీసుకున్న తేదీ లను కాకుండా, సంబంధిత రైతులు అకౌంట్ ప్రారంభించిన తేదీలను వేశా రు. ఇలా చాలామంది రైతుల వివరాలను బ్యాంకు అధికారులు తప్పుగా నమోదు చేయడంతో వీరికి రుణమాఫీ వర్తించడం లేదు. రైతులంతా బ్యాంకు వద్దకు చేరుకుని ధర్నా చేశారు. బ్యాంకు అధికారులను నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రూరల్ ఎస్సై ఎం.జయబాబు రంగప్రవేశం చేశారు.  ఆన్‌లైన్‌లో నమోదైన తప్పులపై రైతులు తహసిల్దార్‌కు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు సూచించారు. అక్కడి నుంచి తమకు ఫిర్యాదు అందగానే రెండు రోజుల్లో జాబితాలో తప్పులను సరిచేయిస్తామని బ్రాంచ్ మేనేజర్ దిలీప్ కనూన్‌గో హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement