crorepati candidates
-
వారిలో 60 శాతం మంది కరోడ్పతిలే...
సాక్షి, కొహిమా : నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్ధుల్లో 59 శాతం మంది కోటీశ్వరులేనని ఎన్నికల కమిషన్ (ఈసీ)కు వారు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించగా వెల్లడైంది. 196 మంది అభ్యర్ధుల్లో 193 మంది అభ్యర్ధుల అఫిడవిట్లను పరిశీలించిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్ధ వారిలో 114 మంది అభ్యర్ధులు కరోడ్పతీలని తేల్చింది. జేడీ(యూ) అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోథా అత్యధికంగా రూ 38.92 కోట్ల ఆస్తులు కలిగిఉన్నారని ఏడీఆర్ పేర్కొంది. వోఖా జిల్లా సనీస్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఇకపెరెన్ సీటు నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాగాలాండ్ సీఎం టీఆర్ జెలింగ్ తన ఆస్తులు కేవలం రూ 3.52 కోట్లుగా అఫిడవిట్లో పొందుపరిచారు. ఇక ఘస్పానీ సీటు నుంచి పోటీలో నిలిచిన ఆప్ అభ్యర్థి అకవి జిమోమి తనకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు.కాగా ఫిబ్రవరి 27న నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. -
బరిలో 103 మంది కోటీశ్వరులు
భువనేశ్వర్(పిటిఐ): ఒడిశా తొలి దశ ఎన్నికల్లో 103 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 70 శాసనసభ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ జరుగనుంది. మొత్తం 673 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 103 (15శాతం) మంది కోటీశ్వరులేనని నేషనల్ ఎలక్షన్వాచ్ అనే సంస్థ వెల్లడించింది. రూర్కెలా స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యాపారవేత్త దిలీప్రే రూ. 106 కోట్ల ఆస్తులతో మిగతా కోటీశ్వరుల కంటే ముందంజలో ఉన్నారు. అధికార బీజేడీ నుంచి 34 మంది, కాంగ్రెస్ తరపున 26 మంది, బీజేపీ నుంచి 19 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఐదుగురు కోటీశ్వరులు పోటీలో నిలిచారు. ఇదిలా ఉండగా, లక్ష రూపాయల లోపు ఆస్తులు ఉన్నవారు 104 మంది ఉండగా, అసలు ఆస్తులు ఏమీ లేనివారు ఎనిమిది మంది ఉన్నట్లు ఎలక్షన్వాచ్ పేర్కొంది.