croud gathering
-
మోండాలో సెల్‌ఫోన్ దొంగల హల్చల్.. సీసీ కెమెరాలో రికార్డు
సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): సికింద్రాబాద్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. మార్కెట్‌కు వివిధ రకాల కొనుగోళ్ల కోసం వచ్చేవారి సెల్ఫోన్లను దొంగలు తస్కరిస్తున్నారు. కనురెప్పపాటులో ఫోన్లు మాయం అవుతున్నాయి. ఇటీవల వినాయకచవితి సందర్భంగా మార్కెట్‌కు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రాకతో మార్కెట్ జన సంద్రంగా మారింది. వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తుంటే దొంగలు మరో వైపు తమ పని కానిచ్చేశారు. ► బోయిగూడ కట్టెలమండి ప్రాంత నివాసి పాకాల రమేష్ మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తుండగా దొంగ పూలు కొంటున్నట్టు నటిస్తూ రమేష్ షర్ట్ జేబులో ఉన్న విలువైన సెల్‌ఫోన్‌ను తస్కరించాడు. అయితే ఈ తతంగం అంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ► సదరు దొంగ వ్యూహాత్మకంగా వచ్చి సంచి అడ్డుగా పెట్టి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. అదే రోజు మరో ఇద్దరి సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. దీంతో బాధితులు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ► సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో మోండా మార్కెట్ ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతూ రైళ్లలో ఇట్టే మాయమవుతున్నారు. పోలీసుల వైఫల్యంపై విమర్శలు ►నిత్యం వేలాది మంది ప్రజల రాకపోకలు...వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా ఉంటే మోండా మార్కెట్లో పోలీసు నిఘా వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ దొంగలు అడ్డూఅదుపు లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ►మోండా మార్కెట్లో కనీసం పండగ వేళల్లో అయినా పోలీసు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తే జాగ్రత్తగా ఉంటారని పలువురు సాక్షితో వాపోయారు. ► మోండా మార్కెట్‌కు వచ్చిన అనేకమంది డబ్బు, సెల్ఫోన్లు పోగొట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతున్నారు. ► ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక నిఘాతో దొంగతనాలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. గట్టి నిఘా : క్రైమ్ ఇన్స్పెక్టర్ శేఖర్ మోండా మార్కెట్లో సెల్‌ఫోన్ దొంగతనాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. మోండా మార్కెట్ రద్దీ ప్రాంతాల్లో సివిల్‌డ్రెస్‌లో పోలీసు సిబ్బందిని ఉంచాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నాం మార్కెట్‌కు వచ్చేటప్పుడు ప్రజలు విలువైన వస్తువులను వెంట తీసుకురాకూడదు. చదవండి: షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు -
ప్రాణం పోసిన ‘సోషల్ మీడియా’
భాగ్యనగర్‌కాలనీ: సోషల్ మీడియా ఓ చిన్నారికి ప్రాణం పోసింది. తన కుమారుడి ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం అందజేయాలని తల్లిదండ్రులు సోషల్ మీడియాలో కోరగా పలువురు స్పందించారు. నేతల సహాయంతో మొత్తం ఆపరేషన్ ఖర్చులు అందజేసేలా కృషి చేశారు. నిజామాబాద్ జిల్లా కామరపల్లి మండలం హాసకొత్తూరు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మధుయాదవ్, సునీతారాణి దంపతులకు మే 8న మగబిడ్డ జన్మించాడు. అయితే శిశువు పెద్ద పేగు మూసుకుపోయిందని, ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు పేర్కొన్నారు. దీంతో వెంటనే శిశువుని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్‌కు రూ.5లక్షల ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఏమి చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా దాతలను వేడుకొన్నారు. హైదర్‌నగర్ డివిజన్లో నివాసముంటున్న నెస్ట్ ప్రణీత్ హ్యాపీ హోమ్స్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్‌బాబు, డాక్టర్ రెడ్డి లేబోరేటరీ ఉద్యోగులు, సురేందర్ ఫౌండేషన్ మెట్పల్లి, ఆర్ట్ ఆఫ్ సర్వీంగ్ హ్యుమానిటీ ట్రస్టు సభ్యులు స్పందించి విరాళాల ద్వారా రూ.లక్షన్నర సేకరించారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేటీఆర్ సీఎం సహాయ నిధి నుంచి ఆపరేషన్ ఖర్చులకు రూ.2.50 లక్షల మంజూరు చేయించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆ తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఆపరేషన్‌కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆకట్టుకునే వ్యూహం
సాక్షి, విజయవాడ బ్యూరో : ఆగస్టు 4న విజయవాడలో నిర్వహించే బీసీ ఫెడరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ æస్వీకారానికి భారీ స్థాయిలో జనాన్ని సమీకరించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం తన క్యాంపు కార్యాలయంలో కసరత్తు చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విడివిడిగా ఫెడరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో చర్చలు జరిపారు. మొత్తం 11 బీసీ ఫెడరేషన్లు ఉండగా అందులో ఆరు ఫెడరేషన్లకు ఇటీవల చైర్మన్, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరందరినీ శనివారం క్యాంపు కార్యాలయానికి పిలిపించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ పాల్గొన్నారు. బీసీలంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, కాపులు కాస్త అటుఇటుగా ఉన్నట్లు చెప్పారు. కార్పొరేషన్ల ద్వారా కుల సమీకరణలు చేయవచ్చునని సూచించారు. మంత్రి కొల్లు మాట్లాడుతూ టీడీపీలో బీసీలు మొదటి నుంచీ బలమైన వర్గంగా ఉన్నారన్నారు. మిగిలిన ఫెడరేషన్లకు కూడా త్వరలోనే కమిటీలు వేస్తామని చెప్పారు. సీఎంను మెప్పించేందుకు బీసీ ఫెడరేషన్లు జన సమీకరణ చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. పలు ఫెడరేషన్లలోని కొందరు మాట్లాడుతూ సొంతడబ్బులతో కుల సమీకరణ ద్వారా తీసుకురావడం సాధ్యం కాదని చెప్పడంతో విడివిడిగా మంత్రి మాట్లాడారు. ఫెడరేషన్లకు టీడీపీ అనుకూలురును చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించుకున్న విషయం తెలిసిందే. వారి ద్వారా తమకు బలం ఉందని సీఎం వద్ద నిరూపించుకోవచ్చుననే మంత్రి ఆలోచనకు సమావేశానికి వచ్చిన వారు అడ్డుకట్ట వేస్తున్నట్లు మాట్లాడటంతో మంత్రి కాస్త ఆలోచనలో పడ్డారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్థన్ కూడా పాల్గొన్నారు.