crowd-funding site
-
సిటీ యువకుడి వైద్యానికి అంతర్జాతీయ సాయం
సాక్షి, సిటీబ్యూరో: తీవ్ర అనారోగ్యానికి గురైన నగర యువకుడి చికిత్సకు అంతర్జాతీయ సాయం అందింది. ఈ వివరాలను ప్రముఖ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ఇంపాక్ట్ గురు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరవాసి అయిన భానుప్రకాష్ (22) అనారోగ్య సమస్యలతో గత డిసెంబరులో అపోలో ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం అతనికి సోకింది తీవ్రమైన మైలాయిడ్ లుకేమియా వ్యాధిగా నిర్ధారించి, 4వారాల పాటు కీమో థెరపీ, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని ఆసుపత్రి వైద్యులు సూచించారు. చికిత్సకు రూ.15లక్షలు ఖర్చవగా మరో రూ.25లక్షలు వరకూ అవసరమైంది. అంత మొత్తాన్ని భరించలేని మధ్యతరగతికి చెందిన భాను ప్రకాష్ కుటుంబం క్రౌడ్ ఫండింగ్ సంస్థ ఇంపాక్ట్ గురును ఆశ్రయించింది. ఈ రోగి గురించిన సమాచారం ఇంపాక్ట్ ద్వారా తెలుసుకున్న 1234 మంది దాతలు కేవలం 2 వారాల్లోనే రూ.25.40లక్షలను విరాళంగా అందించారు. అయితే.. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవసరమైన బోన్‌మ్యారో దాత దే«శీయంగా అందుబాటులోకి లేకపోవడం, యూరప్ దేశాలకు నుంచి తీసుకోవాల్సిరావడంతో అదనంగా రూ.10లక్షలు వ్యయం చేయాల్సి వస్తోందని, మరో 2వారాల సమయం ఉన్న పరిస్థితుల్లో మరింత మంది దాతలు స్పందిస్తారని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
గోల్డ్ మెడల్ తెస్తా..సాయం చేయండి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పోటీల్లో శిక్షణకోసం విరాళాలు కోరుతూ భారత వికలాంగ సైక్లిస్ట్ జగ్విందర్ సింగ్ సోమవారం ఆన్ లైన్ లో ప్రచారం మొదలు పెట్టాడు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పేదవాడినైన తనను ఆదుకోవాలని కోరాడు. ఇలా వచ్చే నిధుల ద్వారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని గెలవాలని ఆశిస్తున్నట్లు డిజైర్డ్ వింగ్స్ డాట్ కామ్ లో విజ్ఞప్తి చేశాడు. పంజాబ్ పాటియాలా లోని పత్రా అనే చిన్న గ్రామానికి చెందిన జగ్విందర్ అంతర్జాతీయ స్థాయిలో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ కావాలని కోరుకుంటున్నాడు. ఒక అంతర్జాతీయ స్థాయిలో పోటీ చెయ్యాలంటే క్రీడాకారులకు శిక్షణ, కోచింగ్, పోషణ తదితరాల అవసరమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అందరి మద్దతుతో దీనికి అవసరమైన నిధులు సమకూరతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఒలింపిక్స్ లో బంగారు పతకం గెలవడం తన కల అని ఈ సందర్భంగా జగ్విందర్ పేర్కొన్నాడు. కెనడాకు చెందిన సైక్లిస్ట్ జోసెఫ్ వెలోస్ తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తానుకూడ ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని సాధించి, దేశానికి, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలన్న ఆశయంతో ఉన్నానని చెప్తున్నాడు. 2014 లో చండీగఢ్ అసోసియేషన్ నిర్వహించిన పారా సైక్లింగ్ లో రాష్ట్రం తరపున బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 2015 లో ఒడిశాలో జరిగిన అంతర్జాతీయ సైక్లోథాన్ లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. 2014 లో గ్రీన్ బైకర్ అసోసియేషన్ ఆఫ్ పాటియాల నిర్వహించిన సైక్లోథాన్ లో 9 గంటల 15 నిమిషాల్లో 212 కిలో పూర్తిచేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. దీంతోపాటు 2000 లో చైల్డ్ వెల్ఫేర్ ఇండియన్ కౌన్సిల్ పోటీలో ఆయన వేసిన కళాఖండాలు బంగారు పతకాన్ని గెల్చుకోవడం మరో విశేషం.