the crown
-
వెలవెలబోయిన వేడుక
78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక వర్చ్యువల్‌గా జరిగింది. కోవిడ్ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో తారల సందడి లేక ఈసారి వేడుక కాస్తంత వెలవెలబోయింది. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ లొకేషన్స్ నుంచి టీనా ఫే, అమీ పోహ్లెర్ ఈ వర్చ్యువల్ షోకు హోస్ట్‌లుగా వ్యవహరించారు. గోల్డెన్ గ్లోబ్ నామినేషన్స్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 3న ప్రకటించారు. టీవీ, సినిమా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచినవారికి ఈ అవార్డులను అందించడం జరగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో వివాదాస్పదమైన ‘ది క్రౌన్ ’ షో నాలుగు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ మోషన్ పిక్చర్‌గా ‘నోమాడ్ ల్యాండ్’ చిత్రం నిలిచింది. బెస్ట్ మ్యూజికల్ మూవీగా ‘బోరాట్ సబ్ సీక్వెంట్ మూవీ ఫిలిమ్’ నిలిచింది. బెస్ట్ టెలివిజన్ డ్రామా సిరీస్‌గా ‘ది క్రౌన్ ’ నిలిచింది. ‘మా రైనీస్ బ్లాక్ బాటమ్’లోని నటనకు గాను చాద్విక్ బోస్‌మెన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ‘ది యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ బిల్లీ హాలీడే’లో నటించిన ఆండ్రా డే ఉత్తమ నటిగా నిలిచారు. ఉత్తమ విదేశీ చిత్రంగా ‘మినారీ’ నిలిచింది. ‘నోమాడ్ ల్యాండ్’ను డైరెక్ట్ చేసిన క్లోవ్ జావో ఉత్తమ డైరెక్టర్‌గా నిలిచారు. -
ఐకమత్యంతోనే బీసీలకు రాజ్యాధికారం
కర్నూలు(జిల్లా పరిషత్): ఐకమత్యంగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చెప్పారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ వాల్మీకి (బోయ) హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తాము వాల్మీకులను సోదరులుగా భావిస్తున్నామన్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన వాల్మీకి కులానికి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను సన్మానించారు. కార్యక్రమంలో పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసులునాయుడు, నాయకులు జగదీశ్వరరావు, జ్ఞానేశ్వరమ్మ, పద్మజనాయుడు, డాక్టర్ రజిత మాధురి, మీనెగె వెంకటేశ్వర్లు, ముప్పల వెంకటేశ్వరరావు, హరిబాబు, మీనెగె గోపి, మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.