ఐకమత్యంతోనే బీసీలకు రాజ్యాధికారం | bcs get power only through unity | Sakshi
Sakshi News home page

ఐకమత్యంతోనే బీసీలకు రాజ్యాధికారం

Published Mon, Sep 15 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

ఐకమత్యంతోనే బీసీలకు రాజ్యాధికారం

ఐకమత్యంతోనే బీసీలకు రాజ్యాధికారం

కర్నూలు(జిల్లా పరిషత్): ఐకమత్యంగా ఉంటేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ చెప్పారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ వాల్మీకి (బోయ) హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ తాము వాల్మీకులను సోదరులుగా భావిస్తున్నామన్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన వాల్మీకి కులానికి చెందిన జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలను సన్మానించారు. కార్యక్రమంలో పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె. శ్రీనివాసులునాయుడు, నాయకులు జగదీశ్వరరావు, జ్ఞానేశ్వరమ్మ, పద్మజనాయుడు, డాక్టర్ రజిత మాధురి, మీనెగె వెంకటేశ్వర్లు, ముప్పల వెంకటేశ్వరరావు, హరిబాబు, మీనెగె గోపి, మాజీ జెడ్‌పీటీసీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement