డోలారే.. డోలారే..
ఏలూరు సిటీ : సీఆర్ఆర్ మహిళా కళాశాలలో సాంస్కృతిక వారోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. చివరి రోజు విద్యార్థినులకు డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జి.రాజేష్, జి.లీలావతి, టి.భవాని వ్యవహరించారు. విద్యార్థినులు డ్యాన్స్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు. థిమ్ డ్యాన్స్‌లో డీవీఎస్ఎస్ లక్ష్మి ప్రథమ, సీహెచ్ రూపారాణి ద్వితీయ, సుప్రియ గ్రూప్ తృతీయ స్థానాల్లో నిలిచారు. క్లాసికల్ డ్యాన్స్‌లో మేఘన ప్రథమ, బి.కీర్తిక ద్వితీయ, సీహెచ్ మహేశ్వరి గ్రూప్ తృతీయస్థానాలు, ఫోక్ డ్యాన్స్‌లో పి.మీనాక్షి గ్రూప్ ప్రథమ, ఎన్.కనకరత్నం గ్రూప్ ద్వితీయ, జాతీయ సమైక్యత నృత్యంలో ప్రేమ కుమారి గ్రూప్ విజేతలుగా నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ శైలజ పర్యవేక్షించారు.