CTA
-
సీటీఏ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
చికాగో : వికారినామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి వేడుకలు చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. చికాగోలోని బాలాజీ దేవస్థానం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి 600మందికి పైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా గాంధీ-కింగ్ స్కాలర్షిప్ అవార్డులను ప్రదానం చేశారు. సీటీఏ డైరెక్టర్ సుజనా ఆచంట అతిథులను ఆహ్వానించి, తెలుగు భాష కోసం సీటీఏ చేస్తున్న సేలను, ఈ ఏడాదిలో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణంతోపాటూ, కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం, ఉగాది పచ్చడి పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. సుభద్రాచార్యులు శ్రీనివాసులు, డా.శారదా పూర్ణ సొంటి, ఆజాద్ సుంకవల్లిలకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి చికాగో స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ స్కాట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ల పేరు మీదుగా విద్యార్థులకు సీటీఏ స్కాలర్షిప్లను ఇవ్వడాన్ని అభినందించారు. ఈ ఏడాదికిగానూ మనస్వి తుమె, రిషితా వజ్జాల, స్పందన్ రామినేని, భాస్కరాచారిలకు స్కాలర్షిల్లను స్కాట్ అందజేశారు. సీటీఏ వ్యవస్థాపకులు రవి ఆచంట, ప్రవీణ్ మోటూరు, ప్రెసిడెంట్ నాగేంద్ర వేగె, బోర్డు సభ్యులు రావు ఆచంట, శేషు ఉప్పటపాటి, చుండు శ్రీనివాస్, అశోక్ పగడాల, శ్రీని యెరమాటి, వెంకట గ్యాజంగి, రాహుల్ వీరటపు, రాణి వేగె, సుజనా ఆచంట, అనిత గోలి, వ్యాపారవేత్త రమేశ్ తూము, దేవాలయ ట్రస్టీలు ఎమ్. రావు, హరినాత్ కోనేరు, ఆటా వ్యవస్థాపకులు హనుమంత్ రెడ్డి, తాతా ప్రకాశంలు విజేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ విజయవంతంగా నిర్వహించడంలో సీటీఏ సాంస్కృతిక విభాగం సభ్యులు సుజనా, రాణి వేగె, అనితా గోలి, అనూష విడపలపాటి, భవాని సరస్వతి, రత్న చోడ, తనూజ సజ్జ, సుధా కుంచనపల్లి, సుభద్ర బల్ల, సురేష్ బాదం, వాలంటీర్లు భూషణ్ భీమిశెట్టి, హరీష్ జన్ను, అదిల్, నవీన్ లగుడు, నవీన్ గార్గ, వినయ్ చెన్నుపాటి, బాల చోడ, నరేన్ సుంకర, మురళి కలాగారాలు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. సీటీఏ ప్రెసిడెంట్ నాగేంద్ర వేగె ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘స్టెప్’
హైదరాబాద్: పాఠశాల స్థాయి విద్యార్థులకు ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులలో పోటీతత్వం, వినూత్న, విశ్లేషణాత్మకమైన ఆలోచనా విధానాలతో ముందుకుసాగేలా చేయడానికి సరికొత్త కార్యక్రమాన్ని వేసవి సెలవుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 7 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (స్టెప్) కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో చేరదలచుకున్న విద్యార్థులు ఏప్రిల్ 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో 7,8 తరగతుల విద్యార్థులకు కాంప్యిటేషనల్ థింకింగ్ అండ్ అప్లికేషన్స్ (సీటీఏ) కోర్సును, 9,10 తరగతుల విద్యార్థులకు కాంప్యిటేషనల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ (సీటీపీఎస్) కోర్సును నిర్వహించాలని తలపెట్టారు. మొదట దరఖాస్తు చేసుకున్నవారికి తొలి అవకాశం కల్పించారు. తరగతులను మే 6 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. అడ్మిషన్, ఇతర వివరాలకు వెబ్సైట్ https:// www. iiit. ac. in/ stel/ను సంప్రదించాలి. పాఠశాల స్థాయి విద్యార్థులలో విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలను సైద్ధాంతికత ద్వారా పెంపొందించేలా చేయడం, మానసిక నైపుణ్యాలను ధృడంగా చేయడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ఈ కోర్సులు ట్రిపుల్ఐటీ– హైదరాబాద్ ఫ్యాకల్టీ, ఇతర విజిటింగ్ ఫ్యాకల్టీ ద్వారా నిర్వహిస్తారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి ఒలంపియాడ్లలో అర్హత సాధించారు. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లను అందిస్తారు. -
చికాగోలో ఘనంగా ఉగాది వేడుకలు
చికాగో తెలుగు అసోసియేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. చికాగోలోని బాలాజీ ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు 600 మందికి ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఆటా, పాటలతో ఈ వేడుక ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. రమ్య కపిల, అన్వితల గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. సురేష్ బాదం, అన్వితలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వేమన, సుమతి శతకాల నుంచి చిన్నారులు పద్యాలను పాడుతూ, అర్థాన్ని వివరించారు. ఉగాది పచ్చడి పోటీల్లో టాప్ 10 మందిని ఎంపిక చేసి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఆచార్యులు సుబ్రమణ్యం పంచాంగ శ్రవణం చేశారు. ఇటీవల మృతిచెందిన ప్రముఖ నటి శ్రీదేవి జ్ఞాపకార్థం అనిత గోలి, భవాని నైనాల పర్యవేక్షణలో 20 మంది చిన్నారులు శ్రీదేవి నటించిన చిత్రాల్లోని పాటలకు డ్యాన్సులు వేశారు. కల్చరల్ టీమ్ సభ్యులు అనిత గోలి, అనుష విడపలపాటి, సుజన ఆచంట, రాణి వేగె, భవాని అమి, హవిలా దేవరపల్లి, సురేష్ బాదం, అన్విత, కౌసల్య గుత్త, రమ్య కపిలలు సమిష్టిగా సంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగా, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నవీన్ గంటా, హరి ప్రసాద్, భూషణ్, ఆనంద్ పిల్లి, నాగభూషణం బీమిశెట్టి, రామ్ గోపాల్ దేవరపల్లి, ప్రమోద్ పైడిపెల్లి, ధీరజ్ మంతేన, చైతన్య కాకర్ల, మురళి పరిమి, ఉమాదేవి సన, విష్ణు, జలగం, మైథిలి జలగం, అనిల్ మోపర్తి, భవాని సరస్వతిలు సహాయ సహకారాలు అందించారు. సీటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్ తళ్లూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రవీణ్ మొటూరు, రమేష్ మర్యాల, డా. పాల్ దేవరపల్లి, రావు ఆచంట, అశోక్ పగడాల, రాహుల్ విరాటపు, కమ్యునిటీ సభ్యులు ఆజాద్ సుంకవల్లి, క్రిష్ణ ముశ్యం, క్రిష్ణ రంగరాజు, రత్నాకర్ కరుమూరిలు ఈ వేడుకలు విజయవంతం కావడానికి తమవంతు కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కల్చరల్ టీమ్ సభ్యులు, అతిథులకు సీటీఏ అధ్యక్షులు నాగేంద్ర వేగె కృతజ్ఞతలు తెలిపారు.