చికాగోలో ఘనంగా ఉగాది వేడుకలు | Sakshi
Sakshi News home page

చికాగోలో ఘనంగా ఉగాది వేడుకలు

Published Mon, Apr 2 2018 3:46 PM

CTA Ugadi celebrations in Chicago - Sakshi

చికాగో తెలుగు అసోసియేషన్‌(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. చికాగోలోని బాలాజీ ఆలయంలో జరిగిన ఈ వేడుకలకు 600 మందికి ఎన్‌ఆర్‌ఐలు హాజరయ్యారు. ఆటా, పాటలతో ఈ వేడుక ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. రమ్య కపిల, అన్వితల గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. సురేష్‌ బాదం, అన్వితలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వేమన, సుమతి శతకాల నుంచి చిన్నారులు పద్యాలను పాడుతూ, అర్థాన్ని వివరించారు. ఉగాది పచ్చడి పోటీల్లో టాప్‌ 10 మందిని ఎంపిక చేసి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఆచార్యులు సుబ్రమణ్యం పంచాంగ శ్రవణం చేశారు.


ఇటీవల మృతిచెందిన ప్రముఖ నటి శ్రీదేవి జ్ఞాపకార్థం అనిత గోలి, భవాని నైనాల పర్యవేక్షణలో 20 మంది చిన్నారులు శ్రీదేవి నటించిన చిత్రాల్లోని పాటలకు డ్యాన్సులు వేశారు. కల్చరల్‌ టీమ్‌ సభ్యులు అనిత గోలి, అనుష విడపలపాటి, సుజన ఆచంట, రాణి వేగె, భవాని అమి, హవిలా దేవరపల్లి, సురేష్‌ బాదం, అన్విత, కౌసల్య గుత్త, రమ్య కపిలలు సమిష్టిగా సంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగా, ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు నవీన్‌ గంటా, హరి ప్రసాద్‌, భూషణ్‌, ఆనంద్‌ పిల్లి, నాగభూషణం బీమిశెట్టి, రామ్‌ గోపాల్‌ దేవరపల్లి, ప్రమోద్‌ పైడిపెల్లి, ధీరజ్‌ మంతేన, చైతన్య కాకర్ల, మురళి పరిమి, ఉమాదేవి సన, విష్ణు, జలగం, మైథిలి జలగం, అనిల్‌ మోపర్తి, భవాని సరస్వతిలు సహాయ సహకారాలు అందించారు.

సీటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రసాద్‌ తళ్లూరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు అందజేశారు. బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ప్రవీణ్‌ మొటూరు, రమేష్‌ మర్యాల, డా. పాల్‌ దేవరపల్లి, రావు ఆచంట, అశోక్‌ పగడాల, రాహుల్‌ విరాటపు, కమ్యునిటీ సభ్యులు ఆజాద్‌ సుంకవల్లి, క్రిష్ణ ముశ్యం, క్రిష్ణ రంగరాజు, రత్నాకర్‌ కరుమూరిలు ఈ వేడుకలు విజయవంతం కావడానికి తమవంతు కృషి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కల్చరల్‌ టీమ్‌ సభ్యులు, అతిథులకు సీటీఏ అధ్యక్షులు నాగేంద్ర వేగె కృతజ్ఞతలు తెలిపారు.

1/11

2/11

3/11

4/11

5/11

6/11

7/11

8/11

9/11

10/11

11/11

Advertisement
 
Advertisement
 
Advertisement