Cube Lets
-
తొలి సారి భారత కెప్టెన్‌గా కార్తీక్.. అభిమాని ఏం చేశాడంటే..!
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కౌంటీ జట్టులతో రెండు వార్మాప్ మ్యాచ్‌లు ఆడింది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లలో భారత జట్టు కెప్టెన్‌గా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వ్యవహరించాడు. అయితే తన కెరీర్లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాదించింది. ఈ క్రమంలో కార్తీక్‌పై పృథ్వీష్ అనే యువకుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. మొజాయిక్ కళాకారుడైన పృథ్వీష్ 600 రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి కార్తీక్ చిత్రాన్ని రూపొందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పృత్వీష్ తన ట్విటర్లో షేర్ చేశాడు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భారీ పోర్ట్రెయిట్ రూపొందించిన పృత్వీష్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిస్తోంది. ఈ వీడియోపై కార్తీక్ కూడా స్పందించాడు. "బాగా తాయారు చేశావు పృథ్వీ , ఇది నన్ను బాగా అకట్టుకుంది" అని కార్తీక్ ట్వీట్ చేశాడు. ఇక మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ కార్తీక్ అద్భుతంగా రాణించాడు. చదవండి: కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్ అయ్యాడు! Very nice work prithvi . Highly impressive 🙂👍❤️ https://t.co/D6GxnlyEJA — DK (@DineshKarthik) July 4, 2022 -
రోబోట్రిక్స్
క్యూబ్లెట్స్, ద బ్రిక్స్ అండ్ అడాప్టర్స్, మాగ్నటిక్... ఇలా విభిన్న పరికరాలతో చిన్నారులు చిట్టి రోబోలను తయారు చేయడంలో ప్రతిభను కనబరుస్తున్నారు. మాదాపూర్ కావూరిహిల్స్‌లో ‘ఎడ్యూ రోబో’ కార్యాలయంలో ఆదివారం జరిగిన హ్యూమనైడ్ రోబోటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వర్క్‌షాప్‌లో ‘మాడ్యులర్ రోబో’ స్పెషల్ ఎట్రాక్షన్. మాస్-డబ్ల్యూఆర్ సాఫ్ట్వేర్ సహకారంతో ఈ రోబోను పిల్లలు ఐఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి అపరేట్ చేశారు. తమ ఆలోచనలకు తగ్గట్టుగా విభిన్న రోబోలను తయారు చేశారు. ఇంటర్ లింకింగ్ చేస్తూ డిస్టెన్స్ సెన్సర్, స్పేర్స్, పవర్ సప్లయ్, యాంటీ క్లాక్వైజ్ల సహాయంతో ఇన్నోవేటివ్ ఆలోచనలకు పదును పెట్టారు. ‘త్రీడీ డూడ్లర్’ మరో ఆకర్షణ. హీటర్, రైఫిల్‌తో ఉన్న ఈ పరికరం సహాయంతో పేర్లను రాయవచ్చు. అంతేకాదు... ఆ లెటర్స్‌ను చేత్తో పట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. - వాంకె శ్రీనివాస్