రోబోట్రిక్స్ | Humanoid Robotics and Electronics Workshop | Sakshi
Sakshi News home page

రోబోట్రిక్స్

Published Mon, Sep 22 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

రోబోట్రిక్స్

రోబోట్రిక్స్

క్యూబ్‌లెట్స్, ద బ్రిక్స్ అండ్ అడాప్టర్స్, మాగ్నటిక్... ఇలా విభిన్న పరికరాలతో చిన్నారులు చిట్టి రోబోలను తయారు చేయడంలో ప్రతిభను కనబరుస్తున్నారు. మాదాపూర్ కావూరిహిల్స్‌లో ‘ఎడ్యూ రోబో’ కార్యాలయంలో ఆదివారం జరిగిన హ్యూమనైడ్ రోబోటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వర్క్‌షాప్‌లో ‘మాడ్యులర్ రోబో’ స్పెషల్ ఎట్రాక్షన్. మాస్-డబ్ల్యూఆర్ సాఫ్ట్‌వేర్ సహకారంతో ఈ రోబోను పిల్లలు ఐఫోన్‌లో బ్లూటూత్ ఆన్ చేసి అపరేట్ చేశారు.

తమ ఆలోచనలకు తగ్గట్టుగా విభిన్న రోబోలను తయారు చేశారు. ఇంటర్ లింకింగ్ చేస్తూ డిస్టెన్స్ సెన్సర్, స్పేర్స్, పవర్ సప్లయ్, యాంటీ క్లాక్‌వైజ్‌ల సహాయంతో ఇన్నోవేటివ్ ఆలోచనలకు పదును పెట్టారు. ‘త్రీడీ డూడ్లర్’ మరో ఆకర్షణ. హీటర్, రైఫిల్‌తో ఉన్న ఈ పరికరం సహాయంతో పేర్లను రాయవచ్చు. అంతేకాదు... ఆ లెటర్స్‌ను చేత్తో పట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు.     - వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement