Cultural capital
-
సాంస్కృతిక రాజధానిగా పాలకొల్లును తీర్చిదిద్దాలి
డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఉల్లంపర్రు (పాలకొల్లు అర్బన్) : ఎందరో కళాకారులకు పుట్టినిల్లయిన పాలకొల్లును సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు కృషి చేయాలని గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. ఉల్లంపర్రులో ఆయన సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినాదం ఇచ్చారు. ఎమ్మెల్యే నిమ్మల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, తాను ఎమ్మెల్యేకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానన్నారు. దీపం వెలిగించి ఎలా నమస్కరిస్తామో, మొక్కను కూడా అలాగే నమస్కరించాలన్నారు. మొక్కలు లేనిదే మానవ మనుగడ లేదన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జెడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి, సర్పంచ్ పెదపాటి హవీలా, ఉప సర్పంచ్ పాశర్ల వెంకట రమణ పాల్గొన్నారు -
‘దేశం’దుశ్శాసనం
సాంస్కృతిక రాజధాని’గా రాజమండ్రిని అభివర్ణిస్తుంటారు. అలాంటి నగర పాలనాధికారాన్ని దక్కించుకున్న తెలుగుదేశం వారు కనీస సంస్కారం లేకుండా పేట్రేగిపోయూరు. వారి అధికారమదం ముందు ప్రజాస్వామ్యం.. వరద గోదావరి వెల్లువలో గడ్డిపరకలా కొట్టుకుపోరుుంది. కౌన్సిల్ హాలు గోడలే సిగ్గుపడేలా వారి దూషణలపర్వం కొనసాగింది. ‘కుర్చీల’ వంకన వారు.. కుర్చీలే భీతిల్లి పరుగులు తీసేలా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కాగా దీనంతటికీ.. వందల కోట్లతో చేపట్టే పుష్కరపనుల్లో కౌన్సిల్ ప్రమేయం లేకుండా చేసి, లబ్ధి పొందాలన్న అధికారపక్ష నేత పన్నాగం ఉందని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బల్లగుద్ది చెపుతోంది. సాక్షి, రాజమండ్రి : మేయర్ పంతం రజనీ శేషసారుు అధ్యక్షతన బుధవారం జరిగిన నగర పాలక మండలి సమావేశాన్ని అధికార తెలుగుదేశం సభ్యులు రణరంగంగా మార్చేశారు. ఓ పథకం ప్రకారం ప్రధాన ప్రతిపక్షం అయిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులపై దాడి కి దిగారు. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. ఎన్నుకున్న ప్రజలు ఖిన్నులయ్యేలా వ్యవహరించారు. రాజమండ్రి నగరపాలక సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన వారి దాష్టీకం.. ఎందరో ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన స్థానిక పాలన చరిత్ర, గౌరవాలను చిన్నబుచ్చింది. వీరా మన నగరాన్ని పాలించే కార్పొరేటర్లు అంటూ నగరవాసులు ముక్కున వేలేసుకున్నారు. నగర పాలక సంస్థ ఏర్పడ్డ నాటి నుంచి కౌన్సిల్ హాలులోకి పోలీసులు ప్రవేశించినది లేదు. కానీ టీడీపీ సభ్యుల దౌర్జన్య కాండ పుణ్యమాని ప్రజా సమస్యలు చర్చించాల్సిన సమావేశ మందిరంలోకి పోలీసులు కాలిడక తప్పలేదు. వారి దౌర్జన్యం ఇలా మొదలైంది.. గత నాలుగు కౌన్సిల్ సమావేశాల్లో సమావేశ మందిరంలో ఎడమ పక్కన ముందు వరుస నుంచి ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ సీపీ సభ్యులు కూర్చున్నారు. బుధవారం నాటి సమావేశంలో వీరి సీట్లను టీడీపీ సభ్యులు ఆక్రమించి, లేవమని అడిగితే వాగ్వాదానికి దిగారు. ఉద్దేశ పూర్వకంగా వైఎస్సార్ సీపీ సభ్యులపై ముందు మాటల దాడికి దిగారు. దానిని దీటుగా తిప్పికొడుతున్న వైఎస్సార్ సీపీ సభ్యులపై ముందుగానే వేసుకున్న పథకం ప్రకారం భౌతిక దాడులకు సిద్ధపడ్డారు. టీడీపీ సభ్యుడు పాలిక శ్రీను వైఎస్సార్ సీపీ సభ్యుని కాలర్ పట్టుకోవడం, టీడీపీ ఫ్లోర్ లీడర్ వర్రే శీనివాస్ కూడా దాడికి ముందుకు రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ ఆగడం వెనుక గోరంట్ల పన్నాగం.. రూ.కోట్లతో చేపట్టే పుష్కర పనులను కౌన్సిల్లో ఉంచకుండా ఏకపక్షంగా చేసుకుపోతున్న వైనంపై సభ దృష్టిని మళ్లించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పన్నిన పన్నాగం ప్రకారమే సమావేశంలో అధికారపక్ష సభ్యులు దాడులకు తెగబడ్డారని ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. సీనియర్ నేత అయి ఉండి కూడా టీడీపీ సభ్యుల ఆగడాలను గోరంట్ల అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా తాను కూడా వారితో చేరి పరిస్థితిని మరింత జటిలం చేశారు. ప్రతిపక్షసభ్యులపై జరుగుతున్న దాడిని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తీవ్రంగా ఖండించారు. ఆదిరెడ్డి టీడీపీ సభ్యుల దాడిని వారించే ప్రయత్నం చేయగా గోరంట్ల సైతం ఎమ్మెల్సీ ఆదిరెడ్డిపై దాడికి సిద్ధమయ్యూరు. ఈ నేపథ్యంలో ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి మహోద్రిక్తంగా మారుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. మేయర్ మాటా బేఖాతర్ సభలో ఉద్రిక్తతను సడలించడానికి మేయర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీ సభ్యులు ఆమె ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ రెచ్చిపోయారు. తమకు ప్రోటోకాల్ లేదని, సభా మర్యాదలు తమకు వర్తించవని చేష్టల ద్వారా చాటి చెప్పారు. సంఖ్యా బలాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిళారెడ్డి తీవ్రంగా ఖండించారు. కౌన్సిల్లో ఏర్పడ్డ ఈ పరిస్థితి ప్రజాభివృద్ధికి గొడ్డలి పెట్టు కాగలదని ఆవేదన వ్యక్తం చేశారు. జనమే గుణపాఠం చెపుతారు.. సంఖ్యాబలం ఉంది కదా అని టీడీపీ సభ్యులు వీర్రవీగుతున్నారు. వారి అవినీతి చర్యలను సమర్థించుకోవడానికే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. వారి బలాన్ని ఎదిరించేందుకు మా ఎనిమిది మంది సభ్యులు చాలు. ఈ సభలో వారు కౌరవుల్లాంటి వారు. మావాళ్లు పాండవులు. వీరి దుశ్చర్యలను తిప్పి కొట్టడం మాకు ఏ మంత కష్టం కాదు. టీడీపీ అవినీతి, ఆగడాలను అదుపు చేస్తాం, ప్రజా కోర్టులో ఎండగడతాం. ప్రజలే వీళ్లకి తగిన గుణపాఠం చెబుతారు. - ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ అవినీతి బయటపడుతుందన్న భయంతోనే.. కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతిని సాక్ష్యాధారాలతో వెలికి తీస్తున్నామన్న భయంతో, కుట్రపూరితంగానే టీడీపీ సభ్యులు మాపై దాడికి తెగబడ్డారు. అవినీతిపై సమాధానం చెప్పాల్సి వస్తుంనే గిల్లి కజ్ఞాలు పెట్టుకుంటున్నారు. అయినా మేం వదిలే ప్రసక్తి లేదు. వారి చర్యలను తిప్పి కొడతాం. నగరపాలక సంస్థలో అవినీతిని మూలాలతో సహా వెలికి తీసి చూపిస్తాం. -మేడపాటి షర్మిళారెడ్డి, వైస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ -
కళ తప్పిన కళావేదికలు
* రూ.కోట్లలో తుపాను నష్టం * సాంస్కృతిక రంగానికి తీరని వేదన విశాఖపట్నం-కల్చరల్: సాంస్కృతిక రాజధానికిగా వెలుగొందుతున్న విశాఖపట్నం హుదూద్ తుపాను ప్రభావంతో మూగబోయింది. సాంస్కృతిక వేదికలు, ఆడిటోరియంలు కళావిహీనంగా మారాయి. తుపాను తాకిడికి వేదికలన్నీ శిథిలమైపోయాయి. కొన్ని పూర్తిగాను, మరికొన్ని పాక్షికంగా పాడవ్వడంతో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లింది. దీంతో ఇప్పట్లో తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. శిల్పారామానికి భారీ నష్టం గ్రామీణ కళలను, సంస్కృతిని ప్రతిబింబించే శిల్పారామం (జాతర) కళ తప్పింది. 25 ఎకరాల వనంలో పచ్చదనం మాయమైంది. కొన్ని శిల్పాలు శిథిలమయ్యాయి. లోపల ఉన్న ఆరుబయట హాఫీ కళావేదికలు దెబ్బతిన్నాయి. ఇటీవల నిర్మించిన ఫంక్షన్ హాల్, 18 స్టాల్స్, ఫైబర్ శిల్పాలు దెబ్బతిన్నాయి. నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్కు పూర్తిగా ధ్వంసమైంది. రూ.1.12 కోట్ల నష్టం వాటిల్లిందని ఏపీ టూరిజం సంస్థ అంచనా వేసింది. దెబ్బతిన్న వైశాఖి జల ఉద్యానవనం విశాఖకు వన్నె తెచ్చే కళావేదికల్లో వైశాఖి జల ఉద్యానవనం ఒకటి. ఇది నగరంలో అన్ని తరగతుల వారికి ఆహ్లాదాన్ని అందించే వేదిక. అలాంటి వేదిక అందాలను హుదూద్ తుపాను కబళించింది. ఎస్ఎస్ ఫంక్షన్‌హాల్, ఏపీల్ గ్రౌండ్, మలేసియా టెంట్, గ్రీనరీ, బేంబో గార్డెన్స్, ప్లే ఎక్విప్మెంట్స్, కళావేదిక, పార్కు, లైటింగ్ సిస్టమ్ మొత్తం 80 శాతం దెబ్బతిన్నాయి. వెదురు వనంతో తయారు చేసిన ద్వారం పూర్తిగా ధ్వంసమైంది. దీని నష్టం రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. కళాభారతికి పాక్షిక నష్టం నిత్యం కళాకారులతో కిటకిటలాడే విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడెమీ (వీఎండీఏ) ఆడిటోరియం కళాభారతి కళతప్పింది. తుపాను ప్రభావానికి ప్రహరీ గోడ ధ్వంసమైంది. ఆడిటోరియం పైన వాల్ రేకులు, కిటికీల గ్లాస్లు, గ్యాలరీలో ఉన్న ప్రముఖుల చిత్రాలు, బాత్రూమ్స్ డోర్స్ ధ్వంసమయ్యాయి. సుమారు రూ.8 లక్షలు నష్టం వాటిల్లిందని వీఎండీఏ కార్యదర్శి జి.ఆర్.కె. రాంబాబు తెలిపారు. గురజాడ కళాక్షేత్రానికి తుపాను తాకిడి గురజాడ కళాక్షేత్రం కూడా తుపాను తాకిడికి గురయ్యింది. కళావేదిక ఎదురుగా ఉన్న ఓపెన్ ఆడిటోరియం రే కులన్నీ శిథిలమై అస్తవ్యస్తంగా మారింది. వే దికలోపల తెరలు చిరిగిపోయి అందహీనం గా కన్పిస్తున్నాయి. ప్రస్తుతం మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఐదు లక్షల వరకు నష్టం వాటిల్లిందని వుడా అధికారులు అంచనా వేశారు.