Cummins
-
‘ఆ క్షణం లైబ్రరీలా అనిపించింది’
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ గెలిచి వారం రోజులు దాటినా ఆ్రస్టేలియా జట్టు తమ విజయాన్ని ఇంకా వేడుకలా జరుపుకుంటూనే ఉంది. మంగళవారం సిడ్నీ మైదానంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ మిచెల్ స్టార్క్ కలిసి వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా కమిన్స్ తన ఫైనల్ మ్యాచ్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా కోహ్లి వికెట్ తీయడం మ్యాచ్‌ను మలుపు తిప్పిందని అతను అన్నాడు. కమిన్స్ బంతిని కోహ్లి వికెట్లపైకి ఆడుకోవడంతో భారత్ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. ఆ క్షణం మైదానంలో ఆవరించిన నిశ్శబ్దం మరచిపోలేనని కమిన్స్ అన్నాడు. ‘కోహ్లి వికెట్ పడిన తర్వాత మా జట్టు సభ్యులంతా ఒక చోట చేరి సంబరాలు చేసుకుంటుంటే స్మిత్ ఒక మాట అన్నాడు. మైదానంలో ఏదైనా శబ్దం వినిపిస్తోందా అని అడిగాడు. మేం ఒక క్షణం ఆగి గమనించాం. స్టేడియం మొత్తం ఒక లైబ్రరీలా అనిపించింది. లక్ష మంది ఉన్న మైదానంలో అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఈ ఘట్టాన్ని చిరకాలం గుర్తుంచుకుంటా’ అని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ఒకే సమయంలో భిన్న ఫార్మాట్లలో తాము ప్రపంచ చాంపియన్లుగా ఉండటం చాలా గర్వంగా ఉందని అన్నాడు. ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు ముందుగానే... భారత్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో పాల్గొంటున్న ఆ్రస్టేలియా జట్టులోని ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు సిరీస్ ముగియడానికి ముందే స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్నవారిలో ఏడుగురు టి20 సిరీస్ కోసం ఇక్కడే ఆగిపోయారు. వీరిలో హెడ్ ఒక్కడే సిరీస్ ముగిసే వరకు ఉండనున్నారు. స్మిత్, జంపా ఇప్పటికే బయల్దేరిపోగా...మరో నలుగురు మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, ఇన్‌గ్లిస్, అబాట్ మూడో మ్యాచ్ ముగియగానే వెళ్లిపోతారు. చివరి రెండు మ్యాచ్‌లకు వీరు అందుబాటులో ఉండటం లేదు. వీరి స్థానాల్లో జోష్ ఫిలిప్, బెన్ మెక్‌డెర్మాట్, బెన్ డ్వార్షియస్, క్రిస్ గ్రీన్‌లను ఆ్రస్టేలియా సెలక్టర్లు ఎంపిక చేశారు. -
కెప్టెన్ల ఫోటో షూట్: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల ఫొటో షూట్ ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్ ఎక్కడ? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తెలుసుకుందాం రండి..! అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఇరు జట్ల సారధులు అదాలజ్ వావ్‌ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్ టూరిజం విభాఘం తమ ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్‌కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్లో మార్వాడీ భాషలో, స్టెప్‌వెల్‌ను ‘వావ్’ అంటారు. ఇలాంటి ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్ ని వావ్? Rohit Sharma, the captain of the Indian #Cricket Team, and Pat Cummins, the captain of the Australian Cricket Team, visited #AdalajStepwell. They were mesmerized by the architectural marvel of the stepwell and overwhelmed by the warm hospitality of #Gujarat. VC: @ICC pic.twitter.com/93MncfCIUR — Gujarat Tourism (@GujaratTourism) November 18, 2023 అదాలజ్ ని వావ్ అదాలజ్ ని వావ్ లేదా అదాలజ్ స్టెప్‌వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు. ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్‌లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది. తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో ఉన్న పాలరాతి స్లాబ్‌పై అదాలజ్ స్టెప్‌వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు. భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్‌పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా, బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్‌వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి పథకం వేరే ఉంటుంది. ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి ఉన్నాయి. ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్‌ఫారమ్‌లతో ఉంటుంది. మూడు మెట్ల మార్గాలు భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు. అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి. మేస్త్రీలకు మరణ శిక్ష బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని మేస్త్రీలని అడిగాడట. దానికి సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. -
అసలు సమరానికి సై!
ప్రపంచకప్ గెలిచే వరకు మన పని పూర్తి కాదని గొప్పవాళ్లు తరచుగా చెబుతుంటారు. అది వాస్తవం కూడా. అందుకే మేమూ దానిని గెలవాలని కోరుకుంటున్నాం. అయితే దానికో పద్ధతి ఉంది. దానిని పాటించాలి. ఎలాగైనా గెలవాలని మొండిగా వెళితే తప్పులు జరగవచ్చు. వరల్డ్ కప్ గెలవాలనే కోరిక, ఆశ ఉండటంతో తప్పు లేదు. కానీ అన్నీ కలిసి రావాలి. 99 శాతం మన శ్రమ తర్వాత ఆ ఒక్క శాతం అదృష్టం దేవుడి చేతుల్లో ఉంటుంది. భారత క్రికెటర్లపై ఒత్తిడి ఎప్పుడైనా ఉండేదే. అది సహజం. అయితే దానిని అధిగమించగల అనుభవం జట్టులో చాలా మందికి వచ్చేసింది. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ చెన్నై: వన్డే క్రికెట్లో మరోసారి జగజ్జేతగా నిలిచే లక్ష్యంతో భారత జట్టు తొలి అడుగు వేసేందుకు సిద్ధమైంది. అభిమానుల భారీ అంచనాలను మోస్తూ ఈ మెగా ఈవెంట్లో టీమిండియా నేడు మొదటి మ్యాచ్‌లో మరో మాజీ చాంపియన్ ఆ్రస్టేలియాను ఎదుర్కొంటుంది. టోర్నీ ప్రారంభమైన తర్వాత తొలి నాలుగు రోజుల్లో అంతంతమాత్రమంగా ఉన్న అభిమాన ప్రదర్శన ఈ మ్యాచ్‌తో ఆకాశాన్ని తాకనుంది. ఇటీవలే ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ తర్వాత ప్రత్యర్థి గురించి ఇరు జట్లకూ తగిన అవగాహన ఉండటంతో ఆసక్తికర పోరు ఖాయం. రెండు పెద్ద జట్ల మధ్య జరిగే ఈ సమరం సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. బరిలో ఇషాన్ కిషన్... వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌గా ప్రపంచ క్రికెట్లో తనకు ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించాలని కోరుకుంటున్న రోహిత్ శర్మకు ఇది కీలక మ్యాచ్. పటిష్ట జట్టును తొలి పోరులో ఓడిస్తే టోర్నీ తర్వాతి మ్యాచుల్లో ఆ ఆత్మవిశ్వాసం కొనసాగడం ఖాయం. అయితే రోహిత్‌కు జోడీగా ఓపెనింగ్ చేసే గిల్ ‘డెంగీ’ కారణంగా మ్యాచ్‌కు దూరం కావడం కాస్త నిరాశపర్చే అంశం. కానీ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న ఇషాన్ కిషన్ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉండటం సానుకూలాంశం. రోహిత్, కోహ్లి, శ్రేయస్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఫామ్ విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. వీరంతా కలిసి జట్టుకు భారీ స్కోరు అందించగల సమర్థులు. బౌలింగ్‌లో ముగ్గురు స్పిన్నర్లను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని రోహిత్ ఇప్పటికే చెప్పాడు. కుల్దీప్తో పాటు సొంతగడ్డపై అశ్విన్ బరిలోకి దిగడం ఖాయం. మూడో స్పిన్నర్‌గా జడేజా తనవంతు పాత్ర పోషిస్తాడు. ఇద్దరు పేసర్లు బుమ్రా, సిరాజ్‌లు ఆరంభంలో ప్రభావం చూపిస్తే జట్టుకు తిరుగుండదు. ఆత్మవిశ్వాసంతో ఆసీస్... ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో రెండు మ్యాచ్‌లు ఓడి వన్డే సిరీస్ కోల్పోయినా... చివరి మ్యాచ్‌లో గెలుపు జట్టుకు ఉత్సాహాన్ని అందించింది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో మ్యాక్స్‌వెల్ ప్రదర్శన జట్టు బలం పెంచింది. రెగ్యులర్ స్పిన్నర్ ఆడమ్ జంపా కూడా రాణించాల్సి ఉంది. అటు అనుభవం, ఇటు రికార్డులపరంగా కూడా ఆసీస్ పేస్ దళం చాలా పటిష్టంగా ఉంది. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్ ఏ పిచ్‌పైనైనా ప్రభావం చూపగలరు. స్టొయినిస్, గ్రీన్ రూపంలో జట్టులో మంచి ఆల్‌రౌండర్లు ఉన్నారు. స్టొయినిస్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ఆ్రస్టేలియా బ్యాటింగ్ బృందం కూడా చాలా పటిష్టంగా ఉంది. భారత గడ్డపై అపార అనుభవం ఉన్న వార్నర్‌కు దూకుడైన మిచెల్ మార్ష్ జత కలిస్తే శుభారంభాలు ఖాయం. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు స్మిత్, లబుషేన్ ఉన్నారు. లోయర్ ఆర్డర్లో క్యారీ, మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడగల సమర్థులు. భారత్‌లాగే ఆసీస్ కూడా వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటి. ఆ జట్టు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే భారత్‌కు గెలుపు అంత సులువు కాదు. 12 ప్రపంచకప్ టోర్నీల్లో భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 4 మ్యాచ్‌ల్లో... ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. చెన్నైలో ఈ రెండు జట్లు మూడుసార్లు పోటీపడ్డాయి. భారత్ ఒక మ్యాచ్‌లో, ఆసీస్ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ పిచ్. అయితే మరీ భారీ స్కోర్లకు అవకాశం లేదు. మ్యాచ్‌కు వాడబోయే పిచ్ నల్లరేగడి మట్టిది కావడంతో కాస్త నెమ్మదిగా ఉంటుంది. స్పిన్‌కు అనుకూలిస్తుంది కూడా. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ ఆసాంతం కాకపోయినా కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగించవచ్చు. శనివారం సాయంత్రం చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్, కుల్దీప్. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, మార్ష్, స్మిత్, లబుషేన్, గ్రీన్, క్యారీ, మ్యాక్స్‌వెల్, స్టార్క్, హాజల్‌వుడ్, జంపా. -
టాస్ ఓడిపోవడమే మంచిదైంది..
-
కోల్‌కథ...ఇంకా ఉంది!
ముంబై: తొలి పది మ్యాచ్‌లలో తీసింది 5 వికెట్లే... ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి తన సత్తా చూపించాడు. 9 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ముంబైకి మంచి విజయావకాశం సృష్టించాడు. కానీ రోహిత్ శర్మ బృందం ఆ అవకాశాన్ని వృథా చేసుకుంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించే స్థితిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) కీలక విజయంతో ఆశలు నిలబెట్టుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 52 పరుగుల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది. ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (24 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), నితీశ్ రాణా (26 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచింది. ఐపీఎల్లో బుమ్రా తన అత్యుత్తమ ప్రదర్శన (5/10) నమోదు చేశాడు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. రాణించిన వెంకటేశ్, రాణా... కోల్‌కతాకు ఈసారి సరైన ఆరంభం లభించింది. వెంకటేశ్, అజింక్య రహానే (24 బంతుల్లో 25; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 34 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. మూడో స్థానంలో వచ్చిన రాణా కూడా ధాటిని ప్రదర్శించడంతో 11 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు సరిగ్గా 100 పరుగులకు చేరింది. రాణా, రసెల్ జోరు మీదుండటంతో ఇక మిగిలిన ఓవర్లలో విధ్వంసం ఖాయమనిపించింది. అయితే బుమ్రా తన అద్భుత బౌలింగ్‌తో ఆటను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. ఒకే ఓవర్లో రాణా, రసెల్ (9)లను అవుట్ చేసిన బుమ్రా, తన తర్వాతి ఓవర్లో మరో 3 వికెట్లతో చెలరేగాడు. కోల్‌కతా వరుస వికెట్లు కోల్పోయిన తర్వాత చివర్లో రింకూ సింగ్ (19 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొంత పోరాడగలిగాడు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై తడబడింది. ఇషాన్ మినహా అంతా విఫలమయ్యారు. రోహిత్ శర్మ (2), తిలక్ వర్మ (6) ఆరంభంలోనే వెనుదిరగ్గా, టిమ్ డేవిడ్ (13), పొలార్డ్ (15) ప్రభావం చూపలేకపోయారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) స్యామ్స్ (బి) కార్తికేయ 43; రహానే (బి) కార్తికేయ 25; రాణా (సి) కిషన్ (బి) బుమ్రా 43; శ్రేయస్ (సి) కిషన్ (బి) మురుగన్ 6; రసెల్ (సి) పొలార్డ్ (బి) బుమ్రా 9; రింకూ (నాటౌట్) 23; జాక్సన్ (సి) స్యామ్స్ (బి) బుమ్రా 5; కమిన్స్ (సి) తిలక్ (బి) బుమ్రా 0; నరైన్ (సి అండ్ బి) బుమ్రా 0; సౌతీ (సి) పొలార్డ్ (బి) స్యామ్స్ 0; వరుణ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–60, 2–87, 3–123, 4–136, 5–139, 6–156, 7–156, 8–156, 9–164. బౌలింగ్: స్యామ్స్ 4–0–26–1, మురుగన్ 4–0–35–1, బుమ్రా 4–1–10–5, మెరిడిత్ 3–0–35–0, కార్తికేయ 3–0–32–2, పొలార్డ్ 2–0–26–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జాక్సన్ (బి) సౌతీ 2; ఇషాన్ (సి) రింకూ (బి) కమిన్స్ 51; తిలక్ (సి) రాణా (బి) రసెల్ 6; రమణ్‌దీప్ (సి) రాణా (బి) రసెల్ 12; డేవిడ్ (సి) రహానే (బి) వరుణ్ 13; పొలార్డ్ (రనౌట్) 15; స్యామ్స్ (సి) జాక్సన్ (బి) కమిన్స్ 1; మురుగన్ (సి) వరుణ్ (బి) కమిన్స్ 0; కార్తికేయ (రనౌట్) 3; బుమ్రా (రనౌట్) 0; మెరిడిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 113. వికెట్ల పతనం: 1–2, 2–32, 3–69, 4–83, 5–100, 6–102, 7–102, 8–112, 9–113, 10–113. బౌలింగ్: సౌతీ 3–0–10–1, కమిన్స్ 4–0–22–3, రసెల్ 2.3–0–22–2, నరైన్ 4–0–21–0, వరుణ్ 3–0–22–1, వెంకటేశ్ 1–0–8–0. ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
ICC Rankings: టాప్‌లో లబూషేన్.. దిగజారిన కోహ్లి ర్యాంక్
దుబాయ్: ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ల హవా కొనసాగింది. ఏకంగా నలుగురు ఆటగాళ్లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సత్తా చాటిన ఆసీస్ ఆటగాడు లబూషేన్(103, 51) 912 పాయింట్లతో.. ఇంగ్లండ్ సారధి జో రూట్(897)ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి చేరుకోగా, స్టీవ్ స్మిత్(884) మూడో స్థానంలో, డేవిడ్ వార్నర్(775) ఆరు, ట్రవిస్ హెడ్(728) పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ 5వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, టెస్ట్ సారధి విరాట్ కోహ్లి ఓ స్థానాన్ని కోల్పోయి 7వ ప్లేస్‌లో ఉన్నాడు. 🔝 Labuschagne dethrones Root 💪 Starc makes significant gains Australia stars shine in the latest @MRFWorldwide ICC Men’s Test Player Rankings. 👉 https://t.co/DNEarZ8zhm pic.twitter.com/W3Aoiy3ARP — ICC (@ICC) December 22, 2021 ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ఆసీస్ ప్లేయర్ల హవానే నడించింది. యాషెస్ రెండో టెస్ట్‌లో 6 వికెట్లు సాధించి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్.. దాదాపు ఏడాది తర్వాత తిరిగి టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు దూరమైనప్పటికీ ఆసీస్ టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆశ్విన్ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో ఇంగ్లండ్ సారధి రూట్ కెరీర్(111 టెస్ట్‌ల తర్వాత)లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 🔹 Babar Azam surges to the 🔝 🔹 Mohammad Rizwan into the top three 🔥 Significant gains for Pakistan batters in the latest @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 👉 https://t.co/hBFKXGWUp4 pic.twitter.com/qqUfYsFGkA — ICC (@ICC) December 22, 2021 మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌లు సంయుక్తంగా అగ్రపీఠాన్ని అధిరోహించగా.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 729 పాయింట్లతో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. చదవండి: అభిమానులకు ‘గుడ్‌న్యూస్’... స్టేడియంలోకి అనుమతి.. అయితే! -
ముంబై... జై జై
టోర్నీ జరిగేకొద్దీ ముంబై హోరెత్తిస్తోంది. ఆల్‌రౌండ్ సత్తా చాటుతోంది. బౌలింగ్‌తో కట్టేసి, మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని చుట్టేస్తోంది. తొలుత రాహుల్ చహర్ స్పిన్ మాయాజాలం రోహిత్ సేనకు బలంకాగా... ఓపెనర్లు రోహిత్, డికాక్ దూకుడుతో లక్ష్యం కూడా సులువైంది. వరుసగా ఐదో విజయంతో, ఓవరాల్‌గా ఆరో విజయంతో, మెరుగైన రన్‌రేట్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. అబుదాబి: వరుసగా ఐదు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. దీనికి విరుద్ధంగా ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయం సాధించింది. ఐపీఎల్లో శుక్రవారం జరిగిన పోరులో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కమిన్స్ (36 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్ (29 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ డికాక్ (44 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. అతనికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కోల్‌కతా తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. టామ్ బాంటన్, కమలేశ్ నాగర్కోటి స్థానాల్లో క్రిస్ గ్రీన్, శివమ్ మావిలను తీసుకుంది. ముంబై జేమ్స్ ప్యాటిన్సన్పు పక్కనబెట్టి కూల్టర్నీల్ను తీసుకుంది. టాప్–4 బ్యాట్లెత్తారు... కోల్‌కతా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఇన్నింగ్స్‌ను వెంటాడింది. టాప్–4 బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి (7), శుబ్‌మన్ గిల్ (21), నితీశ్ రాణా (5), దినేశ్ కార్తీక్ (4) ఎవరూ క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించలేదు. చెత్తషాట్లకు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మూడో ఓవర్లో రాహుల్‌ను బౌల్ట్ పెవిలియన్ చేర్చగా... కాసేపటికే నితీశ్‌ను కూల్టర్‌నీల్ ఔట్ చేశాడు. పవర్ ప్లే (6 ఓవర్లు)లో 33 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. కోల్‌కతాకు ఈ కష్టాలు చాలవన్నట్లు స్పిన్నర్ రాహుల్ చహర్ రెండు వరుస బంతుల్లో శుబ్‌మన్, దినేశ్ కార్తీక్‌లను ఔట్ చేయడంతో కోల్‌కతా 42 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. హిట్టర్ రసెల్, కొత్త కెప్టెన్ మోర్గాన్ క్రీజులో ఉండగా... 9వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. ఓ సిక్స్, ఫోర్ కొట్టిన రసెల్ (12)కు బుమ్రా చెక్‌పెట్టాడు. దీంతో 11వ ఓవర్లోనే నైట్‌రైడర్స్ సగం వికెట్లను కోల్పోయింది. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ మోర్గాన్ ఒక్కడే మిగిలాడు. ధాటిగా ఆడిన కమిన్స్... అయితే ఆ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. కమిన్స్ మెరుపులతో కోల్‌కతా గాడిన పడింది. కూల్టర్‌నీల్ వేసిన 13వ ఓవర్లో కమిన్స్ డీప్ స్క్వేర్‌లో భారీ సిక్సర్ బాదాడు. మరో రెండు బౌండరీలు కూడా కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. స్పిన్నర్లు రాహుల్ చహర్, కృనాల్ బౌలింగ్‌కు దిగడంతో మళ్లీ పరుగుల రాక తగ్గిపోయింది. బౌల్ట్ వేసిన 17వ ఓవర్లో మోర్గాన్ ఫోర్‌తో కోల్‌కతా ఆలస్యంగా 100 పరుగులను అధిగమించింది. మరుసటి ఓవర్ వేసిన బుమ్రా కేవలం 5 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 113 పరుగులే చేసింది. బౌల్ట్ బౌలింగ్‌లో కమిన్స్ బ్యాట్ ఝులిపించాడు. వరుసగా 6, 4 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. కూల్టర్‌నీల్ ఆఖరి ఓవర్లో బౌండరీతో కమిన్స్ అర్ధసెంచరీ (35 బంతుల్లో) పూర్తయ్యింది. మోర్గాన్ ఎట్టకేలకు బ్యాట్‌కు పనిచెప్పడంతో 2 భారీ సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో 21 పరుగులు రావడంతో జట్టు స్కోరు 148 పరుగులకు చేరింది. 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మోర్గాన్ ఆఖరిదాకా అజేయంగా నిలిచినా 40 పరుగులైనా చేయలేకపోయాడు. ఫోర్‌తో జోరు కొనసాగింపు... ఏమంత కష్టసాధ్యంకాని లక్ష్యానికి ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ చక్కని ఆరంభమిచ్చారు. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలచిన రోహిత్ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు. మొదట్లో ‘హిట్‌మ్యాన్’ ధాటికి వెనుకబడిన డికాక్ దంచేందుకు ఎంతోసేపు పట్టలేదు. కమిన్స్, గ్రీన్ ఓవర్లలో చకచకా ఫోర్లు బాదేశాడు. ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టడంలో రోహిత్‌ను మించిపోయాడు. ముంబై 5.4 ఓవర్లలో 50 పరుగులకు చేరింది. తర్వాత ప్రసిధ్ కృష్ణ 7వ ఓవర్లో డికాక్ 2 బౌండరీలు, ఓ భారీ సిక్సర్ కొట్టాడు. రోహిత్ రెండు పదుల వద్దే తచ్చాడుతుంటే డికాక్ ఏకంగా 25 బంతుల్లోనే అర్ధశతకాన్ని (8 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. కమిన్స్, రస్సెల్, ప్రసిధ్ కృష్ణ, గ్రీన్ ఇలా కోల్‌కతా కెప్టెన్ పదే పదే బౌలర్లను మార్చినా... డికాక్ జోరును ఏమార్చలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 9 పరుగుల రన్‌రేట్‌తో ముంబై 90 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లోనే ‘హిట్‌మ్యాన్’ అవుట్ కావడంతో 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. శివమ్ మావి ఈ జోడీని విడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (10)ను వరుణ్ పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు పడినా... డికాక్, హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ముంబై 17వ ఓవర్ పూర్తవకముందే లక్ష్యాన్ని ఛేదించింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: త్రిపాఠి (సి) సూర్యకుమార్ (బి) బౌల్ట్ 7; గిల్ (సి) పొలార్డ్ (బి) రాహుల్ చహర్ 21; నితీశ్ రాణా (సి) డికాక్ (బి) కూల్టర్‌నీల్ 5; దినేశ్ కార్తీక్ (బి) రాహుల్ చహర్ 4; మోర్గాన్ (నాటౌట్) 39; రసెల్ (సి) డికాక్ (బి) బుమ్రా 12; కమిన్స్ (నాటౌట్) 53; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–18, 2–33, 3–42, 4–42, 5–61. బౌలింగ్: బౌల్ట్ 4–0–32–1, కూల్టర్‌నీల్ 4–0–51–1, బుమ్రా 4–0–22–1, కృనాల్ పాండ్యా 4–0–23–0, రాహుల్ చహర్ 4–0–18–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) దినేశ్ కార్తీక్ (బి) శివమ్ మావి 35; డికాక్ (నాటౌట్) 78; సూర్యకుమార్ యాదవ్ (బి) వరుణ్ 10; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.5 ఓవర్లలో 2 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–94, 2–111. బౌలింగ్: క్రిస్ గ్రీన్ 2.5–0–24–0, కమిన్స్ 3–0–28–0, ప్రసిధ్ కృష్ణ 2–0–30–0, రసెల్ 2–0–15–0, వరుణ్ చక్రవర్తి 4–0–23–1, శివమ్ మావి 3–0–24–1. -
బంగ్లా టూర్ కు కమిన్స్ దూరం
మెల్ బోర్న్: త్వరలో బంగ్లాదేశ్ తో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ కు ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి వన్డేలో కమిన్స్ గాయపడ్డాడు. అయితే బంగ్లా టూర్ వచ్చే సరికి కమిన్స్ సిద్దమవుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న కమిన్స్ గాయం మళ్లీ తిరగబెట్టడంతో అతని స్థానంలో జేమ్స్ ఫాల్కనర్ కు తీసుకున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న కమిన్స్ బంగ్లాతో సిరీస్ కు దూరం కావడం బాధాకరంగా ఉందని సెలెక్షన్ ప్యానెల్ చైర్మన్ రోడ్ మార్ష్ తెలిపాడు. బంగ్లా పర్యటనలో భాగంగా అక్టోబర్ 13 వ తేదీన ఆసీస్ తొలి టెస్టు ఆడనుంది.