బంగ్లా టూర్ కు కమిన్స్ దూరం | Pacer Cummins ruled out of Australia's tour of Bangladesh | Sakshi
Sakshi News home page

బంగ్లా టూర్ కు కమిన్స్ దూరం

Published Thu, Sep 24 2015 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

Pacer Cummins ruled out of Australia's tour of Bangladesh

మెల్ బోర్న్: త్వరలో బంగ్లాదేశ్ తో  జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ కు ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి వన్డేలో కమిన్స్  గాయపడ్డాడు. అయితే బంగ్లా టూర్ వచ్చే సరికి కమిన్స్ సిద్దమవుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది.

కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న కమిన్స్ గాయం మళ్లీ తిరగబెట్టడంతో అతని స్థానంలో జేమ్స్ ఫాల్కనర్ కు తీసుకున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న కమిన్స్ బంగ్లాతో సిరీస్ కు దూరం కావడం బాధాకరంగా ఉందని సెలెక్షన్ ప్యానెల్ చైర్మన్ రోడ్ మార్ష్ తెలిపాడు. బంగ్లా పర్యటనలో భాగంగా అక్టోబర్ 13 వ తేదీన ఆసీస్ తొలి టెస్టు ఆడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement