అనుమానాస్పద స్థితిలో వ్యక్తిమృతి
కొలనుపాక (ఆలేరు) : మండలంలోని కొలనుపాకలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఆలేరు ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ములుగు గ్రామానికి చెందిన కాసమైన మల్లేశం(35) కొన్ని సంవత్సరాల క్రితం కొలనుపాక గ్రామానికి ఇల్లరికం వచ్చాడు. ఇతడి భార్య స్వప్న శనివారం సాయంత్రం తన అత్తగారిళ్లు ములుగుకు వెళ్లింది. అదేరోజు రాత్రి మల్లేశం ఇంటి నుంచి బయల్దేరి రాఘవాపురం రోడ్డులోని ఓ వ్యవసాయ బావి వద్ద శవం అయి కనిపించాడు. దీంతో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు 10ఏళ్లలోపు ఇద్దరు అమ్మాయిలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.