విజయనగరంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
విజయనగరం : విజయనగరంలో సోమవారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలెవరూ రోడ్లపై తిరగకూడదని జిల్లా ఎస్పీ కార్తికేయ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కర్ఫ్యూ పేరుతో ఉదయం ఆరు గంటల నుంచే పోలీసుల హల్ చల్ చేస్తున్నారు. కరెంట్ సరఫరా లేకపోవటంతో నీటి సరఫరా నిలిచిపోయింది. పాలు, మంచినీరు, నిత్యావసర వస్తువులు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రెండు రోజులుగా నగరంలో పరిస్థితి అదుపు తప్పటంతో ఆదివారం కర్ఫ్యూ అమలు చేసిన విషయం తెలిసిందే. రీజనల్ ఐజీ ద్వారకా తిరుమలరావు పర్యవేక్షణలో ఇద్దరు డీఐజీలు, నలుగురు ఎస్పీలు, ఒక గ్రేహౌండ్స్ కమాండర్ ఆధ్వర్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.