current project
-
అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ
Stop Adani BY Citizens held a protest in Sri Lankas: శ్రీలంక విద్యుత్ బోర్డు చీఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలతో రాజుకున్న గొడవ కాస్త ముదిరి పెనువివాదంగా మారింది. ఆయన.. మన్నార్ జిల్లాలోని ఎనర్జీ ప్రాజెక్టుని అదానీ గ్రూప్‌కి ఇచ్చేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని, ఆ విషయాన్ని స్వయంగా రాజపక్స చెప్పారంటూ.. అనుచితన వ్యాఖ్యలు చేశాడు. ఐతే ఆ తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం, పదవికి రాజీనామ చేయడం అయిపోయనప్పటికీ ఆ వివాదం కార్చిచ్చులా రాజుకుంటోంది. ఈ మేరకు శ్రీలంకలోని కొలంబోలో నిరసనకారులు అదాని గ్రూప్‌కి మన్నార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ని ఇవ్వొద్దంటూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స చీకటి ఒప్పందంతో అదానీ గ్రూప్‌కి ఇచ్చేయాలనకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. అందుకనే ఎటువంటి పోటీ బిడ్డింగ్ ప్రక్రియ జరపకుండా అదానీ గ్రూప్‌కి ఈ ప్రాజెక్ట్‌ని కట్టబెట్టేందుకే ఈ అసంబంధమైన ఒప్పందం చేసుకున్నారంటూ నిరసనకారుల విరుచుకుపడ్డారు. ఈ మేరకు శ్రీలంకలోని కొంతమంది నినరసకారులు స్టాప్ అదానీ అంటూ... సోషల్ మీడియా వేదికగా కూడా అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా నిరసన పిలుపునిచ్చారు. ఈ మేరకు నిరసకారలు మాట్లాడుతూ..."మేము పునరుత్పాధకతను వ్యతిరేకించడం లేదని స్థిరమైన పర్యావరణం కోసం పాటుపడుతున్నాం . ఇంధన ప్రాజెక్టుల పోటీ బిడ్డింగ్ కోరుకుంటున్నాం. ఇప్పటికే ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ప్రాజెక్టుల కారణంగా మా దేశ సహజ నిల్వలు క్షీణిస్తున్నాయి. పైగా పర్యావరణానికి ముప్పు కలిగించే చీకటి ఒప్పందాలను మేము అనుమతించలేం. ప్రస్తుతం శ్రీలంక ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానికి కచ్చితమైన పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ అవినీతికి మాత్రం తావివ్వం అని నిరసనకారులు నొక్కి చెప్పారు". ఈ క్రమంలో అదానీ గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ..."శ్రీలంకలో పెట్టుబడుల పెట్టడంతో మా ఉద్దేశం పొరుగు దేశ అవసరాలను తీర్చడమే కాకుండా బాధ్యతాయుతమైన కార్పొరేటర్‌గా ఇరు దేశాల మధ్య భాగస్వామ్య సంబంధాలు పెంపొందింప చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశాం. అయినా ఈ సమస్య శ్రీలంక పార్లమెంట్‌లోనే పరిష్కరింపబడినప్పటికీ... ఇది ఒక పెను వివాదంగా మారడం మమల్ని చాలా నిరాశకు గురిచేసింది." అని చెప్పారు. ఐతే ఈ ఆరోపణలపై భారత్ స్పందించకపోవడం గమనార్హం. (చదవండి: సారీ.. ఏదో భావోద్వేగంలో భారత ప్రధాని పేరు చెప్పా!. ఆరోపణల్లో నిజం లేదు) -
సారీ.. ఏదో భావోద్వేగంలో భారత ప్రధాని పేరు చెప్పా!
Sri Lanka Adani Row: శ్రీలంకలో ఎనర్జీ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ బిడ్ వ్యవహారంపై పెనువివాదం చెలరేగింది. శ్రీలంక విద్యుత్ అథారిటీ చీఫ్ ఫెర్డినాండో ఈ ప్రాజెక్ట్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి మేరకే అధ్యక్షుడు గోటబయ రాజపక్స తలొగ్గి.. గౌతమ్ అదానీ గ్రూప్‌కి ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ ప్యానెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ బహిరంగ విచారణలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు రాజపక్స తనతో స్వయంగా చెప్పారని కూడా అన్నారు. ఐతే ఆ అభియోగాలను ఖండిస్తూ అధ్యక్ష కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ...."మన్నార్‌లో 500 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టుని ఏ వ్యక్తికి లేదా ఏ సంస్థకు ఇవ్వడానికి తాను ఏసమయంలోనూ ఎవరికీ అధికారం ఇవ్వలేదని, పేర్కొన్నారు. అయితే ప్రాజెక్ట్‌ల కోసం సంస్థల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందని, ఇది శ్రీలంక ప్రభుత్వంచే పారదర్శకంగా, జవాబుదారీ వ్యవస్థకు అనుగుణంగా నిర్వహించబడుతుంది" అని అధ్యక్షుడు రాజపక్స కార్యాలయం తెలిపింది. ఆ తర్వాత ఫెర్డినాండో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణలు చెప్పారు. ఆనుకోని ఒత్తిళ్లు, భావోద్వేగాలు కారణంగా భారత ప్రధాని పేరు చెప్పాల్సి వచ్చిందని వివరణ కూడా ఇచ్చారు. తాజాగా తన పదవికి కూడా రాజీనామా చేశారు. ఐతే శ్రీలంక తన చట్టాలను మార్పు చేసి, ఇంధన ప్రాజెక్టు కోసం పోటీ బిడ్డింగ్‌ని వదిలేయండంపై పార్లమెంట్లో చర్చ జరగడంతో ఈ వివాదం చెలరేగింది. వాస్తవానికి అదానీ గ్రూప్ డిసెంబర్లో మన్నార్, పూనేరిన్‌లలో రెండు విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లను దక్కించుకుంది. గౌతమ్ అదానీ శ్రీలంక సందర్శించడమే కాకుండా రాజపక్సతో సమావేశం గురించి ట్విట్టర్లో ట్వీట్ చేశారు కూడా. Re a statement made by the #lka CEB Chairman at a COPE committee hearing regarding the award of a Wind Power Project in Mannar, I categorically deny authorisation to award this project to any specific person or entity. I trust responsible communication in this regard will follow. — Gotabaya Rajapaksa (@GotabayaR) June 11, 2022 Privileged to meet President @GotabayaR and PM @PresRajapaksa. In addition to developing Colombo Port's Western Container Terminal, the Adani Group will explore other infrastructure partnerships. India's strong bonds with Sri Lanka are anchored to centuries’ old historic ties. pic.twitter.com/noq8A1aLAv — Gautam Adani (@gautam_adani) October 26, 2021 (చదవండి: ఉక్రెయిన్‌ని మట్టికరిపిస్తున్న రష్యాసేనలు.. యుద్దంలో కీలక పరిణామం) -
‘పవర్’ ప్రణాళికలు
కొత్త విద్యుత్ ప్లాంట్లపై తెలంగాణ కసరత్తు.. నల్లగొండలో 6,800 మెగావాట్ల ప్లాంట్ అంచనా వ్యయం 40 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్తు ప్రాజెక్టుల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే జెన్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెన్కో ఇంజనీరింగ్ వర్గాలు కొత్త నివేదికలు సిద్ధం చేశాయి. తాజా మార్పుల ప్రకారం నల్లగొండ జిల్లాలోనే మొత్తం 6,800 మెగావాట్ల సామర్థ్యంతో మెగా థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీఎస్ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావు తెలిపారు. రెండు 600 మెగావాట్ల యూనిట్లు, ఏడు 800 మెగావాట్ల యూనిట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు దామరచర్ల మండలంలోని వీర్లపాలెం, దిలావర్పూర్ గ్రామాల పరిధిలో మొత్తం 11 వేల ఎకరాల భూములు గుర్తించారు. ఇవన్నీ అటవీ భూములు కావటంతో ప్రత్యామ్నాయంగా అంతే మొత్తం భూములు అటవీ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎండీ తెలిపారు. అందులో రూ.36 వేల కోట్లు ఆర్ఈసీ, పీఎఫ్సీ రుణంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని.. మిగతా రూ.4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీల ద్వారా లేదా ఇతరత్రా వనరుల ద్వారా సమకూర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం హామీ ఇచ్చిన ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి రెండు యూనిట్లు (2800 మెగావాట్లు) రామగుండంలో ప్రస్తుతమున్న ప్లాంటు పరిధిలోనే నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
నవంబరు నుంచి విద్యుత్ ఉత్పత్తి
ముత్తుకూరు, న్యూస్‌లైన్ : మండలంలోని నేలటూరులో నిర్మితమవు తున్న ఏపీ జెన్కో విద్యుత్ ప్రాజెక్టులో ఈ ఏడాది నవంబర్ నుంచి మొదటి దశ లో (800 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆ సంస్థ సీఈ సత్యనారాయణ చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిలో కీలకమైన బాయిలర్‌ను మంగళవారం తెల్లవారు జామున 3.14 గంటలకు మండించారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రాజెక్టు ప్రగతి ఊపందుకుంది. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ లైటప్ ప్రక్రియ విజయవంతం కావడంతో మొదటి దశ విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగుమం అయిందన్నారు. రెండో దశ (800 మెగావాట్లు) విద్యుత్ ఉత్పత్తి 2014 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన కూలింగ్ టవర్లు, సీ వాటర్ ఇంటేక్ ప్లాంటు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈతో పాటు ప్రధాన భాగస్వామ్య సంస్థలైన టాటా, గామన్ ఇండియా, బీహెచ్ఈఎల్, ఆల్‌స్ట్రోమ్, ఇండ్‌వెల్ సంస్థల ప్రతినిధులంతా పాల్గొన్నారు. బాయిలర్ లైటప్ విజయవంతంగా జరిగినందుకు జెన్కో సీఎండీ విజయానంద్, డెరైక్టర్ రాధాకృష్ణ తదితరులు ప్రాజెక్టు ఇంజనీర్లను అభినందించారు.