cv Cyberabad Commissioner of Police Anand
-
అడివి శేష్‌కు ఛాలెంజ్ విసిరిన హైదరాబాద్ సీపీ
జూన్ 23న ఒలింపిక్‌డే సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పలువురి సెలబ్రిటీలకు ఇలా ఛాలెంజ్ విసిరారు. 'మన జీవితాలు ఎప్పుడూ ఆందోళనకరమైనవిగానే కొనసాగుతాయి. మునుపెన్నడూ లేనంత వేగంగా కదులుతున్న ఈ ప్రపంచంలో, ప్రజలు మాత్రం శారిరక వ్యాయామం లేకుండా ఉండటం చూస్తుంటే కలవరపెడుతుంది. అంతేకాకుండా చాలా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పిల్లలు, యువకులు తమ సెల్ ఫోన్లతో పాటు ఇతర డిజిటల్ గాడ్జెట్లకు అంకితమవుతున్నారు. అవి వారిని కట్టిపడేశాయి. దాంతో వారు అస్సలు కదలరు.' అని తెలిపారు. (ఇదీ చదవండి: పెద్ద కూతురి కోసం చిరంజీవి సంచలన నిర్ణయం!) ఈ ఒలింపిక్‌డే నుంచి అయినా వారిని మేలుకొల్పాలని తను వ్యాయామం చేసిన వీడియోను మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్,పీవీ సింధు, యాక్టర్ అడివి శేష్, నిఖల్‌కు ట్యాగ్ చేసి, ఇలాంటి వర్కౌట్స్ చేయాలని వారికి ఛాలెంజ్ విసిరారు. తాజాగా సినీ నటుడు అడివి శేష్ చేసిన వ్యాయామం వీడియోను సీపీ ఆనంద్‌కు షేర్ చేశాడు. త్వరలో మరింత ఫిట్నెస్తో తమను రీచ్ అవుతానని ఆయన అన్నాడు. (ఇదీ చదవండి: రానా నాయుడులో దుమ్ములేపిన భామ గురించి ఈ విషయాలు తెలుసా?) అందుకు తిరిగి సీపీ ఆనంద్ ఇలా అన్నారు. 'ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు ధన్యవాదాలు అడివి శేష్ ! మీ నిమాల్లో స్మార్ట్ లుక్‌తో ఉంటారు. నేను పోటీ పడలేను, అంతే కాదు కష్టం కూడా' అని సీపీ ఆనంద్ అన్నారు. Hi @VVSLaxman281 @pvsindhu1 @AdiviSesh @actor_Nikhil Pl do share your workout videos as it’ll inspire everyone to do some physical activity. https://t.co/4GhSD3mvaT— CV Anand IPS (@CVAnandIPS) June 24, 2023 Taking up your offer @CVAnandIPS sir🫡 Heres one of my home workout videos 🙏🏼I believe in natural training and a healthy lifestyle, just like you. Hopefully, I can match your fitness soon! ❤️ https://t.co/Jcui8Vv5Ig pic.twitter.com/7wLZ4vSIc2— Adivi Sesh (@AdiviSesh) June 24, 2023 -
క్లూస్‌టీమ్స్ బలోపేతం
శాస్త్రీయ ఆధారాల సేకరణపై సైబరాబాద్ పోలీసుల దృష్టి త్వరలోనే ఐదు బృందాల ఏర్పాటు త్వరితం కానున్న నేరశోధన సిటీబ్యూరో: నేరగాళ్లకు శిక్ష పడటంతో ఆధారాలు ముఖ్య భూమిక వహిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలంలో వీటిని సేకరించే క్లూస్ టీమ్‌లను బలోపేతం చేయడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. శాస్త్రీయ ఆధారాలు పక్కాగా ఉంటే నేరగాళ్ల శిక్ష శాతం పెరుగుతుందని భావిస్తున్న కమిషనర్ ...ప్రస్తుతమున్న ఫింగర్ ప్రింట్ యూనిట్‌కు తోడుగా క్లూస్‌టీమ్‌లను రం గంలోకి దింపాలని భావిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో లా అండ్ అర్డర్ పోలీసు స్టేషన్లున్నా...ఆధారాల సేకరణకు మాత్రం ప్రత్యేకంగా క్లూస్‌టీమ్ అంటూ ఏమీ లేదు. ఉన్నా ఫింగర్ ప్రింట్ విభాగంలో సిబ్బంది కూడా చాలా తక్కువగా ఉంది. దీంతో చాలా కేసుల్లో శాస్త్రీయ ఆధారాల సేకరణ వీలుపడటం లేదు. ఇటీవల ప్రత్యక్ష సాక్షులు తదితరుల సాక్ష్యాలు న్యాయస్థానాల్లో పెద్దగా నిలవడం లేదు. చివరి నిమిషంలో వారు ఎదురు తిరుగుతుండటంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో మాది రిగానే సైబరాబాద్‌లోనూ క్లూస్‌టీం సేవలను బాగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్న కమిషనర్ ఆనంద్... ఐదు జోన్లలోనూ ఒక్కో క్లూస్‌టీంను ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేపట్టారు. ప్రత్యేక శిక్షణ... ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్లలో శాస్త్రీయ ఆధారాల సేకరణ బాధ్యతను అక్కడి ఠాణాల్లోని ఇద్దరు పోలీ సులు చూసుకుంటున్నారు. వీరు బాగానే పనిచేస్తున్నప్పటికీ....శిక్షల శాతం పెరగాలంటే ప్రత్యేకంగా క్లూస్‌టీమ్ అవసరమని సీవీ ఆనంద్ భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని తీసుకొని శిక్షణ ఇవ్వనున్నారు. శాస్త్రీయ ఆధారాల సేకరణలో ప్రావీణ్యులైన వారిచే ఓరియంటేషన్ క్లాస్‌లతో పాటు ఫిజికల్‌గా కూడా క్లాస్‌లు తీసుకోనున్నారు. క్లూస్‌టీంలో అధికారితో పాటు ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, వేలిముద్రలు...రక్తనమూనా సేకరణ నిపుణులు, పేలుడు పదార్థాలను గుర్తించేవారు ఉంటారు. ఘటనాస్థలిలో రక్తం, వేలిముద్రల సేకరణకు విదేశాల నుంచి అత్యంత ఆధునికమైన పరికరాలను కూడా తెప్పిస్తున్నారు. ఈ బృందాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సేవలను వినియోగించడం ద్వారా నేరగాళ్లను అరెస్టు చేసే విషయంపై మరింత దృష్టి సారిస్తామని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ పేర్కొన్నారు.. నేరగాళ్లకు శిక్ష పడేందుకే... ఘటనాస్థలిలో శాస్త్రీయ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే, దోషులకు శిక్ష విధించే వీలుంటుంది. క్లూస్‌టీం వల్ల నేర పరిశోధన సులువవుతుంది. క్లిష్టమైన కేసులను వెం టనే ఛేదించవచ్చు. అందుకే ఈ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్