CVR rajendran
-
రూ.10వేల కోట్ల బిజినెస్ లక్ష్యం
విజయవాడ: వచ్చే మార్చి 2015 నాటికి రూ.10వేల కోట్లు వ్యాపారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ సీవీఆర్ రాజేంద్రన్ అన్నారు. నగరంలోని హోటల్ గేట్‌వేలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన బ్యాంక్ ప్రణాళికను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పది నూతన బ్రాంచిలను ప్రారంభిస్తున్నామని, మరో పది బ్రాంచిలను ఆధునీకరించి నవశక్తి ప్రాజెక్ట్ ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రిటైల్ వ్యాపార రుణాలతోపాటు, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, హౌసింగ్, ఎడ్యుకేషన్ రుణాల మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ద్వారా సెప్టెంబరు 4 నాటికి 29వేల ఖాతాలు ప్రారంభించామన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనలను అనుగుణంగా వ్యవహరిస్తామని, ఇప్పటికే తాము ప్రభుత్వానికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణాలు రూ.1284 కోట్ల నిరర్ధక ఆస్తులుగావున్నాయని, రుణ మాఫీ వర్తించని వారు తక్షణమే రుణాలు చెల్లించి, తిరిగి పొందాలని రాజేంద్రన్ కోరారు. విజయవాడ జోన్‌కు సంబంధించి 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండు నూతన బ్రాంచీలు, నాలుగు ఏటీఎంలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గుంటూరు డీజీఎం గిరీష్‌కుమార్ మాట్లాడుతూ.. రుణమాఫీకి అర్హులైన రైతులు రుణాలు చెల్లించినప్పటికీ, మాఫీ వర్తింపజేసిన తర్వాత కట్టిన రుణాలు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. అందువలన రైతులు తొలుత తమ రుణాలు చెల్లించి, 24గంటల్లోపు తిరిగి పొందవచ్చన్నారు. డ్వాక్రా సభ్యులూ రుణాలు చెల్లించాలని, లేనిపక్షంలో వడ్డీ లేని రుణాలు పొందుటకు అనర్హులవుతారని పేర్కొన్నారు. సమావేశంలో విజయవాడ డీజీఎం కృష్ణారావు కూడా పాల్గొన్నారు. -
నిజమైన లబ్దిదారులకే రుణమాఫీ: ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్: రైతు రుణమాఫీపై ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ సీవీఆర్ రాజేంద్రన్ శుక్రవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజమైన లబ్ధిదారులకే రుణమాఫీ వర్తిస్తుందని రాజేంద్రన్ అన్నారు. కుటుంబానికి ఒక్క లోన్ మాత్రమే మాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. అర్హులు కానివారు తీసుకున్న లోన్లకు మాఫీ ఉండదని రాజేంద్రన్ స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాలకు రుణాల మాఫీ అనేది ప్రభుత్వం చేస్తున్న సహాయం మాత్రమే ఆంధ్రా బ్యాంక్ ఛైర్మన్ సి.వి.ఆర్ రాజేంద్రన్ మీడియాకు వెల్లడించారు. -
ఖాతాదారుల సేవలకు ప్రాధాన్యత: ఆంధ్రాబ్యాంక్
హైదరాబాద్: ఖాతాదారులకు నాణ్యమైన సేవలను అందించి వారి అభిమానం చూరగొనేందుకు కృషి చేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సీవీఆర్. రాజేంద్రన్ పేర్కొన్నారు. ఎల్బీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్-2 ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఆంధ్రాబ్యాంకు ప్రారంభించిన నవశక్తి బ్రాంచీలు ఖాతాదారుల మన్ననలు పొందాయన్నారు. నగదు డిపాజిట్ ఏటీఎం మిషన్లు మరిన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఆంధ్రా బ్యాంకు 2000వ బ్రాంచ్
విజయవాడ (మధురానగర్), న్యూస్‌లైన్ : ఆంధ్రా బ్యాంకు 2000వ శాఖను విజయవాడలోని అయోధ్యనగర్ లోటస్‌ల్యాండ్ మార్క్‌లో సోమవారం ఆ బ్యాంకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సీవీఆర్ రాజేంద్రన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకు మొట్టమొదట జిల్లాలోని మచిలీపట్నంలోనే ప్రారంభమయ్యిందని, రెండు వేలవ బ్రాంచిని కూడా జిల్లాలోనే ఏర్పాటుచేయడం విశేష మన్నారు. దేశవ్యాప్తంగా రెండు వేల బ్రాంచీలలో 1213 బ్రాంచీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఇందులో సీమాంధ్రప్రాంతంలో 754 శాఖలు, తెలంగాణా ప్రాంతంలో 459 బ్రాంచీలున్నాయన్నారు. సీమాంద్ర, తెలంగాణా ప్రాంతాలు విడిపోయినా బ్యాంకు సేవలలలో మాత్రం ఎటువంటిలోపాలు రానీయమన్నారు. -
అనిశ్చితితో తగ్గిన వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర విభజన నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా వ్యాపారం 10-20 శాతం మేర దెబ్బతిందని ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సివీఆర్ రాజేంద్రన్ చెప్పారు. దీనికి తోడు విద్యుత్, ఇన్ఫ్రా కంపెనీలకు ఇచ్చిన రుణాలు కూడా రీస్ట్రక్చర్ చేయాల్సి వస్తుండటం తదితర అంశాల మూలంగా కూడా బ్యాంక్ ప్రస్తుతం కష్టకాలాన్ని ఎదుర్కొంటోందన్నారు. అయితే, ఎన్నికలు ముగిశాక .. వచ్చే ఆరు నెలల్లో పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ ఆంధ్రా బ్యాంక్ కార్పొరేట్ బ్యాంకింగ్ బ్రాంచీని కొత్త ఆవరణలో ప్రారంభించిన సందర్భంగా రాజేంద్రన్ ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ వ్యాపారం రూ. 2,35,000 కోట్ల స్థాయిలో ఉండగా..ఇందులో దాదాపు 50 శాతం వాటా ఆంధ్రప్రదేశ్‌దే ఉందన్నారు. హైదరాబాద్ విభాగం నుంచే రూ. 45,000 కోట్ల వ్యాపారం వస్తోందని వివరించారు. ప్రస్తుతం రిటైల్ లోన్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని రాజేంద్రన్ ఈ సందర్భంగా వివరించారు. డీసీ రుణాలు..: డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ సంస్థ రుణాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేసినా పూర్తి విలువ రాబట్టుకోగలిగే అవకాశం లేదని రాజేంద్రన్ చెప్పారు. ఒకవేళ రుణాల తిరిగి చెల్లింపునకు డీసీ సరైన ప్రణాళికతో కంపెనీ గానీ ముందుకొస్తే.. సానుకూలంగా పరిశీలించేందుకు ఆస్కారం ఉందన్నారు. వడ్డీ రేట్లపై కామెంట్..: ఆర్బీఐ రెపో రేటు పెంపునకు అనుగుణంగా ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెంచే యోచనేదీ లేదని.. మిగతా పెద్ద బ్యాంకులేమైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటే తామూ నిర్ణయం తీసుకుంటామని రాజేంద్రన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా లాకర్ సెంటర్లు.. లాకర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వీటికోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు రాజేంద్రన్ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి వీటిని నెలకొల్పుతామని రాజేంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు.