cyber police station
-
సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఎక్కడో విదేశాల్లో నక్కి, కమీషన్ల ఆశ చూపించి మధ్యవర్తులు, షెల్ కంపెనీలతో సైబర్ నేరస్తులు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సైబరాబాద్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. కొత్తగా ఐదు సైబర్ క్రైమ్ రాణాల (Cyber Crimes Police Stations) ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కమిషనరేట్ పరిధిలో జోన్‌కు ఒకటి చొప్పున ఉండేలా కసరత్తు చేస్తున్నారు. అత్యధికంగా ఇక్కడే.. రాష్ట్రంలో అత్యధికంగా నైబర్ నేరాలు నమోదయ్యే పోలీసు యూనిట్లలో సైబరాబాద్ కమిషనరేట్ (cyberabad commissionerate) తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రానికి కీలకమైన ఐటీ కారిడార్‌తో పాటు అంతర్జాతీయ సంస్థలు సైబరాబాద్ పరిధిలో ఉన్నాయి. వీటికి తోడు వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ సంస్థలూ ఇక్కడే ఉన్నాయి. ఫలితంగా కేసుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. గతేడాది కమిషనరేట్‌లో 11,914 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బాధితులు రూ.7,93,18,94,102 సొమ్మును పోగొట్టుకున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున 30– 35 కేసులు నమోదవుతున్నాయి.అరెస్టులు 5 శాతం కంటే తక్కువే.. ప్రస్తుతం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంది. రూ.50 వేల కంటే తక్కువ పోగొట్టుకుంటే స్థానిక స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. అంతకుమించి అయితే సైబర్ క్రైమ్ రాణాలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ (Cyber Crime) కేసులలో డబ్బు రికవరీ సగటున 30 శాతం మించడం లేదు. నేరగాళ్ల అరెస్టులు సగటున 5 శాతం కూడా ఉండటం లేదు. చదవండి: RRR వరకు హెచ్ఎండీఏ విస్తరణతో డీటీసీపీకి బ్రేక్గతేడాది సైబరాబాద్‌లో కేవలం 372 కేసుల్లో 534 మంది నేరస్తులను మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలిగారు. కేవలం ఒకే పోలీస్ స్టేషన్ ఉండటంతో ఈ సమస్య వస్తోంది. జోన్‌కు ఒకటి చొప్పున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటే కేసుల పరిష్కారం పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
చపాతీ కాదు.. చీటింగ్
బనశంకరి: ఆకలితో ఉన్నవారిని సైబర్ నేరగాళ్లు ఇట్టే దోచుకుంటున్నారు. ఇందులో నిరక్షరాస్యులకంటే విద్యావంతులే ఎక్కువగా నష్టపోతున్నారు. నగరంలో సాధారణ పోలీస్ స్టేషన్లలో ఏడాదికి 250 నుంచి 300 క్రైం కేసులు నమోదు అవుతుంటే, సైబర్ పోలీస్‌స్టేషన్లులో నమోదు అవుతున్న నేరాల సంఖ్య 1000 కి పైగా ఉంటోంది. ఇప్పటి వరకు ఉద్యోగం, బిల్లులు చెల్లింపు, బ్యాంకింగ్, షేర్లు, బిట్‌కాయిన్ పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఇప్పుడు ఆహార పంపిణీలోకి వంచకులు చొరబడ్డారు. లింక్ పంపి నకిలీ యాప్‌ల ద్వారా దందా ఫుడ్ ఆర్డర్లలో మోసం ఇలా జరుగుతుంది. బెంగళూరు ఎక్కువగా గిరాకీ ఉన్న హోటల్స్ పేరుతో మోసగాళ్లు నకిలీ యాప్‌లను సృష్టిస్తారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా తదితరాల్లో ఆకర్షణీయంగా ప్రచారం చేసుకుంటారు. సోషల్ మీడియా చూసేవారు ఈ ప్రకటనల ప్రలోభపడి ఆర్డర్లు బుక్ చేస్తారు. అక్కడ సూచించిన కొన్ని నంబర్లకు ఫోన్ చేయగా బుకింగ్ స్వీకరించాము. నగదు చెల్లించండి అని సూచన వస్తుంది. దానిని నమ్మి కస్టమర్లు గూగుల్‌పే, ఫోన్‌పే తదితరాలతో నగదు చెల్లిస్తారు. ఇంకా కొందరు క్రెడిట్ కార్డు, డెబిట్‌కార్డు వినియోగిస్తారు. మోసగాళ్లు మళ్లీ కాల్ చేసి మీ డబ్బు జమ కాలేదని, తమ హోటల్ యాప్ లింక్ పంపిస్తాము. దానిని ఇన్స్టాల్ చేసుకుంటే పుడ్ ఆర్డర్, చెల్లింపు సులభమవుతుందని, పైగా డిస్కౌంట్ లభిస్తుందని నమ్మిస్తారు. సరేనని వారు పంపిన లింక్ పై క్లిక్ చేస్తే అంతే సంగతులు. బాధితుల ఫోన్‌ను హ్యాక్ చేసి నగదు దోచేస్తారు. అంతేగాక మెయిల్, వాట్సాప్ చాటింగ్‌తో పాటు అనేక వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల పాలవుతుంది. తద్వారా బాధితులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటారు. రెండు పెద్ద మోసాలు ఆన్లైన్ పుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్లిన ఇంజనీర్, మరొకరు భారీగా వంచనకు గురయ్యారు. బెంగళూరుకు చెందిన దీపికా అనే ఇంజనీర్ ఫేస్బుక్లో ఆహార ప్రకటనను చూసి చపాతీ– చికెన్ కర్రీని ఆర్డర్ చేయడానికి ఫోన్ చేసింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఖాందాని రాజధాని రెస్టారెంట్ అని పరిచయం చేసుకున్నాడు. తాము పంపే లింక్‌లో ఉన్న రుచిసాగర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. దీపిక సరేనని ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని క్రెడిట్‌కార్డు సమాచారం తెలిపి ఆర్డర్ చేసింది. ఇక అంతే.. దశలవారీగా ఆమె అకౌంట్ నుంచి రూ.61 వేలు కట్ అయ్యాయి. మరొకరికి రూ.2.23 లక్షలు టోపీ మరో కేసులో ఇమ్రానుల్లాబేగ్ ఆన్లైన్లో నంబరు చూసి ఫుడ్ ఆర్డర్ చేసి రూ.250 చెల్లించాడు. కానీ అవతలి వ్యక్తి తమకు నగదు జమ కాలేదని, ఫలానా లింక్ ద్వారా యాప్ నుంచి డబ్బు పంపాలని సూచించాడు. ఆకలితో ఉన్న బాధితుడు మరో ఆలోచన లేకుండా ఆ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. వెంటనే అతని క్రెడిట్ కార్డు నుంచి రూ.2,23,858 పోయాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు కేసుల్లో మోసగాళ్లు ఒకే మొబైల్ నంబరును వినియోగించారు. (చదవండి: చెరువు వద్ద మిస్టరీ...పాపను పాఠశాల వద్ద వదిలివస్తానని చెప్పి...) -
ఎన్నికల కమిషన్ సీరియస్
-
ఏపీ : అసత్య ప్రచారంపై ఈసీ సీరియస్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణపురంలో గల సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.(చదవండి: వ్యవస్థల మధ్య ఘర్షణ సబబేనా?) -
విశాఖలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమలతోపాటు సెజ్, ఐటీ హబ్, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నగరంలో ఏర్పాటు కానుండటంతో సైబర్ నేరాలు పెరిగే అవకాశముందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న డీజీపీ జేవీ రాముడు విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. ఈమేరకు అనుమతి మంజూరు చేస్తూ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్టేషన్‌కు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎసై్సలు, ముగ్గురు అసిస్టెంట్ ఎసై్సలు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 43 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు.