లిమ్కా బుక్‌లో సంజన!
వంద గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కగలుగుతారా? అనడిగితే చేతులెత్తేసేవాళ్ల జాబితానే ఎక్కువగా ఉంటుంది. మరి.. అన్నేసి గంటలంటే మాటలా? కంటిన్యూస్‌గా గంటసేపు తొక్కితేనే నీరసపడిపోతాం. బాగా సత్తా ఉన్నవాళ్లనుకోండి... ఇంకొన్ని గంటలు తొక్కగలుగుతారు. కానీ, 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కడం అంటే సాహసమే. కన్నడ భామ సంజన ఆ సాహసం చేశారు. అయ్యో.. గులాబీ బాలకు ఎందుకీ కష్టం అని ఆమె అభిమానులు అనుకోవచ్చు. కానీ, సంజన సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగారు. ఓ సైక్లింగ్ గ్రూప్‌తో కలిసి ఆమె ఈ సవాల్‌ని స్వీకరించారు. 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించడం కోసమే సంజన ఈ సైకిల్ ప్రయాణం చేశారు... అనుకున్నది సాధించారు.