గోపాల్పూర్ వద్ద తీరాన్ని తాకిన పై-లీన్ తుపాను
భువనేశ్వర్: గోపాల్పూర్ వద్ద పై-లీన్ తుపాను ఈ సాయంత్రం 6.25 గంటలకు తీరాన్ని తాకింది. తుపాను తీరం తాకినట్లు అమెరికా వాతావరణ శాఖ ప్రకటించింది. ఆరు గంటల పాటు తుపాను తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పై-లిన్ తుపాను వల్ల ఒడిషాలో కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. తుపాను ప్రభావం వల్ల ఒడిశా, ఉత్తరాంధ్రలలో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.