d-gang
-
నవనీత్ కౌర్-రాణా దంపతులపై సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
సాక్షి, ముంబై: అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణాపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీ-గ్యాంగ్‌తో సంబంధాలున్న యూసుఫ్ లఖడీవాలా నుంచి ఆమె 80 లక్షలు రుణం తీసుకున్నారన్నారని ఆరోపించారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో యూసుఫ్ నిందితుడిగా ఉన్నాడని.. అతనితో సంబంధాలున్న అందరినీ ఈడీ విచారిస్తోందని తెలిపారు. మరి ఎంపీ నవనీత్ రాణా ఆర్థిక వ్యవహారాలపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఇది జాతీయ భద్రతకు ముప్పు కాదా అని అన్నారు. ఆ దంపతులను ఈ కేసుల నుంచి బయటపడేసేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోందని అన్నారు. యూసుఫ్ లఖడీవాలాకు చెందిన అక్రమ సొమ్ము నవనీత్ కౌర్-రాణా దంపతుల ఖాతాల్లో ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. చదవండి👉🏾 అక్కడ గెలుపే టార్గెట్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ డీ-గ్యాంగ్‌తో వారికున్న లింకులపై విచారణ చేపట్టాలని ముంబై ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులకు సంజయ్ రౌత్ విజ్ఞప్తిచేశారు. ఈమేరకు మంగళవారం రాత్రి ట్వీట్ చేసిన ఆయన ప్రధాని మోదీ, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ట్యాగ్ చేశారు. కాగా, ఇప్పటికే దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన నవనీత్ కౌర్-రాణా దంపతులపై తాజా ఆరోపణలను బట్టిచూస్తే మరో కేసు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన యూసుఫ్ లఖడీవాలా ఆర్థర్ రోడ్ జైలులో గతేడాది సెప్టెంబర్‌లో మరణించడం గమనార్హం. अंडरवर्ल्ड कनेक्शन : लकड़ावाला को ED ने ₹200 करोड़ के मनी लांड्रिंग केस में अरेस्ट किया था, लॉकअप में ही उसकी डेथ हो गई। यूसुफ की गैरकानूनी कमाई का हिस्सा अब भी नवनीत राणा के अकाउंट में है।तो ED कब पिलाएगी राणा को चाय?क्यों बचाया जा रहा है इस D-गैंग को? बीजेपी चूप क्यूँ हैं? pic.twitter.com/hJ1itnitlL — Sanjay Raut (@rautsanjay61) April 27, 2022 చదవండి👉 తమిళనాడులో మళ్లీ లాక్డౌన్?.. వైద్య ఆరోగ్య శాఖ క్లారిటీ -
నయీమ్‌కు ఆయుధాలెక్కడివి?
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు జరుపుతున్న సోదాల్లో అత్యాధునిక తుపాకులు బయటపడుతున్నాయి. నయీమ్ ఇళ్లతోపాటు అతని అనుచరుల వద్ద కూడా భారీగా ఆయుధాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు 19 వెపన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగా వాటిలో ఎక్కువ భాగం జర్మనీ, బెల్జియం, రష్యా తయారీవే కావడం గమనార్హం. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఏకే 47తోపాటు 9 ఎమ్ఎమ్ పిస్టళ్లు, తపంచాలు, భారీగా తూటాలు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, గొడ్డళ్లు, కత్తులు ఉన్నాయి. వాటిలో కొన్ని వెపన్స్‌ను నయీమ్ గ్యాంగ్ ఉపయోగించినట్లు గుర్తించారు. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి నయూమ్‌కు సమకూరాయనేది పోలీసులకు అంతబట్టడం లేదు. దాదాపు 4 రోజులు విస్తృతంగా గాలిస్తున్నా ఆయుధాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. పట్టుబడిన నయీమ్ అనుచరులను ప్రశ్నిస్తున్నా ‘అంతా భాయ్’ చూసుకునే వాడంటూ సమాధానం ఇస్తున్నారు. ఆయుధాలు సమకూర్చిందెవరు..? నయీమ్‌కు వివిధ రంగాలలో ఉన్న వారితో విస్తృత పరిచయాలున్నాయి. మాజీ మావోయిస్టు నేత కావడంతో నక్సల్స్‌తో కూడా పరిచయాలున్నాయి. దీంతో నక్సల్స్ నుంచి ఆయుధాలు సరఫరా అయ్యాయా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే నయీమ్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు గతంలోనే పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అంతేకాదు హిజ్బుల్ నేత ముజీబ్‌తో కలసి నయీమ్ అక్రమంగా ఆయుధాల వ్యాపారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి పాకిస్తాన్ వెళ్లి దావుద్ ఇబ్రహీంను కలసి చర్చించినట్లు సమాచారం. మరోసారి దుబాయ్ వెళ్లి అక్కడ డీ-గ్యాంగ్ సభ్యులతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిసింది.