గుండెపోటుతో జీవిత ఖైదీ మృతి
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. జైల్ సూపరింటెండెంట్ రమేష్ తెలిపిన వివరాలు మేరకు... ప్రకాశం జిల్లా, మార్కాపురంకు చెందిన డి. కృష్ణ (48)కు 2009లో ఓ హత్య కేసులో భాగంగా జీవిత ఖైదు శిక్ష పడింది. ఇందులో భాగంగానే ఓపెన్ ఎయిర్ జైల్‌కు వచ్చాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో జైల్ సిబ్బంది చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. మృతిచెందినట్లు డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ తెలిపారు.