Dabangg Mumbai
-
ముంబై, రాంచీ మ్యాచ్ డ్రా
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) ఐదో సీజన్ ‘డ్రా’తో మొదలైంది. దబాంగ్ ముంబై, రాంచీ రేస్ జట్ల మధ్య శనివారం జరిగిన తొలి మ్యాచ్ 3–3తో ‘డ్రా’గా ముగిసింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌తో ఢిల్లీ వేవ్‌రైడర్స్ తలపడుతుంది. -
దబాంగ్ ముంబై సంచలన విజయం
హాకీ ఇండియా లీగ్ న్యూఢిల్లీ: చివరి పది నిమిషాల వరకు ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఆధిక్యం 3-0. ఈ దశలో దబాంగ్ ముంబై అద్భుతమే చేసింది. ఏకంగా నాలుగు ఫీల్డ్ గోల్స్‌తో చెలరేగి చివరకు 8-3తో ఘనవిజయాన్ని అందుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. పటిష్టమైన వీరి డిఫెన్స్‌ను ప్రత్యర్థి ఛేదించలేకపోయింది. 22వ నిమిషంలో స్టీవెన్ ఎడ్వర్డ్స్ ఫీల్డ్ గోల్‌తో ఢిల్లీకి 2-0 ఆధిక్యం దొరికింది. 39వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలిచి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఇక ఢిల్లీ గెలుపు ఖాయమే అనుకున్న దశలో ముంబై తరఫున 49వ నిమిషంలో డానిష్ ముజ్తబా ఫీల్డ్ గోల్‌తో పరిస్థితి మారింది. మరో మూడు నిమిషాలకే నీలకంఠ శర్మ ఫీల్డ్ గోల్‌తో స్కోరు 4-3తో ముంబైకి అనుకూలంగా మారింది. దీనికి తోడు 57, 58వ నిమిషాల్లో మన్‌ప్రీత్ వరుసగా రెండు ఫీల్డ్ గోల్స్ చేయడంతో ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది. -
దబాంగ్ ముంబైకి మరో విజయం
లక్నో: వరుస పరాజయాల అనంతరం దబాంగ్ ముంబై విజయాల బాట పట్టింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) నాలుగో సీజన్లో భాగంగా శనివారం ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 2-1 తేడాతో నెగ్గింది. ఆరంభం నుంచి దూకుడును కనబరచడంతో 8వ నిమిషంలోనే ముంబైకి జోర్క్మన్ ఫీల్డ్ గోల్‌ను అందించాడు. దీంతో తమ దాడులను ఉధృతం చేసిన విజార్డ్స్‌కు 14వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను పిలియట్ గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు ఎంతగా ప్రయత్నించినా గోల్స్ నమోదు కాలేదు. దీంతో ముంబై విజయం ఖాయమైంది.