దబాంగ్ ముంబై సంచలన విజయం | Hockey India League: Dabang Mumbai pull off stunning win against Delhi Waveriders | Sakshi
Sakshi News home page

దబాంగ్ ముంబై సంచలన విజయం

Feb 10 2016 12:39 AM | Updated on Oct 17 2018 3:46 PM

చివరి పది నిమిషాల వరకు ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఆధిక్యం 3-0. ఈ దశలో దబాంగ్ ముంబై అద్భుతమే చేసింది.

హాకీ ఇండియా లీగ్
న్యూఢిల్లీ: చివరి పది నిమిషాల వరకు ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఆధిక్యం 3-0. ఈ దశలో దబాంగ్ ముంబై అద్భుతమే చేసింది. ఏకంగా నాలుగు ఫీల్డ్ గోల్స్‌తో చెలరేగి చివరకు 8-3తో ఘనవిజయాన్ని అందుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించింది. పటిష్టమైన వీరి డిఫెన్స్‌ను ప్రత్యర్థి ఛేదించలేకపోయింది. 22వ నిమిషంలో స్టీవెన్ ఎడ్వర్డ్స్ ఫీల్డ్ గోల్‌తో ఢిల్లీకి 2-0 ఆధిక్యం దొరికింది. 39వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ పాల్ సింగ్ గోల్‌గా మలిచి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచాడు.

ఇక ఢిల్లీ గెలుపు ఖాయమే అనుకున్న దశలో ముంబై తరఫున 49వ నిమిషంలో డానిష్ ముజ్తబా ఫీల్డ్ గోల్‌తో పరిస్థితి మారింది. మరో మూడు నిమిషాలకే నీలకంఠ శర్మ ఫీల్డ్ గోల్‌తో స్కోరు 4-3తో ముంబైకి అనుకూలంగా మారింది. దీనికి తోడు 57, 58వ నిమిషాల్లో మన్‌ప్రీత్ వరుసగా రెండు ఫీల్డ్ గోల్స్ చేయడంతో ముంబై అద్భుత విజయాన్ని అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement