కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్‌రైడర్స్ సత్తా చూపింది.
న్యూఢిల్లీ: కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఢిల్లీ వేవ్‌రైడర్స్ సత్తా చూపింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా శనివారం రాంచీ రేస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 2-0తో నెగ్గింది. 26వ నిమిషంలో లాయిడ్ నోరిస్ జోన్స్, 53వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ గోల్స్ చేశారు.
అయితే డ్రాగ్ ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన అవకాశాలను కల్పించడంతో పాటు ప్రత్యర్థి గోల్స్ అవకాశాలను వమ్ము చేశాడు. ఈ విజయంతో జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.