రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్-2)లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రైనోస్‌కు ఉత్తరప్రదేశ్ విజార్డ్స్ షాకిచ్చింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో విజార్డ్స్ 3-2 గోల్స్ తేడాతో రైనోస్‌పై నెగ్గింది. ఆరంభంలో రాంచీ ఆధిక్యం కనబరిచినప్పటికీ మ్యాచ్‌లో మాత్రం పట్టుబిగించలేకపోయింది. ఆట ఆరంభమైన నాలుగో నిమిషానికే స్టార్ స్ట్రయికర్ మన్‌దీప్ సింగ్ గోల్ చేసి రైనోస్‌కు శుభారంభాన్నిచ్చాడు.
అయితే సరిగ్గా ఐదు నిమిషాల వ్యవధిలో విజార్డ్స్ ఆటగాడు తిమ్మయ్య (10వ ని.) గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగం ముగిసింది. ద్వితీయార్ధంలోనూ తొలి గోల్ రాంచీ జట్టే నమోదు చేసినప్పటికీ... మళ్లీ నిమిషాల వ్యవధిలోనే ఆధిక్యాన్ని కోల్పోయింది. రాంచీ తరఫున 46వ నిమిషంలో జస్టిన్ రీడ్ రాస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచగా, యూపీ తరఫున 51వ నిమిషంలో రఘునాథ్ గోల్ చేశారు. తర్వాత 63వ నిమిషంలో ప్రదీప్ కీలకమైన గోల్ చేసి విజార్డ్స్‌ను విజయంపథంలో నిలిపాడు. మొహాలీలో జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్ వారియర్స్ 5-3 గోల్స్ తేడాతో ముంబై మెజీషియన్స్‌పై గెలిచింది.
రాంచీ రైనోస్‌కు షాక్
Published Mon, Jan 27 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement
Advertisement