భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ నాలుగో సీజన్‌లో భాగంగా సోమవారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాంచీ రేస్ 3-2తో కళింగ లాన్సర్‌ను ఓడించింది. ఆరంభంలో జోరు కనబరిచిన కళింగ తొమ్మిదో నిమిషంలోనే ధరమ్‌వీర్ ఫీల్డ్ గోల్ చేయడంతో 2-0 ఆధిక్యం పొందింది.
అయితే 10వ నిమిషంలోనే రాంచీ కెప్టెన్ ఆష్లే జాక్సన్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత మూడు క్వార్టర్ల వరకు తమ ఆధిక్యాన్ని కాపాడుకున్న కళింగకు 49వ నిమిషంలో రాంచీ రేస్ షాకిచ్చింది. ఆమిర్ ఖాన్ ఫీల్డ్ గోల్‌తో స్కోరు 3-2గా మారింది. అయితే 53వ నిమిషంలో స్కోరును సమం చేసే అవకాశం వచ్చినప్పటికీ కళింగ విఫలం చేసుకోవడంతో రాంచీ విజయం ఖరారైంది.
రాంచీ రేస్ విజయం
Published Tue, Feb 9 2016 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM
Advertisement
Advertisement