దబాంగ్ ముంబైకి మరో విజయం | Image for the news result Hockey India League: Dabang Mumbai Stun Uttar Pradesh Wizards | Sakshi
Sakshi News home page

దబాంగ్ ముంబైకి మరో విజయం

Published Sun, Feb 7 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

Image for the news result Hockey India League: Dabang Mumbai Stun Uttar Pradesh Wizards

లక్నో: వరుస పరాజయాల అనంతరం దబాంగ్ ముంబై విజయాల బాట పట్టింది. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) నాలుగో సీజన్‌లో భాగంగా శనివారం ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 2-1 తేడాతో నెగ్గింది. ఆరంభం నుంచి దూకుడును కనబరచడంతో 8వ నిమిషంలోనే ముంబైకి జోర్క్‌మన్ ఫీల్డ్ గోల్‌ను అందించాడు. దీంతో తమ దాడులను ఉధృతం చేసిన విజార్డ్స్‌కు 14వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను  పిలియట్ గోల్‌గా మలిచాడు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు ఎంతగా ప్రయత్నించినా గోల్స్ నమోదు కాలేదు. దీంతో ముంబై విజయం ఖాయమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement