Dadasaheb Phalke
-
చౌద్వీ కా చాంద్ హో
‘చౌద్వీ కా చాంద్ హో యా ఆఫ్తాబ్ హో’... ఈ చందమామ తెలుగు నేల మీదే ఉదయించింది. ‘ఏరువాక సాగారోరన్నో చిన్నన్న’... తప్పెట దరువుకు ఆ పాదాలు ఈ నేల మీదే చిందేశాయి. ‘మారాయ్.. మారాయ్... మారాయ్..రోజులు మారాయ్’... తెలుగువారి పుణ్యాన ఒక మహత్తు జరిగి వహిదా రెహమాన్ రోజులే మారిపొయాయి.భారతీయ వెండితెర సౌందర్యమేమారిపొయింది. తనకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించారని తెలిశాక ఆ మురిపమైన నటి అనుకునే మాట ఒకటే– ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై ఆజ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై.. విశాఖపట్నంలో ఈపాటికి సంబరాలు జరగాలి.తమ ఊరి నటికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినందుకు.ఆ సంగతి వారికి తెలుసో లేదో. తెలుగు వారికి వహిదా రెహమాన్ తమ నటి అని తెలుసో లేదో.వహిదా రెహమాన్‌కు పదీ పదకొండేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి రెహమాన్‌కు మునిసిపల్ కమిషనర్‌గా విశాఖ ట్రాన్స్ఫర్ అయ్యింది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉద్యోగి అయిన రెహమాన్ తమిళనాడు, ఆంధ్రాల్లో పని చేసిన దక్కన్ ముస్లిం. ఆమె తల్లిది ఉత్తరాంధ్ర కావచ్చు. ఆమె మేనమామ డాక్టర్ ఫిరోజ్ అలీ గంజాంలో పేరు మోసిన డాక్టరు, సామాజిక కార్యకర్త. సినిమా నటిగా అవకాశం పొందే వరకు అంటే తన 17వ ఏట వరకూ వహిదా రెహమాన్ తొలిప్రాయపు రోజులు విశాఖలోనే గడిచాయి. అక్కడి సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదువుకుంది. అది కాదు– ఆమె జీవితాన్ని మార్చిన ఘటన అక్కడే జరిగింది. అదీ– నాటి మద్రాసు ముఖ్యమంత్రి సి.రాజ గోపాలాచారి విశాఖ రావడం. ఆ సందర్భంగా వహిదా రెహమాన్ నాట్య ప్రదర్శన ఇవ్వడం. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏవో ఒక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. నాటి వాల్తేరు కలెక్టర్ తన సహోద్యోగైన రెహమాన్‌ను ‘నీ కుమార్తెలు భరతనాట్యం చేస్తారు కదా. వారి ప్రదర్శన ఏర్పాటు చేద్దాం’ అని కోరాడు. అందుకు రెహమాన్ అంగీకరించాడు. అప్పటికే వహిదా, ఆమె సోదరి సయిదా భరతనాట్యం నేర్చుకున్నారు. మొత్తం నలుగురు కూతుళ్లలో అందరి కంటే చిన్నది వహిదా. భరతనాట్యం నేర్చుకోవాలని పట్టుపట్టి నేర్చుకుంది. అయితే గురువు ఆమెకు అంత సులువుగా నేర్పలేదు. ‘ముసల్మానులు ఈ విద్య నేర్చుకోగలరా? ΄రాణిక సందర్భాలను అభినయించగలరా?’ అని సందేహం వ్యక్తం చేశాడు. అయినా వహిదా పట్టు విడువలేదు. మరోవైపు ముస్లింలు భరతనాట్యం నేర్చుకోవడం ఏమిటని అయినవారి ఎత్తి పొడుపులు. ‘కళకు మతం లేదు’ అని తేల్చిన రెహమాన్ కుమార్తెలను భరత నాట్యానికి ప్రోత్సహించాడు. కాని గురువు వినడే. చివరకు వహిదా మొండిపట్టు చూసి ‘నీ జాతకం పట్టుకురా’ అన్నాడు. ముస్లింలలో జాతకాలు ఉండవని తెలిశాక, పుట్టిన రోజు... సమయం తెలుసుకుని ఆ గురువే జాతకం రాసి ఆశ్చర్యపొయాడు. ‘ఈ అమ్మాయి నా చివరి గొప్ప శిష్యురాలు అవుతుంది’ అని ఆ జాతకంతో తేల్చి పాఠాలు నేర్పించాడు. అనుకున్నట్టుగానే జరిగింది. సి.రాజగోపాలాచారి సమక్షంలో వేదిక మీద వహిదా, సయిదాలు అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసేసరికి శాస్త్రాలు ఎరిగిన అంతటి రాజగోపాలాచారి కూడా తబ్బిబ్బయ్యి మెచ్చుకున్నాడు. ఆ వార్త మరుసటి రోజు అన్ని ముఖ్యమైన పేపర్లలో మొదటి పేజీల్లో వచ్చింది. వహిదా రెహమాన్ అనే పేరు కళా జగత్తుకు తెలిసింది. సినిమా జగత్తుకు కూడా. వహిదా రెహమాన్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి జబ్బు చేసి మరణించాడు. అతని సమాధి విశాఖలోనే ఉంది. ఇటీవలే వహిదా ఆ సమాధిని దర్శించింది కూడా. తండ్రి జీవించి ఉండగా సినిమా అవకాశాలు వస్తే ‘చిన్నపిల్ల... సినిమాలేమిటి’ అని సున్నితంగా తిరస్కరించాడు కాని వహిదాకు 16 ఏళ్లు వచ్చేసరికి, అప్పటికే ఆమె నాట్యకళకారిణిగా కొనసాగుతూ ఉండటంతో సినిమా అవకాశాలు వస్తూనే ఉండేవి. భర్త అండలేని తల్లి భయంతో వాటిని తిరగ్గొట్టేది. అయితే వహిదాను సినిమా తెరకు పరిచయం చేసే అవకాశం తెలుగువారి ఖాతాలో ఉంటే ఆ విధిని ఎవరు కాదనగలరు? బాంబేలో ఎల్వీ ప్రసాద్‌తో పాటు సినిమా కళను ఆకళింపు చేసుకున్న నిర్మాత సి.వి.ఆర్. ప్రసాద్ మద్రాసు వచ్చి ‘రోజులు మారాయి’ సినిమా తీయదల్చుకున్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు. అయితే సినిమా అంతా పూర్తయ్యే సమయానికి ఇందులో ఒక సంబరాల పాట ఉండాలి... పల్లెతనపు చిందు ఉండాలి అనిపించిందతనికి. దానికి మంచి డాన్సర్ కావాలంటే వహిదా రెహమాన్ పేరు తెలిసింది. అదృష్టవశాత్తు అంతకు ముందే రెహమాన్‌తో ప్రసాద్‌కు పూర్వ పరిచయం ఉంది. ‘మీవారు నాకు తెలుసు. నేను ఆయన శ్రేయోభిలాషిని. మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్టేజ్ మీద చేసే డాన్సు కెమెరా ముందు చేయడమే’ అని వహిదా తల్లిని ఒప్పించాడు. ‘రోజులు మారాయి’లో ‘ఐటమ్ సాంగ్’. కొసరాజు రాశాడు. మాస్టర్ వేణు బాణి కట్టాడు. జిక్కి పాడింది. విశాఖ నుంచి మద్రాసు వెళ్లిన వహిదా రెహమాన్ అద్భుతంగా డాన్స్ చేసింది. దేహంతో పాటు హావభావాలను కూడా కదిలించింది. మెరుపు వలే మెరిసింది. ‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న’... సూపర్‌డూపర్ హిట్. ప్రేక్షకులు చిల్లర ఎగరేసిన పాట అది. సినిమా అయిపొయాక ఆపరేటర్ చొక్కా పట్టుకుని మళ్లీ ఆ పాట వేయించుకువారు. గువ్వలాంటి ఆ అమ్మాయి ఎవరు? వహిదా రెహమాన్! ఇంటింటి పేరయ్యింది. నటి సావిత్రి అదృష్టం బాగుంది. వహిదా రెహమాన్ తెలుగు నుంచి పొటీలో తప్పుకుని హిందీలో వెళ్లింది. లేకుంటే ఒకవైపు సావిత్రి, మరోవైపు వహిదా రెహమాన్ తెలుగు సినిమాలను ఒక ఊపు ఊపుతుంటే ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని మనం తన్నుకు చచ్చుండేవాళ్లం. 1955 జనవరిలో ‘మిస్సమ్మ’ విడుదలైంది. అదే సంవత్సరం ఏప్రిల్‌లో ‘రోజులు మారాయి’. ‘మిస్సమ్మ’ సూపర్ హిట్. ‘రోజులు మారాయి’ కూడా. ‘మిస్సమ్మ’ హైదరాబాద్‌లో నెలల తరబడి ఆడుతూనే ఉంటే ఒక డిస్ట్రిబ్యూటరు దాని హిందీ రీమేక్ కోసం దర్శకుడు గురుదత్‌ని బొంబాయి నుంచి హైదరాబాద్‌కు పిలిపించాడు– సినిమా చూడటానికి. మిస్సమ్మ గురుదత్‌కు నచ్చలేదు. కాని వహిదా రెహమాన్‌ను అదే సమయంలో రోజులు మారాయి ప్రమోషన్ కోసం మద్రాసు నుంచి పిలిపిస్తే ఆమె కారు చుట్టూ మూగిన జనాన్ని చూసి ఆశ్చర్యపొయాడు. ‘ఎవరు ఈ అమ్మాయి’ అని అడిగితే ‘వహిదా రెహమాన్’ అని చె΄్పారు. గురుదత్ ఆమెను అదే డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో కలిశాడు. ‘ఉర్దూ తెలుసా’ అని మాత్రమే అడిగాడు. ‘తెలుసు’ అంది వహిదా. మూడు నెలల తర్వాత బొంబాయి నుంచి పిలుపొచ్చింది. వెళితే రెండేళ్ల పాటు కాంట్రాక్ట్ గురుదత్ బేనర్లో. నెలకు జీతం– 2,500 రూపాయలు. మొదటి సినిమా ‘సి.ఐ.డి’. ‘హీరో ఎవరండీ’ అడిగింది వహిదా రెహమాన్. గురుదత్ జవాబు– దేవ్ ఆనంద్. ‘కహి పే నిగాహె కహిపే నిషానా’... ‘సి.ఐ.డి’ సినిమాలో కొంచెం వేంప్ తరహా వేషం. చిన్న వేషం. కాని ఒక్కపాటతో మొత్తం పేరు కొట్టుకెళ్లింది వహిదా. సి.ఐ.డిలో అసలు హీరోయిన్ షకీలా. ఆమె తుడుచుకునిపొయి వహిదా నిలబడింది. కొద్దిగా మెల్ల కన్ను, లాగేసే చూపు, ఈడ్చేసే నవ్వు... ఈ అమ్మాయిని తీర్చిదిద్దవచ్చు అనుకున్నాడు గురుదత్. వెంటనే ‘ప్యాసా’లో లీడ్ రోల్ ఇచ్చాడు. గురుదత్ ఆమెలోని నటిని చాలా సమర్థంగా తీర్చిదిద్దాడు. తనలాగే అధిక ప్రసంగం చేయకుండా గాఢమైన భావాలను ఎలా పలికించవచ్చో నేర్పించాడు. ప్యాసా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత గురుతద్, వహిదా కలిసి ‘కాగజ్ కే ఫూల్’, ‘చౌద్వీ కా చాంద్‘, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ సినిమాలలో నటించారు. గురుదత్ ఆగిపొయాడు. వహిదా సాగిపొయింది. సునిల్దత్తో చేసిన ‘ముఝే జీనే దో’, బిశ్వజిత్‌తో ‘బీస్ సాల్ బాద్’ పెద్ద హిట్స్. దిలీప్ కుమార్‌తో ‘దిల్ దియా దర్ద్ లియా’, ‘ఆద్మీ’, ‘రామ్ ఔర్ శ్యామ్’ చేసింది వహిదా. కాని దేవ్ ఆనంద్ మరోసారి ఆమెకు సవాలు విసిరే పాత్రను ఇచ్చాడు ‘గైడ్’లో. ఆర్.కె.నారాయణ్ రాసిన ఈ ప్రఖ్యాత నవలను హాలీవుడ్ వెర్షన్‌గా, బాలీవుడ్ వెర్షన్‌గా తీయాలనుకున్నప్పుడు హిందీ వెర్షన్‌కు చేతన్ ఆనంద్ దర్శకుడు. కాని చేతన్‌కు వహిదా ఇష్టం లేదు. దేవ్ ఆనంద్‌కు వహిదాను తీయడం ఇష్టం లేదు. చేతన్‌ను తీసి విజయ్ ఆనంద్‌ను దర్శకుడిగా పెట్టాడు. విజయ్ ఆనంద్ ‘గైడ్’లో క్లాసిక్‌గా తీర్చిదిద్దాడు. నిజానికి ఆనాటి హీరోయిన్లు ఎంపిక చేసుకునే విలువలున్న పాత్ర లాంటిది కాదు ‘రోజీ’. భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపొయే పాత్ర అది. శ్రేయోభిలాషులు చేయొద్దన్నారు. వహిదా రెహమాన్ చేసింది. ఆమెలోని నాట్యాన్ని, నటనను, అభినయ గాఢతను అంత గొప్పగా పట్టి ఇచ్చిన సినిమా మరొకటి లేదు. ‘పత్థర్ కె సనమ్’, ‘నీల్ కమల్’ వంటి హిట్స్ చూసిన వహిదా ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. రాజ్ కపూర్‌తో ‘తీస్రి కసమ్’, సునిల్దత్తో ‘రేష్మా ఔర్ షేరా’, రాజేష్ ఖన్నాతో ‘ఖామోషీ’, అమితాబ్ బచ్చన్‌తో ‘కభి కభి’... ఆమెను మెల్లగా హీరోయిన్ దశ నుంచి తప్పించాయి. వీటి నడుమ అక్కినేనితో ‘బంగారు కలలు’లో తెలుగువారిని పలుకరించింది. వహిదా రెహమాన్ హిందీ సినిమా రంగంలో సాధించిన స్థానం, ఏర్పరుచుకున్న గౌరవం, పొందిన సత్కారాలు, గెలుచుకున్న అభిమానులు తక్కువ కాదు. హుందాగా ఉంటూ, అదే సౌందర్యంతో ఆమె ఆ తర్వాతి రోజుల్లో కూడా అడపా దడపా నటిస్తూనే వచ్చింది. ఆమె నవ్వుకు ఫిదా అయ్యే ప్రేక్షకులను కనికరిస్తూనే ఉంది.గొప్ప ప్రయాణం ఆమెది. ఎన్నో జ్ఞాపకాలు. కొన్ని గాయాలు. నాటి రోజులు మళ్లీ రావు. ఈ ఉత్సవ సమయంలో ముసురుకునేది సువర్ణ తలపొతలే. వక్త్ నే కియా క్యా హసీ సితమ్ తుమ్ రహేన తుమ్ హమ్ రహేన హమ్ జీవితాలను కాల్చిన ప్రేమ వహిదా రెహమాన్, గురుదత్‌ల మధ్య బంధం, అనుబంధం, సంబంధం గురుదత్ జీవితంలో సంక్షోభం తెచ్చింది. వహిదాను హిందీ పరిశ్రమకు పరిచయం చేసిన గురుదత్ ఆమె పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేవాడు. వహిదా కూడా గురుదత్ రెక్కల చాటునే ఉండటానికి ఇష్టపడేది. అయితే ఇదంతా గురుదత్ భార్య, ప్రఖ్యాత గాయని గీతా దత్‌ను చాలా గట్టి దెబ్బ తీసింది. గురుదత్, గీతాదత్‌ల మధ్య వహిదా ప్రమేయం వల్ల చాలా ఎడం వచ్చింది. గురుదత్, గీతాదత్లు ఇద్దరూ తాగుడుకు బానిసయ్యారు. అప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్న గురుదత్ ఆత్మహత్య చేసుకు మరణించాడన్నది ఒక కథనం. నిద్రమాత్రలు ఎక్కువై మరణించాడని మరో కథనం. ఏమైనా అతని జీవితం అర్థంతరంగా ముగిసింది. ఆ తర్వాత గీతాదత్ కూడా నానా బాధలు పడుతూ తాగుడుకు బానిసై మరణించింది. వహిదా ఒకనాటి నటుడు కమల్జిత్ను వివాహం చేసుకుంది. ఆమెకు ఒక కొడుకు, కూతురు. బెంగళూరులో చాలా కాలం ఉన్నాక భర్త మరణం తర్వాత ముంబై వచ్చి నివసిస్తోంది. వహిదా రెహమాన్ హిట్స్ 1. భవరా బడా నాదాన్ హై – సాహిబ్ బీబీ ఔర్ గులామ్ 2. జానే క్యా తూనే కహి – ప్యాసా 3. కహీ దీప్ జలే కహి దిల్ – బీస్ సాల్ బాద్ 4. సాంర్nు ఢలీ దిల్ కి లగీ – కాలా బజార్ 5. ఏ నయన్ డరే డరే – కొహ్రా 6. గాతా రహే మేరా దిల్ – గైడ్ 7. మెహబూబ్ మేరె మెహబూబ్ మేరె – పత్థర్ కె సనమ్ 8. తుమ్ పుకార్ లో తుమ్హారా ఇంతెజార్ హై – ఖామోషీ 9. రంగీలారే తేరె రంగ్ మే – ప్రేమ్ పూజారి 10. జాదుగర్ తెరె నైనా – మన్ మందిర్ పేరు మార్చుకోని నటి ఆ రోజుల్లో హిందీ సినిమాల్లో నటీనటులు కొత్త తరహా పేర్లు పెట్టుకునేవారు. యూసఫ్‌ఖాన్ దిలీప్ కుమార్ అయ్యాడు. మెహజబీన్ మీనా కుమారి అయ్యింది. అలాగే వహిదా రెహమాన్‌ని కూడా పేరు మార్చుకోమని గురుదత్ సూచించాడు. గురుదత్ అసిస్టెంట్లు కూడా పేరు మార్పుకోసం పట్టుబట్టారు. వహిదా రెహమాన్ పేరులో గ్లామర్ లేదని, మధుబాల లాగా ఏదో ఒక బాల వచ్చేలాగా పెట్టుకోమని కోరారు. అయితే ‘మా అమ్మా నాన్నలు పెట్టిన పేరు నేను మార్చుకోను. దానితోనే కొనసాగుతాను. మీకిష్టమైతే తీసుకోండి, లేకుంటే మానుకోండి’ అని వహిదా రెహమాన్ హఠం చేసింది. చివరకు అందరూ దిగిరాక తప్పలేదు. వహిదా రెహమాన్ తన పేరుతోనే ఖ్యాతి గడించింది. వహిదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగంలో విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 2021 సంవత్సరానికి సుప్రసిద్ధ నటి వహిదా రెహమాన్ (85)ను వరించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకుర్ మంగళవారం ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ వార్త విన్న వెంటనే వహిదా రెహమాన్ ‘దేవ్ ఆనంద్ శతజయంతి నాడు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఈ అవార్డు ఆయనకు అందాలి. నాకు అందింది’ అని సంతోషం వ్యక్తం చేశారు. అవార్డుకు ఎంపిక చేసిన కమిటిలో ఆశాపరేఖ్, చిరంజీవి, పరేష్ రావెల్, ప్రసేజ్జిత్ చటర్జీ, శేఖర్ కపూర్ ఉన్నారు. వహిదా రెహమాన్‌ను ఇది వరకే పద్మశ్రీ, పద్మభూషణ్ వరించాయి. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కేతో తనకు రెట్టింపు సంబరం కలుగుతున్నదని ఆమె అన్నారు. కాగా వహిదాకు ఫాల్కే పురస్కారం లభించడం పట్ల ప్రధాని మోడి హర్షం వెలిబుచ్చారు. సినిమా రంగంపై ఆమె ముద్ర చెరగనిది అని కొనియాడారు. హైదరాబాద్, విశాఖ, చెన్నైలతో అనుబంధం కలిగిన వహిదా రెహమాన్ తెలుగు సినిమా ‘రోజులు మారాయి’తో సినిమా రంగంలో ప్రవేశించారు. ఆ తర్వాత హిందీ సినిమాల్లో ఆగ్రతారగా వెలుగొందారు. భారతీయ సినిమాల్లో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా ఆమెను పరిగణిస్తారు. వహిదా రెహమాన్ అక్కినేని సరసన ‘బంగారు కలలు’ సినిమాలో నటించారు. ‘పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి’ హిట్ సాంగ్ ఆమెపై చిత్రీకరించినదే. -
సినిమా దాదా: ధుండిరాజ్ గోవింద ఫాల్కే / 1870–1944
ధుండిరాజ్ గోవింద ఫాల్కే ఒక మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బొంబాయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్, బరోడా కళాభవన్‌లలో చదువుకున్నారు. ఆయన డ్రాయింగ్, ఫొటోగ్రఫీ, లిథోగ్రఫీ, డ్రామా కళను అభ్యసించి, తరువాత లోనావాలా లోని రాజా రవి వర్మ ప్రెస్‌లో చేరారు. మేజిక్ కూడా నేర్చుకున్నారు. సహజంగానే పారిశ్రామికవేత్త లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఫాల్కే బొంబాయిలో సొంతంగా ఒక ప్రెస్‌ను ప్రారంభించారు. అందులో ఆయన క్రోమోలితోగ్రాఫ్ లను తయారు చేస్తూ బొమ్మల పుస్తకాలను అచ్చువేసేవారు. తరువాత అదే ఆయన తీయబోయే పౌరాణిక చిత్రాలకు అలంబన అయింది. 1910లో ఆయన ‘ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అనే చిత్రాన్ని చూశారు. అది తనపై చూపిన ప్రభావం గురించి 1917లో ఆయన ఇలా రాశారు. ‘‘నేను ఇంతకు ముందు అనేక చిత్రాలు చూశాను. కానీ నేను క్రిస్మస్ రోజున చూసిన ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ చిత్రం మాత్రం నా జీవితంలో విప్లవాత్మకమైన మలుపు తిప్పింది. నేను ఆ సినిమా చూస్తున్నంత సేపూ నా కళ్ల ముందు క్రైస్ట్ స్థానంలో రాముడు, కృష్ణుడు మెదిలారు. ఇలా వెండి తెరపై మన హిందూ దేవుళ్లను దర్శించగలుగుతామా అనిపించింది’’.. అని. సినిమాటోగ్రఫీ చదివిన తరువాత ఫాల్కే సినిమా నిర్మాణానికి సంబంధించిన పరికరాలను కొనడానికి, చిత్ర నిర్మాణం గురించి నేర్చుకునేందుకు ఇంగ్లండ్ వెళ్లారు. బొంబాయికి తిరిగి వచ్చిన వెంటనే ఫాల్కే ఫిలిమ్ కంపెనీ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి 1913 నాటికి మొట్ట మొదటి భారతీయ కథా చిత్రంగా ‘రాజా హరిశ్చంద్ర’ను నిర్మించారు. 1917లో ఆయన తీసిన లంకా దహన్ అఖండ విజయం సాధించడంతో పలువురు భారతీయ పురాణ గాథలతో చిత్రాలను నిర్మించారు. అయితే, 1919లో ఫాల్కే రూపొందించిన ‘కాళీ మర్దనం’ స్పెషల్ ఎఫెక్టులతో ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంది. కాళీయుడిని బ్రిటిష్ పాలకులుగా భావిస్తూ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూశారు. 20 వ శతాబ్దానికల్లా సినిమా అనే దృశ్య కళారనూపం భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు. భారతీయ సినిమా రంగంలో సుదీర్ఘ సేవలు అందించిన ప్రముఖులను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ద్వారా ప్రభుత్వం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేసింది. ఈ అవార్డును భారత రత్నతో సమానమైనదిగా పరిగణిస్తారు. – సురేశ్ చబ్రియా, సినిమా చరిత్రకారుల (చదవండి: కలం యోధుడు: మున్షీ ప్రేమ్‌చంద్ / 1880–1936) -
సామ్రాజ్య భారతి: 1870/1947 ఘట్టాలు
►యు.కె. నుంచి ఇండియా వచ్చిన తొలి జలాంతర్గామి టెలిగ్రాఫ్ కేబుల్.. బాంబే తీరం (ఇన్సెట్) : కేబుల్ కేస్ ►యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ (యు.ఎస్.ఐ.) సంస్థాపన. ►కేశవ్ చంద్రసేన్ అధ్యక్షుడిగా ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ ఏర్పాటు చట్టాలు ►కోర్ట్–ఫీజ్ యాక్ట్, కాయినేజ్ యాక్ట్, ఎక్స్ట్రాడిషన్ యాక్ట్, ఫారిన్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ జననాలు దాదాసాహెబ్ ఫాల్కే: సినీ దిగ్గజం. భారతీయ సినిమా పితామహుడు. త్రయంబకంలో జన్మించారు. చిత్తరంజన్ దాస్: స్వాతంత్య్రఉద్యమ నేత. ప్రసిద్ధ న్యాయవాది. ‘దేశబంధు’గా ప్రఖ్యాతి. కలకత్తాలో జన్మించారు. మౌల్వీ అబ్దుల్ హక్ : ఉర్దూ పండితులు. భాషావేత్త. ఉర్దూ భాషను పాకిస్థాన్ జాతీయ భాషగా మార్చాలని డిమాండ్ చేసిన వారిలో ముఖ్యులు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో జన్మించారు. ఉపాసనీ మహరాజ్ : అసలు పేరు కాశీనాథ్ గోవిందరావ్ ఉపాసని. సద్గురు ఉపాసకులు. షిర్డీకి సమీపాన జన్మించారు. జాదూనాథ్ సర్కార్ : ప్రసిద్ధ చరిత్రకారులు. బంగ్లాదేశ్‌లో జన్మించారు. మొఘల్ సామ్రాజ్య రచనల్లో నిపుణులు. హరిసింగ్ గోర్ : న్యాయవాది, విద్యావేత్త, సంఘ సంస్కర్త. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, నాగపూర్ యూనివర్సిటీలకు తొలి వైస్–చాన్స్‌లర్.. -
ప్రియాంకా చోప్రాకు ప్రతిష్ఠాత్మక అవార్డ్
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ అవార్డు లభించింది. 2011లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన 'ఖూన్ మాఫ్' సినిమాలో్ అద్భుత నటనకు గాను ఈ అవార్డు వరించింది. ఈనెల 24న ముంబైలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రియాంకకు అందజేయనున్నారు. ఆమెకు ఈ అవార్డు లభించడమిది రెండో సారి. ప్రియాంక ఇప్పటి వరకు 80కి పైగా సినిమాలు, టీవీ షోలు, అనేక డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించింది. 'మేరీ కోమ్', 'బాజీరావ్ మస్తానీ' సినిమాలతో జోరుమీదున్న ప్రియాంక ఇటీవల అమెరికాలో 'క్వాంటికో' టీవీ షో ద్వారా హాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంది. -
2013 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత?
N. Vijayender Reddy General Awareness Faculty Hyderabad General Awareness 1. The National Association of Software and Services Com-panies (NASSCOM) appointed which of the following persons as its Chairman for 2014-15? 1) R .Chandrasekaran 2) B.V.R. Mohan Reddy 3) N.R. Narayana Murty 4) S. Gopalakrishnan 5) S.D. Shibulal 2. Who adorned the covers of the 151st edition of the Wisden Cricketers' Almanack? (He is the first Indian to feature on the cover of the Almanack) 1) Sunil Gavaskar 2) Sachin Tendulkar 3) Rahul Dravid 4) V.V.S. Laxman 5) Saurav Ganguly 3. Viktor Orban was reelected the Prime Minister of which of the following European countries in April 2014? 1) Austria 2) France 3) Hungary 4) Romania 5) Poland 4. Who has been appointed as the next Chief Justice of India? (He will assume his charge on April 27, 2014) 1) Justice H.L. Dattu 2) Justice A.K. Patnaik 3) Justice T.S. Thakur 4) Justice Rajendra Mal Lodha 5) Justice Balbir Singh Chauhan 5. In April 2014, which of the following companies announced that it would acquire 100 per cent of Ranbaxy Laboratories in a $ 4 billion all-share transaction? 1) Dr. Reddy's Labs 2) Abott 3) Cipla 4) Cadila 5) Sun Pharmaceutical Industries 6. Which country won the third consecutive women's World Twenty20 title in Dhaka on April 6, 2014? 1) Australia 2) England 3) Sri Lanka 4) West Indies 5) New Zealand 7. Who won the men's singles title in the Yonex Sunrise India Open badminton in New Delhi on April 6, 2014? 1) Lee Chong Wei 2) Chen Long 3) Liu Xiaolong 4) Qiu Zihan 5) None of these 8. Who has been chosen for the coveted Dadasaheb Phalke Award for the year 2013? 1) Anand Bakshi 2) Javed Akhtar 3) Dharmendra 4) Gulzar 5) Amitabh Bachchan 9. The Indian Space Research Organization (ISRO) was established in? 1) 1965 2) 1969 3) 1970 4) 1971 5) 1975 10. Who among the following leaders was not assassinated? 1) Mahatma Gandhi 2) Liaqat Ali Khan 3) Muhammed Ali Jinnah 4) Lord Louis Mountbatten 5) Benazir Bhutto 11. Who was the founder Director of the Tata Institute of Funda-mental Research (TIFR)? 1) S.S. Bhatnagar 2) Homi J. Bhabha 3) M.N. Saha 4) Vikram Sarabhai 5) Ratan Tata 12. Which port city is called the Queen of the Arabian Sea? 1) Kandla 2) Kochi 3) Mumbai 4) Marmagoa 5) None of these 13. Rihand Dam is located in which of the following states? 1) Bihar 2) Madhya Pradesh 3) Jharkhand 4) Rajasthan 5) Uttar Pradesh 14. Which city is located on the banks of the river Gomti? 1) New Delhi 2) Amritsar 3) Lucknow 4) Chandigarh 5) None of these 15. Prashant Bhushan is an eminent? 1) Singer 2) Director 3) Film Actor 4) Lawyer 5) Doctor 16. 'Par' and 'Flagstick' are the terms associated with? 1) Golf 2) Polo 3) Billiards 4) Squash 5) Hockey 17. Goods which are meant for consumption are called? 1) Giffen goods 2) Final goods 3) Intermediate goods 4) Inferior goods 5) None of these 18. Variations in Cash Reserve Ratio and Open Market Operations are instruments of? 1) Budgetary policy 2) Trade policy 3) Fiscal policy 4) Monetary policy 5) Industry policy 19. Which of the following Articles empowers the President to impose Financial Emergency? 1) Article 352 2) Article 356 3) Article 360 4) Article 364 5) Article 365 20. The Grand Canyon is a steep-sided canyon carved by which of the following rivers in the United States of America? 1) Colorado 2) Missouri 3) Mississippi 4) Columbia 5) Ohio 21. Hydroponics is a method of culture of plants without using? 1) Water 2) Light 3) Sand 4) Soil 5) Air 22. The endangered species are listed in what color data book? 1) Black 2) Red 3) Green 4) Blue 5) White 23. Which country won the maximum number of medals in the 20th Asian Athletic Championships held in Pune recently? 1) Japan 2) Saudi Arabia 3) Bahrain 4) India 5) China 24. The headquarters of Universal Postal Union is located in? 1) Montreal (Canada) 2) Berne (Switzerland) 3) Geneva (Switzerland) 4) London (UK) 5) Washington D.C. (USA) 25. Who is the author of the book 'The State of the Nation'? 1) Kuldip Nayar 2) Vinod Mehta 3) Fali S. Nariman 4) Mark Tully 5) Soli Sorabjee 26. Who among the following Nobel laureates was not a recipient of the Nobel Prize for Peace? 1) Woodrow Wilson 2) Linus Pauling 3) Norman Borlaug 4) Winston Churchill 5) Jimmy Carter 27. Which one of the following days is not observed in the month of October? 1) International Day of Non-Violence 2) World Habitat Day 3) World Post Office Day 4) United Nations Day 5) International Literacy Day 28. Which Union Territory in India has four districts but none of its districts has a common boundary with its other districts? 1) Chandigarh 2) Puducherry 3) Dadra and Nagar Haveli 4) Andaman and Nicobar Islands 5) Daman & Diu 29. The Indian National Congress was founded by? 1) Surendranath Banerjee 2) W.C. Banerjee 3) A.O. Hume 4) Annie Besant 5) None of these 30. Who among the following was not the President of India? 1) V.V. Giri 2) Zakir Hussain 3) Fakruddin Ali Ahmed 4) R. Venkatraman 5) Maulana Abul Kalam Azad 31. Which of the following is not a nationalized bank? 1) Oriental Bank of Commerce 2) Bank of India 3) United Bank of India 4) Union Bank of India 5) IDBI Bank 32. What is the full form of OPEC? 1) Oil and Petrol Exporting Companies 2) Oil Producing and Exporting Countries 3) Oil Production and Export Corporation 4) Organization of Petroleum Exporting Countries 5) None of these 33. South-South dialogue is associated with? 1) Arms Conference 2) Nuclear Treaty 3) Cooperation among developing nations 4) Meeting between the developed and the developing countries 5) None of these 34. Which one of the following is not a football club? 1) Arsenal 2) Aston Villa 3) Chelsea 4) Tottenham Hotspur 5) Monte Carlo 35. Which of the following is not a component of the agricultural strategy that brought about the Green Revolution? 1) Greater intensity of cropping 2) Guaranteed maximum prices 3) Development of high-yielding varieties 4) New agricultural technology 5) Package of inputs 36. Decibel is the unit used for? 1) Speed of light 2) Intensity of heat 3) Intensity of sound 4) Radio wave frequency 5) None of these 37. Fire temple is the place of worship in which of the following religions? 1) Islam 2) Sikhism 3) Jainism 4) Zoroastrianism 5) Hinduism 38. Foal, Filly and Colt are the three names of a baby? 1) Cat 2) Tiger 3) Deer 4) Horse 5) Dog 39. Blood does not coagulate inside the body due to the presence of? 1) Hemoglobin 2) Heparin 3) Fibrin 4) Plasma 5) None of these 40. Who is the author of the book 'The Apprenticeship of a Mahatma', on which the film 'The Making of the Mahatma' is based? 1) Shyam Benegal 2) Arundhati Roy 3) Ela Gandhi 4) Shobha De 5) Fatima Meer KEY 1) 1 2) 2 3) 3 4) 4 5) 5 6) 1 7) 1 8) 4 9) 2 10) 3 11) 2 12) 2 13) 5 14) 3 15) 4 16) 1 17) 2 18) 4 19) 3 20) 1 21) 4 22) 2 23) 5 24) 2 25) 3 26) 4 27) 5 28) 2 29) 3 30) 5 31) 5 32) 4 33) 3 34) 5 35) 2 36) 3 37) 4 38) 4 39) 2 40) 5