►యు.కె. నుంచి ఇండియా వచ్చిన తొలి జలాంతర్గామి టెలిగ్రాఫ్ కేబుల్.. బాంబే తీరం (ఇన్‌సెట్) : కేబుల్ కేస్
►యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ (యు.ఎస్.ఐ.) సంస్థాపన.
►కేశవ్ చంద్రసేన్ అధ్యక్షుడిగా ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్ ఏర్పాటు
చట్టాలు
►కోర్ట్–ఫీజ్ యాక్ట్, కాయినేజ్ యాక్ట్, ఎక్స్‌ట్రాడిషన్ యాక్ట్, ఫారిన్ ఎన్‌లిస్ట్‌మెంట్ యాక్ట్
జననాలు
దాదాసాహెబ్ ఫాల్కే: సినీ దిగ్గజం. భారతీయ సినిమా పితామహుడు. త్రయంబకంలో జన్మించారు. చిత్తరంజన్ దాస్: స్వాతంత్య్రఉద్యమ నేత. ప్రసిద్ధ న్యాయవాది. ‘దేశబంధు’గా ప్రఖ్యాతి. కలకత్తాలో జన్మించారు. మౌల్వీ అబ్దుల్ హక్ : ఉర్దూ పండితులు. భాషావేత్త. ఉర్దూ భాషను పాకిస్థాన్ జాతీయ భాషగా మార్చాలని డిమాండ్ చేసిన వారిలో ముఖ్యులు. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో జన్మించారు. ఉపాసనీ మహరాజ్ : అసలు పేరు కాశీనాథ్ గోవిందరావ్ ఉపాసని. సద్గురు ఉపాసకులు. షిర్డీకి సమీపాన జన్మించారు. జాదూనాథ్ సర్కార్ : ప్రసిద్ధ చరిత్రకారులు. బంగ్లాదేశ్‌లో జన్మించారు. మొఘల్ సామ్రాజ్య రచనల్లో నిపుణులు. హరిసింగ్ గోర్ : న్యాయవాది, విద్యావేత్త, సంఘ సంస్కర్త. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, నాగపూర్ యూనివర్సిటీలకు తొలి వైస్–చాన్స్‌లర్..
Comments
Please login to add a commentAdd a comment