dail your rm
-
డయల్ యువర్ ఆర్ఎంకు 14 ఫిర్యాదులు
మంకమ్మతోట: కరీంనగర్ రీజియన్‌లోని ప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కారారం కోసం బుధవారం నిర్వహించిన డయల్ యువర్ ఆర్ఎంకు 14 మంది ఫోన్లు చేశారు. కరీంనగర్ నుంచి కామారెడ్డికి రాత్రి 7నుంచి 8గంటల మధ్య బస్సు నడిపించాలని దేవయ్య అనే వ్యక్తి కోరారు. కరీంనగర్ నుంచి బెజ్జంకి వెళ్లే బస్సులను వాగేశ్వరి కళాశాల వద్ద ఆపాలని మన్మోహన్ అనే ప్రయాణికుడు కోరారు. శాతవాహన యూనిర్సిటీకి వచ్చేబస్సులో సమయాన్ని సూచించేలా బోర్డు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరినట్లు అధికారులు తెలిపారు. -
నేడు డయల్ యువర్ ఆర్ఎం
మంకమ్మతోట : నగరంలోని ఆర్టీసీ వన్, టు డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టు డిపో డీఎం లక్ష్మిధర్మ తెలిపారు. ప్రయాణికులు 99592 25931 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని కోరారు.