నలుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లు బదిలీ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని నలుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిని తహసీల్దార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు(ఎలక్షన్)గా నియమించారు. ఒంగోలుకు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్‌ను చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌గా, ఒంగోలుకు చెందిన మరో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్‌ను కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. పొదిలి ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును కనిగిరి సీనియర్ అసిస్టెంట్‌గా, గిద్దలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ దక్షిణామూర్తిని అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు.
ఐదుగురు వీఆర్ఓలకు పోస్టింగ్‌లు:
జిల్లాలో సెలవులో ఉన్న ఐదుగురు వీఆర్వోలకు పోస్టింగ్‌లు కేటాయించారు. మద్దిపాడు మండలంలో విధులు నిర్వర్తిస్తూ సెలవులో ఉన్న కే గురుబాబును సీఎస్‌పురం మండలానికి, గుడ్లూరు మండలానికి చెందిన చినకొండమ్మను టంగుటూరు మండలానికి, కురిచేడు మండలానికి చెందిన ఎం ప్రసాద్‌ను పొన్నలూరు మండలానికి, సీఎస్‌పురం మండలానికి చెందిన సత్యనారాయణను కొత్తపట్నం మండలానికి, మార్కాపురం మండలానికి చెందిన హరినారాయణను కొనకనమిట్ల మండలానికి నియమిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు.