గాలి పెదవులే మెల్లగ సోకిన... | Gali pedavuley song by gantasala | Sakshi
Sakshi News home page

గాలి పెదవులే మెల్లగ సోకిన...

Dec 25 2017 2:27 AM | Updated on Dec 25 2017 2:27 AM

Gali pedavuley song by gantasala - Sakshi

చాలాసార్లు సినిమా పాటకు నేపథ్య సంగీతం, పాడినవారి సామర్థ్యం, నటీనటుల అభినయం తోడవడంవల్ల ఆ పాట మరో స్థాయికి వెళ్తుంది. అలా వెళ్లిన ప్రతిపాటలోనూ సాహిత్య విలువ ఉందని చెప్పలేం. కానీ కొన్ని పాటల్లో పైని సానుకూలతలన్నీ ఉంటూనే గొప్ప పంక్తులు పలుకుతాయి. ఉదాహరణకు 1955లో వచ్చిన ‘సంతానం’ సినిమాలోని చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో పాట తీసుకోండి. పాట మధ్యలో– గాలి పెదవులే మెల్లగ సోకిన పూలు నవ్వెనే నిద్దురలో అని వస్తుంది. ఎంత సున్నితమైన వ్యక్తీకరణ! ఆ మృదుత్వం చెవులకు తెలుస్తుంది. ఆ కవిత్వం హృదయాన్ని తాకుతుంది. ఈ గీతరచన అనిసెట్టి. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి. పాడింది ఘంటసాల. అభినయించింది అక్కినేని, సావిత్రి. ఇన్ని మేలిమి గుణాలన్నీ కలిసి ఈ పాటను ఎన్నో మెట్లు ఎక్కించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement