Dalit farmers
-
దళిత రైతులకు నష్టపరిహారం అందజేసిన ఎమ్మెల్యే రజని
-
సొసైటీ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
చిలకలూరిపేటటౌన్: యడవల్లి సొసైటీ భూములు ప్రభుత్వం తీసుకోవడాన్ని దళిత రైతులు వ్యతిరేకిస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు చేసిన వ్యాఖ్యలపై యడవల్లికి చెందిన రైతులు మండిపడ్డారు. భూముల వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన మధును స్థానిక రైతులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా చిలకలూరిపేట పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌కు ర్యాలీగా చేరుకొని సీపీఎంకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తమ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తగిన పారితోషికం ఇప్పించాలంటూ తాము సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు విన్నవించామని, అది నచ్చని మధు నాటకాలాడొద్దంటూ తమ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని వివరించారు. గత నెలలో ఎస్సీ కమిషన్ గుంటూరు వచ్చినప్పుడు తాము భూములు ఇస్తామని వినతిపత్రం ఇచ్చినట్లు వివరించారు. 99 శాతం మంది రైతులు భూములు ఇవ్వటానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని దృష్టికి తీసుకువెళ్లామని, ఆమె సానుకూలంగా స్పందించి భూములను ప్రభుత్వం తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే భూములు స్వాధీనం చేసుకొని నష్టపరిహారం ఇస్తారన్న భరోసాతో ఉన్నామని, ఈ సమయంలో ఏ రాజకీయపార్టీ కూడా జోక్యం చేసుకోవద్దని కోరారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యడవల్లి సొసైటీ భూముల రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ నెరవేర్చుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. ఈ హామీలో భాగంగా తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు ముందడుగు వేసిందని, దీన్ని కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం తాము ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం తమ భూములు స్వాధీనం చేసుకుంటే ప్రతి కుటుంబానికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని వివరించారు. సమావేశంలో ఈపూరి రాంబాబు, పరిశపోగు శ్రీనివాసు, వేల్పుల సాంబయ్య, రమేష్, అంకమ్మ రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతులపై టీడీపీ నేతల దాష్టీకం
వెంకటాచలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో తెలుగుదేశం నాయకులు శుక్రవారం దళిత రైతులపై దాడిచేశారు. అడ్డుకోబోయిన దళిత సర్పంచిపైనా దౌర్జన్యానికి దిగారు. ప్రభుత్వ అనుమతులతో సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సారవంతమైన మట్టిని తమ పొలాలకు తోలుకుంటున్న దళిత రైతులపై టీడీపీ మండల అధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు దాడిచేశారు. రిజర్వాయర్‌లో అక్రమ మైనింగ్ ఎక్కడ జరిగిందో చూపాలన్న రైతులను కులం పేరుతో దూషించారు. టీడీపీ నాయకులు శుక్రవారం రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్రమ మైనింగ్ జరిగిందంటూ హంగామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు. తమ పొలాలకు సారవంతమైన మట్టిని రిజర్వాయర్ నుంచి తోలుకునేందుకు ప్రభుత్వం అనుమతులిస్తే అడ్డుకోవడమేగాక, తప్పుడు ప్రచారాలు చేయడం ఏమిటని రైతులు వారిని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం, అధికారం కోల్పోయాక బ్లాక్ మెయిల్ చేయడం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. నాలుగుసార్లు ఓడిపోవడంతో సోమిరెడ్డి రైతులపై కక్షగట్టారన్నారు. దీంతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా రైతులపై దాడికి దిగారు. ఈ దాడిలో దళిత రైతు మేకల నరసయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అడ్డుకోబోయిన దళిత సర్పంచ్ శీనమ్మపైనా దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరికొందరు జోక్యం చేసుకుని సర్దుబాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి మా పొలాలను బాగు చేసుకునేందుకు ప్రభుత్వ అనుమతులతో మట్టి తరలిస్తే అడ్డుకోవడమే కాకుండా ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా? అని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత రైతు నరసయ్యపై దాడి చేసి గాయపరచడమేగాక దళిత సర్పంచ్ శీనమ్మ, ఇతర రైతులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన నరసయ్యకు ప్రాథమిక చికిత్స చేయించి అక్కడే బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి ప్రోత్సాహంతోనే టీడీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించి, పథకం ప్రకారం దాడిచేశారని ఆరోపించారు. ఈ ఘటన గురించి తెలిసి రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేలోపే టీడీపీ నాయకులు అక్కడ నుంచి పరారయ్యారు. టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు టీడీపీ నేతల దాష్టీకంపై దళిత రైతు మేకల నరసయ్య, దళిత సర్పంచ్ శీనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులు నలగట్ల సుబ్రహ్మణ్యం, మందల పవన్‌కుమార్, గుమ్మడి రాజాయాదవ్ తమపై దాడిచేయడమే కాకుండా కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వయం ఆధారిత పర్యావరణ సేద్యం!
స్వావలంబన (స్వయం ఆధారిత), స్థానికత.. కొవిడ్ తదనంతర కాలపు ఎజెండా ఇది. నిజానికి.. అచ్చం ఇదే ఎజెండాను జహీరాబాద్ ప్రాంత దళిత మహిళా రైతులు 30 ఏళ్లుగా అమలు చేస్తున్నారు. ఈ వర్షాకాలపు పంట(ఖరీఫ్) కాలంలో సుమారు 30 గ్రామాల్లో 1200 ఎకరాల్లో ఎప్పటి మాదిరిగానే తమదైన ప్రత్యేక పర్యావరణ వ్యవసాయం చేపట్టడానికి వెయ్యి మంది మహిళా రైతులు సన్నద్ధమవుతున్నారు. అంతగా సారం లేని తమ ఎర్ర నేలల్లో వర్షాధార పంటలను.. మార్కెట్ కోసం కాదు, మా కోసం, మా సంప్రదాయ పద్ధతుల్లోనే పండించుకుంటామని ఇటీవల ముక్తకంఠంతో ప్రతినబూనారు. } పొలంలో వేసే ఎరువు మొదలుకొని భిన్నరకాల(చిరు/ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఆకుకూరలు..) విత్తనాలు.. పర్యావరణానికి, మనుషులకి, గొడ్డుగోదకు హాని చేయని తెగులు నివారణ ద్రావణాలు, కషాయాల పిచికారీలు.. సేంద్రియ ఎరువుల వరకు ప్రతి దాన్నీ తమ దగ్గర ఉన్న వనరులతోనే రైతులు స్వయంగా తయారు చేసుకుంటారు. పంట కోసం అప్పుతేవడం గానీ, ఇతరుల నుంచి ఒక్క రుపాయి తీసుకోవడం గానీ, సర్కారు ఎరువులు వాడడం గానీ చేయరు. పంట సీజన్ ముగిసే సరికి సంప్రదాయ సాగులోని విభిన్న పద్ధతులు, పర్యావరణ వ్యవసాయం ప్రాముఖ్యతను చాటి చెబుతారు. ఇది పర్యావరణ వ్యవసాయం యొక్క అత్యంత విలువైన లక్షణం. ఈ మొత్తం పంటల సాగు ప్రక్రియలో వాడే ప్రతిదీ స్థానికమే అని సగౌరవంగా చాటి చెబుతారు. సాగు పద్ధతి ఇదీ.. ► 1200 ఎకరాలకు 48,000 టన్నులకు (ఎకరానికి 40 టన్నులకు) పైగా పశువుల ఎరువు, ప్రత్యేకమైన ‘సమృద్ధి ఎరువు’ వాడతారు. ► విత్తన శుద్ధికి, పంట పెరుగుదలకు ఉపయోగపడే 2000 లీటర్ల బీజామృతం తయారు చేసుకొని వాడతారు. ► పంచగవ్య వంటి సుమారు 5,000 లీటర్ల ‘టానిక్స్’ వాడటం ద్వారా పంటల పెరుగుదల క్రమాన్ని బలోపేతం చేస్తారు. ► పూత ఎక్కువ రావడానికి, మొక్కలపెరుగుదలకు సహాయపడటానికి 48,000 లీటర్ల వర్మివాష్ 1200 ఎకరాలకు పిచికారీ చేస్తారు. ► ఈ మహిళలు జీవవైవిధ్య సాగు కోసం 10–15 రకాల 12,000 కిలోల సొంత విత్తనాలను తమ చేలల్లో నాటనున్నారు. ► ఈ ఖరీఫ్ పంట సీజన్‌నులో ఈ భూములపై తమ శ్రమతోపాటు ఎకరానికి రూ. 5 వేలు ఖర్చు పెట్టనున్నారు. ► ఇక ఆర్థిక రాబడి ఎంతంటారా?.. నీటివసతి లేని ఈ ఎర్రనేలల నుంచి ఎకరానికి రూ.55,000 వరకు రాబడి తీస్తామని ధీమాగా చెబుతున్నారు. ఈ పంటల విధానం చిన్న కమతాలున్న మహిళా రైతుల అవసరాలను తీరుస్తుంది. తిండికి, పౌష్టికాహానికి, ఆరోగ్యానికి, జీవనోపాధికి భద్రతనివ్వడంతోపాటు పశువుల మేతకూ భద్రత ఇస్తోంది. ఎందుకంటే ఇక్కడ రసాయనిక మందుల వాడకం అంటూ ఉండదు. ఈ ప్రకృతిసిద్ధమైన పంటల వల్ల కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని మహిళా రైతులు మనోధైర్యంతో చెబుతున్నారు. సొంత కాళ్లపై నిలబడి సొంత వనరులతో మహిళా రైతులు చిన్నపాటి కమతాల్లో చేపట్టే ఈ పర్యావరణ జీవవైవిధ్య వ్యవసాయానికి జేజేలు పలుకుదాం! -
ఎస్సీ పాడిరైతుల కోసం ‘మినీ డెయిరీలు’
సాక్షి, హైదరాబాద్: దళిత పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఔత్సాహిక పాడి రైతులకు ‘మినీ డెయిరీ’ల ఏర్పాటుకు ఆర్థిక సహకారం ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.4లక్షల వ్యయంతో ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 3 జిల్లాల్లో ప్రయోగ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సాగుకు యోగ్యమైన భూమి ఉన్న చిన్న రైతులకు ఈ యూనిట్లు మంజూరు చేస్తారు. యూనిట్ విలువలో 60% రాయితీ రూపంలో ఎస్సీ కార్పొరేషన్ ఇవ్వనుండగా.. మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణానికి అనుసంధానం చేస్తారు. బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే బాధ్యత కూడా ఎస్సీ కార్పొరేషనే పర్యవేక్షిస్తుంది. మినీ డెయిరీ యూనిట్లను సూర్యాపేట జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దాదాపు 830 మంది రైతులకు వివిధ దశల్లో రుణాలిచ్చి యూనిట్లు ఏర్పాటు చేయగా సత్పలితాలు వచ్చాయి. ఒక్కో రైతు ప్రతినెల కనిష్టంగా రూ.10వేలు సంపాదిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో మినీ డెయిరీ కార్యక్రమాన్ని మరో 5 జిల్లాలకు విస్తరింపజేయాలని తాజాగా ఎస్సీ కార్పొరేషన్ నిర్ణయించింది. కొత్తగా జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ గ్రామీణం, మహబుబాబాద్ జిల్లాల్లో అర్హులైన ఎస్సీ చిన్నకారు రైతులను గుర్తించి దశల వారీగా పథకాన్ని అమలు చేస్తారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ మినీ డెయిరీల కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కేవలం యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్‌తోనే కాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. వారి ఆర్థిక స్థితిని అంచనా వేస్తుంది. ఆర్థికంగా నిలబడే వరకు సలహాలు సూచనలు చేస్తుంది. మినీ డెయిరీల నుంచి వచ్చే పాల సేకరణ బాధ్యతలను స్థానిక నిరుద్యోగ ఎస్సీ యువతకు అప్పగించనుంది. వీరికి ఆర్థిక సహకారం అందించనుంది. గ్రామంలో నిరుద్యోగ యువతతో బృందం ఏర్పడితే వారికి పాల ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటుకు సైతం రాయితీ రుణాలు ఇచ్చేలా ఆ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఈ ప్రతిపాదనలను త్వరలో ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షితో తెలిపారు. -
బాబుకు దళిత రైతులంటే ఎందుకంత చులకనా..?
-
ఆ భూములను రికార్డుల్లో నమోదు చేయండి
ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్ సాక్షి, న్యూఢిల్లీ: గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందిన 29 మంది దళిత రైతులకు చెందిన 30 ఎకరాల భూమిని రికార్డుల్లో నమోదు చేసే విధంగా అధికారులకు అదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఉండవల్లి గ్రామంలో తమకు 1977లో లంక భూమలును సాగు చేసుకోవడానికి డీకే పట్టాలిచ్చారని, కానీ ఆ భూముల్ని సాగు, రికార్డుల్లో నమోదు చేయనీయకుండా కొందరు అడ్డుపడుతున్నారని బాధిత రైతులు గ్రామ సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో విచారణకు హాజరుకావాలని గుంటూరు కలెక్టర్‌ను, అధికారులను, బాధిత రైతులను కమిషన్ ఆదేశించింది. బుధవారం విచారణకు అధికారులు హాజరుకాక పోవడంతో కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దళిత రైతుల హక్కులను కాపాడాల్సిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కమిషన్ సభ్యురాలు కమలమ్మ మండిపడ్డారు. ఏపీ నుంచి తరచుగా దళితుల భూముల విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై తమకు ఫిర్యాదులు అందడం దురదృష్టకరమని ఆమె అన్నారు. అధికారులకు అదేశాలు జారీ చేసి దళిత రైతుల భూములు ఆన్లైన్లో రికార్డు అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి ఆమె లేఖ రాశారు. -
పేద దళిత రైతుల నోట్లో సర్కారు మన్ను
♦ పరిశ్రమల కోసం అసైన్డ్ భూములు కారు చౌకగా కొట్టేసే వ్యూహం ♦ ప్రాథమిక విలువ చెల్లించడానికి జీవో 155 జారీ సాక్షి, హైదరాబాద్: పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలకు పెద్దపీటవేస్తోంది. పేద దళితులకు చెందిన అసైన్డ్ భూములను లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వారి నోట్లో మట్టి కొట్టి పారిశ్రామికవేత్తలకు ఆ భూములు కట్టబెట్టడానికి తాజాగా ఓ జీవో తెచ్చింది. పేదల నుంచి భూములు గుంజుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని పెద్ద దళారీగా వినియోగించుకుంటోంది. బలవంతపు సేకరణవల్ల భూమి కోల్పోయే వారికి న్యాయమైన పరిహారం కూడా ఇవ్వకుండా ప్రాథమిక (బేసిక్) విలువ ఇచ్చి సరిపెట్టాలని చూస్తోంది. అసైన్డ్, పేదలు అనుభవిస్తూ ఉన్న (ఆక్రమిత ప్రభుత్వ) భూముల సేకరణకు ఏపీఐఐసీ ప్రాథమిక విలువ మాత్రం చెల్లిస్తే సరిపోతుందంటూ తాజాగా సర్కారు జీవో 155 జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం (2015-20)లో భాగంగా 10 లక్షల ఎకరాలతో ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నామమాత్రపు పరిహారంతో పేదల నుంచి భూములు లాక్కునేందుకు ఈ జీవో జారీ చేసిందనే విషయం తెలుస్తోంది. ప్రజావసరాల కోసం అసైన్డ్ భూములను సేకరించినా అసైనీలకు న్యాయమైన పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ చట్టం చెబుతోంది. మార్కెట్ విలువ ప్రకారమే అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని గతంలో జారీ చేసిన జీవో 571లో కూడా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారి నుంచి ఆ భూమిని సేకరించినా మార్కెట్ విలువ ప్రకారమే అనుభవదారులకు పరిహారం చెల్లించాలని ఆ జీవోలో ఉంది. అయినా దీనికి విరుద్ధంగా అసైన్డ్, ప్రభుత్వ ఆక్రమిత భూముల సేకరణకు ప్రాథమిక విలువ మాత్రమే ఏపీఐఐసీ చెల్లిస్తుందని ఈనెల 19న ప్రభుత్వం జీవో 155 జారీ చేసింది. నష్టపోయేది పేద దళితులే.. బేసిక్ విలువ అనే ముద్దుపేరుతో బిక్ష వేసి అసైనీలు, అనుభవదారుల నుంచి భూమిని ఏపీఐఐసీ బలవంతంగానైనా సేకరించవచ్చంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో అత్యంత దుర్మార్గమైనదని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలనే కేంద్ర చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ఉత్తర్వు ఉందని రెవెన్యూ శాఖలో రిటైరైన ఒక ఐఏఎస్ అధికారి చెప్పారు. ‘‘బహిరంగ మార్కెట్ విలువపై గిరిజన ప్రాంతాల్లో అయితే 1.5 రెట్లు, షెడ్యూలేతర ప్రాంతాల్లో అయితే 1.25 రెట్లు అధికంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం చెబుతోంది. అంటే.. ఉదాహరణకు ఎకరా మార్కెట్ విలువ రూ. లక్ష ఉంటే గిరిజన ప్రాంతాల్లో రూ. 2.50 లక్షలు, గిరిజనేతర ప్రాంతాల్లో రూ. 2.25 లక్షలు పరిహారం చెల్లించాలి. దీనికి అదనంగా 12 శాతం కూడా ఇవ్వాలి. పైగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఎల్ఏఆర్ఆర్ చట్టం ప్రకారం చేయాల్సిన నష్ట పరిహారం పునరావాస ప్యాకేజీలను తగ్గించి రాష్ట్రం పైప్యాకేజీలు అమల్లోకి తెచ్చింది. బేసిక్ విలువ అనేది రిజిస్ట్రేషన్ శాఖ ఫీజుల వసూలు కోసం నిర్ణయించిన మార్కెట్ ధర. ఇది వాస్తవంగా బహిరంగ మార్కెట్ విలువలో పదో వంతు మాత్రమే ఉంటుంది. అందువల్ల బేసిక్ విలువ చెల్లించి పేదలకు చెందిన అసైన్డ్, వారు అనుభవిస్తున్న భూములు లాక్కోవడమంటే వారి కడుపు కొట్టడమే. అసైన్డ్ భూములున్న వారిలో పేద దళితులే ఎక్కువ. అందువల్ల ఈ జీవో ప్రకారం భూములు లాక్కుంటే ఎక్కువగా నష్టపోయేది ఆ దళితులే’’ అని ఆ రిటైర్డు ఐఏఎస్ అధికారి వివరించారు. పెపైచ్చు జీవో 571కి సవరణలు చేసేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏడాది క్రితం నియమించింది. ఆ ఉప సంఘం నివేదిక ఇంకా సమర్పించక ముందే జీవో 571కి సవరణ చేస్తూ జీవో 155ను జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఎందుకివ్వాలి? ఏ సంస్థ అయినా తమ వ్యాపార ప్రయోజనాల కోసమే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. వ్యాపారమో, పారిశ్రామిక కార్యకలాపాల కోసమో వచ్చే సంస్థలకు నామమాత్రపు ధరకో లేదా ఉచితంగా భూములు ఎందుకు ఇవ్వాలి? పెపైచ్చు పారిశ్రామిక సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు పేదల నుంచి అసైన్డు భూములు ఎందుకు లాక్కోవాలి? ఏపీఐఐసీని ఇందుకు పెద్ద దళారీగా పెట్టి పది లక్షల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమిటి? ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాలు లేకపోతే పేదల పొట్టకొట్టేలా పది లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ప్రతిపాదన ఎందుకు? అని రాజకీయ, అధికార వర్గాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం? మార్కెట్ విలువ చెల్లించి సేకరించిన భూములను పారిశ్రామిక సంస్థలు తీసుకుంటే వాటికి భారమవుతుందని ఏపీఐఐసీ భావించింది. అందువల్ల బేసిక్ విలువకే అసైన్డ్, పేదల భూములను వారికి ఇవ్వాలని ఏపీఐఐసీ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అంటే ప్రభుత్వానికి పేదల ప్రయోజనాలు ముఖ్యమా? పారిశ్రామిక సంస్థలకు లబ్ధి చేకూర్చడం ప్రాధాన్యమా? అని విపక్షాలతోపాటు అధికార వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. పేదల భూములు లాక్కుని పారిశ్రామిక సంస్థలకు కారుచౌకగానో లేక ఉచితంగానో భూములు కట్టబెట్టాలని కుట్ర పన్నడం దారుణమని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇలా భూములు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు, ప్రజల ఆస్తులకు గండిపడేలా టీడీపీ సర్కారు గత కొంతకాలంగా తీసుకున్న నిర్ణయాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. పారిశ్రామిక సంస్థలకు మేలు చేకూర్చే భూముల గరిష్ట లీజు పరిమితిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. లీజు పెంపుతో పాటు పారిశ్రామిక సంస్థలకు కేటాయించిన భూములు విక్రయించుకునేలా పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తూ జీవో ఇవ్వడం మరో నిదర్శనం. అమ్మో.. పరిశ్రమల శాఖ ప్రభుత్వం అస్మదీయులకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు, భూములు కట్టబెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఆ మేరకే ఉత్తర్వులు మీద ఉత్తర్వులు జారీ చేస్తోంది. వీటిపై ఎవరైనా కోర్టుకు వెళితే.. భవిష్యత్‌లో ప్రభుత్వాలు విచారణకు ఆదేశించినా ఇబ్బందులు తప్పవని ఉన్నతాధికారులు భయపడుతున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. ఆ స్థానంలో నియమించేందుకు ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను సంప్రదించగా.. అక్కడ నియమిస్తే తాము సైతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్తామని స్పష్టీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
ఎస్సీలకు భూ పంపిణీలో నిజామాబాద్ ఫస్ట్
సాక్షి, హైదరాబాద్: భూమిలేని దళిత రైతులకు మూడెకరాల పంపిణీ పథకం అమల్లో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎంవీరెడ్డి ప్రశంసించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ చేపట్టిన వివిధ పథకాల అమలుపై జీఎం ఆనందకుమార్, అన్ని జిల్లాల ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లతో ఆయన గురువారం సమీక్షించారు. ఎంవీరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది 3,334 మందికి 10 వేల ఎకరాల భూమి పంపిణీ లక్ష్యంగా కాగా, ఇప్పటివరకు 1,407 మందికి 3,713 ఎకరాలు పంపిణీ జరిగిందన్నారు.