Daman Singh
-
‘కనిష్క’ మరోసారి తెరపైకి..
టొరంటో: 1985లో ఎయిరిండియా ‘కనిష్క’ ఉగ్ర బాంబు పేలుడు ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసులో నిర్దోషిగా బయటపడిన రిపు దమన్ సింగ్ మాలిక్ (75) కెనడాలో గురువారం హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి దగ్గర్నుంచి తుపాకీతో కాల్చేశాడు. దీనిని టార్గెట్ కిల్లింగ్‌గా పోలీసులు భావిస్తున్నారు. వాంకోవర్‌లో 16 వేల మంది సభ్యులున్న ఖల్సా క్రెడిట్ యూనియన్ (కేసీయూ)కు మాలిక్ ప్రెసిడెంట్. అక్కడే ఖల్సా స్కూళ్లను నడుపుతున్నారు. ఆయనకు పాపిలాన్ ఈస్టర్న్ ఎక్స్పోర్ట్ వంటి పలు వ్యాపారాలున్నాయి. మాలిక్ హత్యను బాధాకరమైన, దురదృష్టకరమైన ఘటనగా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ పేర్కొంది. ఎందరో శత్రువులు సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌ను భారత్ వెలుపల ముద్రించరాదన్న సంప్రదాయాన్ని ఉల్లంఘించి రిపుదమన్ వివాదాస్పదుడయ్యారు. ఆయన బయటకు కనిపించినంత మంచి వ్యక్తి కాదని కనిష్క కేసు దర్యాప్తు బృంద సారథి రిటైర్డు డిప్యూటీ కమిషనర్ గ్యారీ బాస్ చెప్పారు. మాలిక్ వివాదాస్పద వ్యక్తి అని ఆయన ఒకప్పటి మిత్రుడు ఉజ్జల్ దొసాంజ్ అన్నారు. 1985 జూన్ 23న 329 మందితో టొరంటో నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా కనిష్కలో సూట్‌కేసు బాంబ్ పేలి అంతా దుర్మరణం పాలయ్యారు. ఇది ఖలిస్తానీ ఉగ్రవాదుల పనేననంటారు. ఈ ఘటనలో దోషిగా తేలిన ఇందర్జిత్ సింగ్ రేయాత్ అనే వ్యక్తి కెనడాలో 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. -
కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అభ్యంతరం తెలియజేశారు. తన తల్లిదండ్రులు వృద్ధులని, జూ లో జంతులు కాదని మండిపడ్డారు. కాగా డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్ సింగ్ రెండు రోజులుగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చదవండి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత ఈ క్రమంలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)వెళ్లి మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడే ఉన్న మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరన్ కౌర్‌ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు. అయితే కేంద్రమంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఫైర్ అయ్యారు. మంత్రి తనతోపాటు ఫోటోగ్రాఫర్‌ను గదిలోకి తీసుకొచ్చినప్పుడు తల్లి చాలా బాధపడిందని, బయటకు వెళ్లాలని చెప్పిన ఆమె మాటలు అస్సులు వినిపించుకోలేదని అన్నారు. తమ తల్లిదండ్రుల కోరికకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు అసహనం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్య మంత్రి మా కుటుంబాన్ని పరామర్శించడం సంతోషంగా ఉంది. అయితే ఆ సమయంలో మా తల్లిదండ్రులు ఫోటో దిగే స్థితిలో లేరు. నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారు వృద్ధులు. జూలో జంతువులు కాదు. అని ఆమె పేర్కొన్నారు. -
మా నాన్న ఉత్సాహం ఆధారంగా 'జీవితచరిత్ర'
న్యూఢిల్లీ: తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావాలా? లేదా అన్న దానిపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించుకోవాల్సి ఉందని ఆయన కుమార్తె దామన్‌సింగ్ తెలిపారు. ‘‘నా తండ్రి తన జీవిత చరిత్రను ఎప్పుడు రాస్తారనేది, ఆయన దానిపై కనపరిచే ఉత్సాహంపైనే ఆధారపడి ఉంది’’ అని దామన్ చెప్పారు. తన తల్లిదండ్రుల వ్యక్తిగత జీవిత విశేషాలతో ‘స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్’ అనే పుస్తకాన్ని దామన్‌సింగ్ రచించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం ప్రచురణ సందర్భంగా దామన్‌సింగ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి అభిమానంతో, నిజాయతీగా రాయడానికి ముగ్గురు రచయితల (విక్రంసేత్, సిలివా నాసర్, ఎంజే అక్బర్) జీవిత చరిత్రలు సహాయపడినట్లు ఆమె వెల్లడించారు. **