Dammaiguda
-
తమిళిసై వద్ద పెండింగ్‌లో ఫైల్.. పురసారథులకు ‘పరీక్ష’
సాక్షి, రంగారెడ్డిజిల్లా/ మేడ్చల్‌జిల్లా: నగర/పురపాలికల్లో క్యాంపు రాజకీయాలకు తెరలేస్తోంది. మూడేళ్ల పదవీకాలం ముగియనుండటంతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఇందుకు వ్యూహరచన చేస్తుండటంతో ప్రస్తుత పాలక వర్గాలు పదవిని కాపాడుకునేందుకు.. వైరి వర్గం కుర్చీ దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. నగర, పురపాలక సంఘాల్లో అవిశ్వాస పరీక్షలకు మూడేళ్ల కాల పరిమితిని విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టంలో పొందుపర్చింది. దీన్ని నాలుగేళ్లకు సవరిస్తూ గత ఏడాది అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. గవర్నర్ తమిళిసై పరిశీలనకు వెళ్లిన ఈ బిల్లుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. దీంతో పాత చట్టమే మనుగడలో ఉందని భావిస్తున్న అసంతృప్తి నేతలు, అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నగర/పురపాలక సంఘాలు పగ్గాలు చేపట్టి ఈ నెల 26 నాటికి మూడేళ్లు ముగుస్తున్నందున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పురపాలికలపై కన్నేసిన ఆశావహులు ఎత్తులు వేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో కొంతకాలంగా విందు, విహార యాత్రలతో బిజీగా ఉన్న ఈ నేతలు మరిన్ని వ్యూహాలు రచిస్తున్నారు. నగర శివారులోని దాదాపు మెజారిటీ మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో.. ► మేడ్చల్ జిల్లాలో నిజాంపేట్, బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార పార్టీ సభ్యులే వైరి వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత పాలక వర్గాలకు మూడేళ్లు పూర్తి కావడంతో పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నిజాంపేట్ కార్పొరేటర్లు ఇటీవల శ్రీశైలం వేదికగా, జవహర్‌నగర్ నగరపాలక సంస్థ పాలక సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలు వేదికగా క్యాంపు రాజకీయాలు నెరిపారు. ► బోడుప్పల్ కార్పొరేషన్‌లోనూ గ్రూపు రాజకీయాలు అధికమయ్యాయి. ఇక్కడ కూడా అవిశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మేడ్చల్ మున్సిపాలిటీలో కొంత కాలంగా మున్సిపల్ చైర్పర్సన్ తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై మంత్రి సమక్షంలో పలుమార్లు అసంతృప్తి వెళ్లబుచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోనూ అధికార పార్టీలోని ఇరు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నాగారం మున్సిపాలిటీలో చైర్మన్‌పై అవిశ్వాసానికి అంతర్గంగా పావులు కదుపుతున్నట్లు అధికార టీఆర్ఎస్ కౌన్సిర్లలోనే చర్చ జరుగుతోంది. దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీల్లోని అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. రంగారెడ్డి జిల్లాలో.. ► ఆదిబట్ల, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అవిశ్వాస పరీక్షలు పెట్టేందుకు అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. గతంలో పదవీ కాలం ఒప్పందాలు కుదుర్చుకున్న సభ్యులు కూడా పట్టు వీడకపోవడంతో కొన్ని చోట్ల విశ్వాస పరీక్షలకు దారితీస్తోంది. ఇంకొన్ని చోట్ల పదవీ నుంచి దిగేందుకు ససేమిరా అనడం కూడా ఈ పరిస్థితులకు కారణంగా మారుతోంది. ► తుర్కయంజాల్‌లో మెజార్టీ కౌన్సిలర్లను గెలుచుకున్న కాంగ్రెస్.. రెండు వర్గాలుగా విడిపోయింది. పదవుల పంపకంపై ఇరుపక్షాలు బెట్టు దిగకపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సీను ఇబ్రహీంపట్నం పురపాలికలోనూ కనిపిస్తోంది. గులాబీ శిబిరంలో కీచులాటలతో చైర్‌పర్సన్‌పై కౌన్సిలర్లు ఏకంగా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలు సంధిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా మూడేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై మంతనాలు సాగిస్తున్నారు. ► మరోవైపు ఆదిబట్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ కౌన్సిలర్ దక్కించుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలతో స్థానిక ఎమ్మెల్యేలతో చైర్‌పర్సన్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెను గద్దె దింపే దిశగా ఎమ్మెల్యే వర్గీయులు చక్రం తిప్పుతున్నారు. నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలు.. బండ్లగూడ నగర పాలక సంస్థలోనూ చైర్మన్‌గిరీ విషయంలో మడతపేచీ నెలకొంది. ఇక్కడ కూడా రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చారు. తాజా పరిణామాలతో పోస్టు నుంచి తప్పుకొనేందుకు నో చెబుతుండడంతో రాజకీయం ఉత్కంఠగా మారింది. (క్లిక్ చేయండి: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి) -
దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: జవహర్ నగర్ బాలిక ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతిచెందినట్లు జవహర్‌నగర్ పోలీసులు గుర్తించారు. కాగా గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమై.. తెల్లారి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. దీంతో జవహర్‌నగర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆదివారం సీఐ చంద్రశేఖర్ ప్రత్యేక బృందాలతో కలిసి పరిసర ప్రాంతాలను జల్లెడ పడ్డారు. చెరువులో ఉన్న నీరు ఊపిరితిత్తులలోకి చేరి ఇందు మృతిచెందినట్లు పోస్టుమార్టమ్ రిపోర్టు నివేదికలోనూ వెల్లడైంది. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. చదవండి: డబ్బు వసూలు చేసినట్లు నిరూపించు.. రోహిత్ రెడ్డికి రఘునందన్ సవాల్.. -
చిన్నారి మృతిపై వీడని మిస్టరీ.. తల్లిదండ్రుల ఫోన్లు స్వాధీనం!
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చిన్నారి మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. పాప మృతికి గల కారణాలపై మిస్టరీ వీడలేదు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణకు 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్‌తో విచారిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చిన్నారి ఇందుకు ఇవాళ(శనివారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాప మృతికి గల అసలు కారణాలను వెలికి తీసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేస్తున్న క్రమంలో దమ్మాయిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా దమ్మాయిగూడలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం చెరువు నీటిని సైతం పరీక్షలకు పంపించినట్లు సమాచారం. అలాగే.. గంజాయి సెవిస్తూ విచ్చలవిడిగా తిరిగే కొందరు అనుమానితులను సైతం జవహార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక, సైంటిఫిక్ ఆధారాలతోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: బాలిక మిస్సింగ్ విషాదాంతం.. చెరువులో మృతదేహం లభ్యం -
ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు : బాలిక తండ్రి
-
మిస్టరీ డెత్.. దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత..
-
దమ్మాయిగూడ బాలిక మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన చిన్నారి ఇందు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. కాగా ఇందు పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు గుర్తించిన వైద్యులు.. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చారు. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే చెరువులో ఎవరైనా తోసేశారా..? తనే ఆడుకుంటూ పడిందా అనేది తేలాల్సి ఉంది. దమ్మాయిగూడలో ఉద్రిక్తత దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలిక మృతదేహంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టు తమకు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందు మృతిపై స్పఫ్టత ఇవ్వాలని, చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. -
మేడ్చల్: బాలిక మిస్సింగ్ ఘటన విషాదాంతం
-
చిగురిస్తున్న మెట్రో ఆశలు.. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో హారం...
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పలు మార్గాల్లో మెట్రో మార్గం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు పునాదిరాయి పడిన నేపథ్యంలో.. తాజాగా పలు ప్రాంతాల నుంచి మెట్రో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికి అధికార, విపక్ష పార్టీలు, వివిధ వర్గాల వారు మద్దతునిస్తుండడంతో నూతనంగా చేపట్టాల్సిన మెట్రో మార్గాలపై అధ్యయనానికి హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరు మెట్రో పూర్తికి సుమారు రూ.300 కోట్లు అంచనా వ్యయం అవుతుంది. ఈ స్థాయిలో నిధులు వ్యయం చేసే స్థితిలో రాష్ట్ర సర్కారు లేదన్న విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యం, లేదా కేంద్ర సహకారంతో పలు రూట్లలో ప్రాజెక్టులు చేపట్టడం.. తొలుత ప్రైవేటు సంస్థలు చేసే వ్యయంతో పూర్తిచేసి ఆ తర్వాత వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు వడ్డీతో సహా చెల్లించడం (హైబ్రిడ్ యాన్యుటీ ) తదితర విధానాలపై సర్కారు దృష్టి సారించడం విశేషం. (క్లిక్ చేయండి: ఇక ఈజీగా ఆధార్ అప్డేట్) ఔటర్ చుట్టూ మెట్రో హారం... మహానగరానికి మణిహారంలా 158 కి.మీ మేర విస్తరించిన ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సుమారు 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రూటు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగవడంతో పాటు వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ప్రధానంగా ఐటీ, హార్డ్‌వేర్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు మెట్రో రూటు మరింత ఊపునిస్తుందన్న అంచనాలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
Hyderabad: నాగారం, ఘట్కేసర్, దమ్మాయిగూడలో లింక్ రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని రహదార్లకు మహద్భాగ్యం కలుగనుంది. నగరానికి తూర్పున ఉన్న మేడ్చల్ జిల్లా పరిధిలోని దమ్మాయిగూడ, జవహర్‌నగర్, నాగారం, ఘట్కేసర్ స్థానికసంస్థల పరిధిలో 4 లేన్లు, 6 లేన్లతో విశాలమైన రహదారులు రానున్నాయి. ఇన్నర్ రింగ్‌రోడ్, ఔటర్‌రింగ్ రోడ్‌కు అనుసంధానంగా ప్రజల సాఫీ ప్రయాణానికి లింక్, స్లిప్రోడ్లలో భాగంగా ప్రభుత్వం ఇటీవల 104 రోడ్ల పనులకు నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. వాటిల్లో 50 రోడ్ల పనుల్ని ప్రాధాన్యతతో చేపట్టాల్సిందిగా సూచించింది. ఐదు ప్యాకేజీలుగా.. మొత్తం ఐదు ప్యాకేజీలుగా పనులకు నిధులు మంజూరు చేయగా వాటిల్లో మూడో ప్యాకేజీలోని 13 కారిడార్ల (రోడ్ల) పనులు చేసేందుకు హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్) టెండర్లు ఆహ్వానించింది. వీటి అంచనా వ్యయం రూ.293.55 కోట్లు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైన భూసేకరణ, యుటిలిటీస్ షిఫ్టింగ్ వంటి పనులు లేని ప్రాంతాల్లో రోడ్ల పనులు వేగంగా జరగనున్నాయి. వీటికి అవసరమైన నిధుల్ని హెచ్ఎండీఏ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. టెండర్లు పిలిచిన రోడ్ల వివరాలు.. దమ్మాయిగూడ మునిసిపాలిటీలో.. ► దమ్మాయిగూడ రోజ్‌గార్డెన్ ఫంక్షన్‌హాల్ నుంచి నాగారం రోడ్ (ఈసీఐఎల్‌ను కలుపుతూ): 2.80 కి.మీ.లు. ► చీర్యాల జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్ కాలనీ నుంచి అహ్మద్‌గూడ: 1.70 కి.మీ.లు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో.. ► ఫైరింగ్ కట్ట నుంచి ఎన్టీఆర్ విగ్రహం రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి దమ్మాయిగూడ రోడ్ (మునిసిపల్ పరిధి వరకు ): 1.90 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి డంపింగ్ యార్డ్ వరకు: 2.35 కి.మీ.లు ► ఎన్టీఆర్ విగ్రహం నుంచి వంపుగూడ రోడ్ వరకు: 1.20 కి.మీ.లు నాగారం మునిసిపాలిటీలో.. ► రాంపల్లి క్రాస్‌రోడ్స్ నుంచి సర్వే నెంబర్ 421 వరకు(హెచ్‌పీ పెట్రోల్‌పంప్ దగ్గర) : 3.90 కి.మీ.లు. ► సర్వే నెంబర్ 421 (హెచ్‌పీ పెట్రోల్‌పంప్ దగ్గర)నుంచి యామ్నాంపేట (నాగారం మునిసిపాలి టీ సరిహద్దు వరకు): 3.10 కి.మీ.లు. ► చర్లపల్లి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్‌రోడ్ వరకు( వయా కరీంగూడ ): 3.80 కి.మీ.లు ► యామ్నాంపేట ఫ్లైఓవర్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు: 2.60 కి.మీ.లు ► చర్లపల్లి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి రాంపల్లి జంక్షన్ వరకు: 3.30 కి.మీ.లు పోచారం మునిసిపాలిటీలో.. ► యామ్నాంపేట నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ వరకు: 2.10 కి.మీ.లు ఘట్కేసర్ మునిసిపాలిటీలో.. ► శివారెడ్డిగూడ నుంచి మాధవ్‌రెడ్డి బిడ్జ్రి : 2.50 కి.మీ.లు. ప్రయోజనాలు ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే నగరంనుంచి శివారు ప్రాంతాలకు సాఫీ రవాణా సాధ్యమవుతుంది. ప్రజలకు ప్రయాణదూరం, సమయం, ఇంధనవ్యయం తగ్గుతాయి. వాహన కాలుష్యం తగ్గడంతో ప్రయాణాల వల్ల తలెత్తే ఆరోగ్య ఇబ్బందులూ తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: రెండంతస్తుల్లో చర్లపల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం) -
నుదుటిపై తుపాకీ పెట్టి కాల్చేయమన్న అభిరామ్!
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడలో చిన్నారులపై లైంగికదాడి కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంసారానికి పనికిరావంటూ భార్య హేళన చేసిందని.. అభిరామ్ దాస్ మహిళలపై కోపం పెంచుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తన కోరిక తీర్చాలని ఒంటరి మహిళలను అభిరామ్ వేధించేవాడని తెలిసింది. లైంగికదాడిని వ్యసనంగా మార్చుకున్న అభిరామ్ చివరకు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కాగా,ఈనెల 4న దమ్మాయిగూడకు చెందిన మూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి నిందితుడు అభిరామ్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈనెల 9న అదే ప్రాంతంలో మరో చిన్నారిని కిడ్నాప్‌నకు యత్నించాడు. అతడు డ్రగ్స్‌కు సైతం బానిసైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు విచారణలో భాగంగా పోలీసుల అదుపులో ఒడిశాకు చెందిన అభిరామ్ దాస్.. నుదుటిపై తుపాకీ పెట్టి తనను కాల్చేయాలంటూ పోలీసులను వేడుకోవడం గమనార్హం. -
దమ్మాయిగూడ అత్యాచార కేసులో పురోగతి
సాక్షి, జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో చిన్నారి అత్యాచార ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు ఒరిస్సాకు చెందిన 40 సంవత్సరాల వ్యక్తిగా జవహర్ నగర్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను బండ్లగూడలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. భార్యతో తరచూ గొడవల కారణం కొంతకాలం నుంచి భార్యతో దూరంగా ఉంటున్నాడని పేర్కొన్నారు. జవహర్‌నగర్ సీఏ బిక్షపతి రావు, కీసర సీఐ నరేందర్ గౌడ్ జాయింట్ ఆపరేషన్‌లో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అతను పోలీసు అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఇటీవల దమ్మాయిగూడలో నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఘటన జరిగిన దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు నిర్వహిస్తుండటం, ఎమ్మెల్యే సీతక్క నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిని చూసేందుకు వెళ్లడం, వెంటనే నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. -
సీసీటీవీ దృశ్యాలు: బాలిక కిడ్నాప్‌నకు యత్నం, తల్లి వెంటపడటంతో
సాక్షి, జవహర్‌నగర్: ఇటీవల దమ్మాయిగూడలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం రాచకొండ పోలీసులు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఘటన జరిగిన దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు నిర్వహిస్తుండటం, ఎమ్మెల్యే సీతక్క నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారిని చూసేందుకు వెళ్లడం, వెంటనే నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రంగంలోకి రాచకొండ సీపీ ఐదు రోజులుగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నా ఫలితం లేకపోవడంతో శుక్రవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలు దాదాపు 600 మంది పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి దమ్మాయిగూడ ప్రగతినగర్‌తో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆయా కాలనీల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. జవహర్‌నగర్ సీఐ భిక్షపతిరావు, కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ల నేతృత్వంలో విస్తృతంగా విచారణ చేపట్టారు. మరో బాలిక కిడ్నాప్‌నకు యత్నం.. వందలాది మంది పోలీసులు శుక్రవారం గాలిస్తున్న క్రమంలో ప్రగతినగర్‌లో ఎరుపు రంగు టీషర్టు.. నల్లరంగు మాస్క్ ధరించిన ఓ అనుమానిత వ్యక్తి అక్కడే ఉన్న కిరాణ దుకాణంలో సిగరెట్ కొనుగోలు చేశాడు. అక్కడే ఆడుకుంటున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక తల్లి వెంటనే అప్రమత్తమవ్వడంతో అనుమానిత వ్యక్తిని నిలదీసింది. అతని సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో ఆమె దుండగుడిని వెంబడించింది. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కీసర పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతంలో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
హైదరాబాద్ దమ్మాయిగూడలో కిడ్నాప్ కలకలం
-
ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. ఎయిర్‌గన్‌తో
జవహర్‌నగర్: ఆన్లైన్లో కొనుగోలు చేసిన బొమ్మ తుపాకీతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ పద్మశాలి టౌన్షిప్లో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్చార్జి సీఐ మధుకుమార్ వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన యువతి గీతాంజలి కళాశాలలో బీటెక్ చదువుతూ దమ్మాయిగూడ లేక్‌వ్యూ కాలనీలోని బంధువుల ఇంట్లో నివాసముంటోంది. దమ్మాయిగూడ సాయిబాబానగర్‌కు చెందిన అభిషేక్(20) అదే కళాశాలలో చదువుతూ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం యువతి సోదరుడు భానుప్రకాశ్‌ను పద్మశాలి టౌన్‌షిప్‌కు పిలిపించి ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఎయిర్‌గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులు అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడు ఉపయోగించిన ఎయిర్‌గన్ ఆన్లైన్లో కొనుగోలు చేసిన బొమ్మతుపాకీ అని పోలీసులు నిర్ధారించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడియో కాల్.. లైవ్‌లో దుస్తులిప్పి చదవండి: పెళ్లి పేరుతో యువతిపై రెండేళ్లుగా లైంగిక దాడి -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృత్యువాత
హైదరాబాద్: దమ్మాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలిక చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకుని బైక్‌పై నాగారంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా స్థానిక చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న అఖిల(15) అనే బాలిక అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. -
దమ్మాయగూడెంలో ఉద్రిక్తత
కీసర : ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని రంగారెడ్డి జేసీ ఆదేశాల జారీ చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు కీసర మండలం దమ్మాయగూడలోని అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. దీంతో అధికారుల ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తమను నిరాశ్రయులను చేస్తే.. ఎక్కడికి పోతామంటూ వారు ఆక్రోశించారు. అధికారులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానికులను అదుపులోకి తీసుకున్నారు. -
భార్యను చంపిన భర్త
‘సంబంధా’నికి అడ్డుగా ఉందని అంతం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన మహిళలు అనాథలైన చిన్నారులు దమ్మాయిగూడలో దారుణం కీసర, న్యూస్‌లైన్: ‘అమ్మా.. లేవమ్మా.. ఏమైందమ్మా నీకు.. లేవమ్మా’ అని ఆ చిన్నారుల రోదనలు కాలనీవాసుల హృదయాలను కలిచివేశాయి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొంతునులిమి చంపేశాడు. దీంతో ఆ దంపతుల ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. నిందితుడు ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేయగా స్థానిక మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని దమ్మాయిగూడలోని భవానీనగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన చిరంజీవి(34) ఆరేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన భవానీ(27)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతులు మూడేళ్ల క్రితం కీసర మండలం దమ్మాయిగూడకు వలస వచ్చారు. చిరంజీవి స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తుండగా భార్య స్థానికంగా ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. వీరికి పిల్లలు భార్గవి, (5) సోని(3), స్వప్న (7 నెలలు) ఉన్నారు. ఇటీవల మద్యానికి బానిసైన చిరంజీవి అదే కాలనీలో ఉంటున్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు భవానీ భర్తతో గొడవపడింది. తన ‘సంబంధా’నికి భార్య అడ్డుగా ఉందని, ఎలాగైనా చంపేయాలని చిరంజీవి పథకం వేశాడు. ఈక్రమంలో మంగళవారం రాత్రి ఫూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో చిరంజీవి భార్య గొంతునులిమి చంపేశాడు. భవానీ ఆత్మహత్య చేసుకుందని కాలనీ వాసులను నమ్మించాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు చీరతో మృతదేహాన్ని వేలాడదీశాడు. బుధవారం తెల్లవారుజామున చిరంజీవి కాలనీవాసులను పిలిచి తన భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పాడు. కాగా ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం, భవానీ చేతి గాజులు ఇంట్లో పగిలి ఉండటం, పుస్తెల తాడు తెగిపోయి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. చిరంజీవికి కాలనీ మహిళలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు. తల్లిపాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి చిరంజీవి భార్యను చంపేయడంతో పిల్లలు అనాథలయ్యారు. నిత్యం ఉదయం నిద్రలేపి లాలించే తల్లి విగతజీవిగా పడి ఉండడంతో చిన్నారులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ తల్లికి ఏమైందో కూడా తెలియని ఆ చిన్నారుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. ‘అమ్మా.. లేమ్మా.. ఏమైందమ్మా నీకు’ అని భార్గవి గుక్కపట్టి ఏడ్చిన తీరు హృదయ విదారకం. తల్లి మృతితో పిల్లలు అనాథలయ్యారని కాలనీ వాసులు కంటతడి పెట్టారు. తల్లిపాల కోసం ఏడు నెలల చిన్నారి గుక్కపట్టి ఏడి ్చంది. మృతురాలి బంధువులు వస్తే చిన్నారులను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. చిరంజీవితో పాటు అతడి ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పిల్లలు కాలనీవాసుల వద్ద ఉన్నారు.