పెద్దపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని దామోదర్ టింబర్ డిపోలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా డిపోను మంటలు చుట్టు ముట్టడంతో చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది.
ఎవరో గిట్టని వారే డిపోనకు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.