danger indication
-
గోడ కూలితే.. ఇక అంతే!
సాక్షి, కడప : కడప నగరం ఎస్పీ బంగ్లా ఎదురుగా గల ఆఫీసర్స్ కాలనీలో ఖాళీగా ఉన్న ఓ భవనం ప్రహరీ ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ఉంది. ఉత్తరం వైపుగల భవనంలో పూర్వం పట్టు పరిశ్రమ కార్యాలయం ఉండేది. కార్యాలయాన్ని అక్కడి నుంచి తొలగించడంతో చాలా ఏళ్లుగా ఆ భవనం ఉపయోగంలో లేక శిథిల స్థితికి చేరింది. రోడ్డువైపు గల ఆ భవనం ప్రహరీ చీలికలు రావడంతో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అసలే గోడలు వర్షాలకు నాని ఉన్నాయి. ఆపై గోడపై వాలి ఉన్న చెట్టు గాలికి కదిలిన వెంటనే ఆ గోడ కూలేలా ప్రమాదకరమైన స్థితిలో కనిపిస్తోంది. చెట్టుకూడా రోడ్డుపైకి వాలి ఉంది. పెద్దగాలి వస్తే అది కూడా కూలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. -
హార్బర్లో మూడో నంబర్ ప్రమాద సూచిక
నిజాంపట్నం: వార్దా తుపాను ప్రభావంతో హార్బర్లో మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగరవేసినట్లు పోర్టు కన్జరవేటర్ ఎం.వెంకటేశ్వరావు తెలిపారు. వార్దా తుపాను చెనై్న పయనిస్తోందని సోమవారం అక్కడే తీరందాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈదురుగాలులు రేవును తాకవచ్చన్న.. సమాచారం ఉన్నప్పుడు మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగరవేస్తారని తెలిపారు. సముద్రపు వేటలో ఉన్న బోట్లన్నీ వేట నుంచి తిరిగి హార్బర్ ఒడ్డుకు చేరాయని ఆయన వివరించారు. తుపాను ప్రభావంపై తెనాలి ఆర్డీవో అధికారులతో చర్చ.. తెనాలి ఆర్డీవో నరసింహులు ఆదివారం హార్బర్లో పర్యటించి మత్స్యశాఖ అధికారులతో, పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరావుతో చర్చించారు. తుపాను ప్రభావం తీరప్రాంతంపై ఏవిధంగా ఉండబోతోందన్న అంశంపై మాట్లాడారు. తుపాను ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండే అవకాశం లేదని, అయినా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట తహశీల్దార్ పి.మోహన్‌కృష్ణ తదితరులున్నారు. -
హార్బర్లో రెండో ప్రమాద సూచిక
నిజాంపట్నం: వర్ధా తుఫాను హెచ్చరికలతో నిజాంపట్నం హార్బర్లో రెండో నంబరు ప్రమాద సూచిక కొనసాగుతున్నదని పోర్టు కన్జర్వేటర్ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారటంతో మూడు రోజులుగా రెండో నంబరు ప్రమాద సూచికను కొనసాగిస్తున్నారు. మచిలీపట్నం–నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. తీరం దాటే సమయంలో ఒక మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.