డిజిటైజేషన్ గడువును రద్దు చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: కేబుల్‌టీవీ నెట్‌వర్క్‌ల మూడోదశ డిజిటైజేషన్ కోసం ఐదు రాష్ట్రాల్లోని 9 సంస్థలకు వివిధ హైకోర్టులు పొడిగించిన గడువును ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. మూడో దశ డిజిటైజేషన్ కు 2015 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది.
ప్రక్రియను పూర్తి చేయడానికి తమకు మరింత సమయం అవసరమనీ, గడువును పొడిగించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, యూపీలలోని 9 కేబుల్‌టీవీ సంస్థలు హైకోర్టులను ఆశ్రయించాయి. ఆ మేరకు హైకోర్టులు సంస్థలకు గడువును పొడిగించాయి. ఈ కేసులను సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కేసులను విచారించిన ఢిల్లీ హైకోర్టు, 9 నెట్‌వర్క్‌ల గడువును రద్దు చేసింది.